Aadikeshava OTT: ఓటీటీలోకి ఆది కేశవ.. ఆ పండగకు స్ట్రీమింగ్‌ కానున్న వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల సినిమా

మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌, యంగ్ సెన్సేషన్‌ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'ఆదికేశవ'. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో పక్కా కమర్షియల్‌ మూవీగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ మూవీని తెరకెక్కించాడు. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆది కేశవ ఎట్టకేలకు నవంబర్‌ 24న థియేటర్లలోకి అడుగుపెట్టాడు. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఫస్ట్‌ షో నుంచే

Aadikeshava OTT: ఓటీటీలోకి ఆది కేశవ.. ఆ పండగకు స్ట్రీమింగ్‌ కానున్న వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల సినిమా
Aadikeshava Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2023 | 11:24 AM

మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌, యంగ్ సెన్సేషన్‌ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో పక్కా కమర్షియల్‌ మూవీగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ మూవీని తెరకెక్కించాడు. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆది కేశవ ఎట్టకేలకు నవంబర్‌ 24న థియేటర్లలోకి అడుగుపెట్టాడు. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఫస్ట్‌ షో నుంచే నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. రొటీన్‌ కథ, కథనాలు సినిమాకు మైనస్‌గా మారాయి. బోయపాటి సినిమాల్లోలా వయొలెన్స్‌ మరీ ఎక్కువైపోయింది. ఇక వైష్ణవ్‌- శ్రీలీల జోడి కూడా జనాలకు పెద్దగా కనెక్ట్‌ కాలేకపోయింది. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రం బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ సూపర్బ్‌గా ఉన్నాయంటూ ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఆది కేశవ ఓటీటీ రిలీజ్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. క్రిస్మస్‌ పండగకు ఈ మాస్‌ మసాలా మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. ఆది కేశవ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. సితార్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కడం, వైష్ణవ్‌- శ్రీలీలకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఆది కేశవ ఓటీటీ హక్కులను భారీ ధరకే నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఆది కేశవ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్‌ విలన్‌గా నటించాడు. అపర్ణా దాస్‌, జయ ప్రకాశ్‌, రాధికా శరత్‌ కుమార్‌, సుమన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఏ మాత్రం అలరించలేకపోయిన ఆది కేశవ ఓటీటీలోనైనా ఆకట్టుకుంటాడేమో చూడాలి. కాగా ఉప్పెన సినిమాతో ఎంట్రీలోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాడు వైష్ణవ్‌ తేజ్‌. ఈ మూవీకి ఏకంగా వంద కోట్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత వచ్చిన కొండ పొలం, రంగ రంగ వైభవంగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఆది కేశవ కూడా నిరాశపరిచింది. దీంతో ఈ మెగా హీరో వరుసగా హ్యాట్రిక్‌ పరాజయాలు ఎదుర్కొన్నట్లు అయ్యింది.

ఇవి కూడా చదవండి

క్రిస్మస్ పండగకు స్ట్రీమింగ్..

ఓటీటీ రైట్స్ కోసం భారీడీల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.