Guess The Actor: సాహస యాత్రికుడిగా మారిపోయిన ఈ హీరోను గుర్తుపట్టారా? చేసింది మూడు సినిమాలే అయినా బాగా ఫేమస్‌

పై ఫొటోలో ఉన్న టాలీవుడ్‌ హీరోను గుర్తు పట్టారా? ఇతను ముచ్చటగా చేసింది మూడు సినిమాలే అయినా తెలుగు నాట బాగా ఫేమస్‌. అందులోనూ అతను నటించిన సినిమాల్లో ఒక్క మూవీనే సూపర్‌ హిట్‌గా నిలిచింది. తనకు బోలెడు అభిమానులను తెచ్చిపెట్టింది. అయితే సినిమాల కంటే మరో రకంగా ఈ హ్యాండ్సమ్‌ హీరో తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఫేవరెట్‌గా మారిపోయాడు. అదే

Guess The Actor: సాహస యాత్రికుడిగా మారిపోయిన ఈ హీరోను గుర్తుపట్టారా? చేసింది మూడు సినిమాలే అయినా బాగా ఫేమస్‌
Tollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2023 | 7:52 PM

పై ఫొటోలో ఉన్న టాలీవుడ్‌ హీరోను గుర్తు పట్టారా? ఇతను ముచ్చటగా చేసింది మూడు సినిమాలే అయినా తెలుగు నాట బాగా ఫేమస్‌. అందులోనూ అతను నటించిన సినిమాల్లో ఒక్క మూవీనే సూపర్‌ హిట్‌గా నిలిచింది. తనకు బోలెడు అభిమానులను తెచ్చిపెట్టింది. అయితే సినిమాల కంటే మరో రకంగా ఈ హ్యాండ్సమ్‌ హీరో తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఫేవరెట్‌గా మారిపోయాడు. అదే బిగ్‌ బాస్‌ రియాలిటీ షో. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సెలబ్రిటీ గేమ్‌ షోలోకి అడుగుపెట్టిన అతను తన ఆటతీరుతో బిగ్‌ బాస్‌ ఆడియెన్స్‌ మనసులు గెల్చుకున్నాడు. తుదికంటా తన దైన మాటతీరు, ప్రవర్తనతో టైటిల్‌ విజేతగా నిలిచాడు. ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో?యస్‌. అతను మరెవరో కాదు. బిగ్‌ బాస్‌ నాలుగో సీజన్‌ టైటిల్‌ విన్నర్‌ అభిజిత్‌. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న అతను దేశ వ్యాప్తంగా సాహసయాత్రలు చేస్తున్నాడు. లాంగ్ బైక్ రైడ్స్ కి వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో తన డెస్టినేషన్‌ టూర్‌కు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నాడు అభిజిత్‌. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే ఈ ఫొటోల్లో చాలా బొద్దుగా కనిపించాడు అభిజిత్‌. దీంతో మొదట చాలా మంది అతను గుర్తుపట్టలేకపోయారు.

బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ గా అభిజిత్‌ కు సినిమా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. అయితే అదేమీ జరగలేదు. బిగ్‌ బాస్‌ తర్వాత మోడరన్ లవ్ ఆఫ్ హైదరాబాద్ అనే ఆంథాలజీ వెబ్‌ సిరీస్ లో మాత్రమే అభిజీత్ నటించాడు. ఇక గత కొన్ని నెలలుగా ఈ హీరో ట్రావెలర్ గా మారిపోయాడు. స్వదేశం, విదేశం అని తేడా లేకుండా అన్ని ప్రాంతాలు చుట్టేస్తున్నాడు. ఇకపై అభిజిత్‌ నటించకూడదని నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అందుకే ఇలా నచ్చిన ప్రదేశాలన్నీ చుట్టేస్తున్నాడని సమాచారం.

ఇవి కూడా చదవండి

సాహస యాత్రల్లో బిజి బిజీగా..

View this post on Instagram

A post shared by Abijeet (@abijeet11)

సినిమాలకు దూరంగా..

View this post on Instagram

A post shared by Abijeet (@abijeet11)

లాంగ్ బైక్ రైడ్ లో అభిజిత్..

View this post on Instagram

A post shared by Abijeet (@abijeet11)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.