విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఉక్కు సత్యాగ్రహం. సత్యారెడ్డి నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నటిస్తున్నారు. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన ఉద్యమం, పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను గద్దర్ కూతురు వెన్నెల విడుదల చేశారు.