Bigg Boss 7 Telugu: మళ్లీ ఎలిమినేట్ అయిన రతిక.. 9 వారాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ?..
అడియన్స్ ఊహించినట్లుగానే శనివారం అశ్విని ఎలిమినేట్ కాగా.. ఆదివారం రతిక ఎలిమినేట్ అయ్యింది. కానీ రతిక తన కోసం ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ వాడాలని బతిమాలింది. కానీ రైతు బిడ్డ మాత్రం ససెమిరా అన్నాడు. దీంతో రతిక బయటకు రాక తప్పలేదు. నిజానికి మొదట టైటిల్ విన్నర్ అవ్వాలనే హౌస్ లోకి అడుగుపెట్టింది. కానీ మొదటి వారం ప్రశాంత్ తో స్నేహం.. తర్వాత అతడికే వెన్నుపోటు పొడవడంతో ఆమె ఫుల్ నెగిటివ్ అయ్యింది. తర్వాత వారాల్లో రతిక ప్రవర్తన.. స్నేహాన్ని నమ్మించి వెంటనే ప్లేట్ తిప్పేయడంతో ఆమెపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ నడిచింది.
ఊహించినట్లే జరిగిపోయింది. బిగ్బాస్ సీజన్ 7లో అంతా ఉల్టా పుల్టా అంటూనే గతవారం నామినేషన్స్ తీసేశారు. ఇక ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇక అడియన్స్ ఊహించినట్లుగానే శనివారం అశ్విని ఎలిమినేట్ కాగా.. ఆదివారం రతిక ఎలిమినేట్ అయ్యింది. కానీ రతిక తన కోసం ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ వాడాలని బతిమాలింది. కానీ రైతు బిడ్డ మాత్రం ససెమిరా అన్నాడు. దీంతో రతిక బయటకు రాక తప్పలేదు. నిజానికి మొదట టైటిల్ విన్నర్ అవ్వాలనే హౌస్ లోకి అడుగుపెట్టింది. కానీ మొదటి వారం ప్రశాంత్ తో స్నేహం.. తర్వాత అతడికే వెన్నుపోటు పొడవడంతో ఆమె ఫుల్ నెగిటివ్ అయ్యింది. తర్వాత వారాల్లో రతిక ప్రవర్తన.. స్నేహాన్ని నమ్మించి వెంటనే ప్లేట్ తిప్పేయడంతో ఆమెపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ నడిచింది. దీంతో నాలుగు వారాలకే ఆమెను ఎలిమినేట్ చేశారు. కానీ తర్వాత రెండోసారి మాత్రం వైల్డ్ కార్డ్ ఆఫర్ రతికనే వరించింది. కానీ రెండోసారి ఆమె ఆ అవకాశాన్ని అంతంగా ఉపయోగించుకోలేకపోయింది. మళ్లీ వారం ఆడతా..నెక్ట్స్ వీక్ అంటూ నెట్టుకొచ్చింది. దీంతో ఈవారం ఆమె ఎలిమినేట్ కాక తప్పలేదు. అయితే ఇప్పుడు రతిక రెమ్యునరేషన్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది.
ఫస్ట్ ఎలిమినేట్ కావడానికి ముందు సరిగ్గా నాలుగు వారాలు హౌస్ లో ఉంది. ఇక ఆ తర్వాత ఆమె చేసిన పొరపాట్లు కారణంగా తొందరగానే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కానీ వచ్చిన రెండో అవకాశాన్ని సైతం సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు రెండోసారి కూడా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. నిజానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లినప్పటి నుంచి నామినేషన్స్ అంటే భయపడిపోయింది. గతవారం డేంజర్ జోన్ లో చివరి వరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఒక్క వారం ఉండనివ్వండి అంటూ ఎమోషనల్ అయ్యింది.
View this post on Instagram
రీఎంట్రీగా వచ్చిన తర్వాత అసలు గేమ్ పై ఆసక్తి చూపించలేదు. టాస్కులు ఆడలేదు.. నామినేషన్లలో బలమైన కారణాలు కూడా చెప్పలేకపోయింది. ఇక రతిక ఎలిమినేట్ కావడానికి బలమైన కారణం.. మరోసారి రైతుబిడ్డతో గొడవ పెట్టుకోవడమే. శివాజీ మాటలు విని.. మళ్లీ వెనకే శివాజీ,యావర్, ప్రశాంత్ బ్యాచ్ గురించి మాట్లడం మరోర కారణం అనుకోచ్చు. ఏమైనా మొదట నాలుగు, ఇప్పుడు ఐదు వారాలు హౌస్ లో ఉంది. అంటే మొత్తం 9 వారాలు హౌస్ లో ఉంది. అందుకు రతిక వారానికి రూ.2 లక్షలు పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. అంటే మొత్తం 9 వారాలకు రూ. 18 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.