AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఏంట్రా ఈ మ్యాజిక్.. థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. రాజాసాబ్ సినిమాను మించిన క్రేజ్…

ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు చేసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అటు మేకర్స్ సైతం సినీప్రియుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలు రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు థియేటర్లలో ప్లాప్ అయిన సినిమాలకు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఓ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సత్తా చాటుతుంది.

Cinema : ఏంట్రా ఈ మ్యాజిక్.. థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. రాజాసాబ్ సినిమాను మించిన క్రేజ్...
Parasakthi Movie
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2026 | 6:13 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఇప్పుడు సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం పరాశక్తి. భారీ అంచనాల మధ్య సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. మృదుల్ కీలకపాత్ర పోషించారు. పరాశక్తి సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ముఖ్యంగా శివ కార్తికేయన్ యాక్టింగ్, సుధా కొంగర మార్క్ డైరెక్షన్ హైలెట్ అయ్యాయి. కానీ ఈ మూవీ థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకుంది. పెద్ద సినిమాల పోటీ కారణంగా ఈ మూవీ తెలుగులో థియేటర్లలో విడుదల కాలేకపోయింది.

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

ఇదంతా పక్కన పెడితే.. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా .. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. ఫిబ్రవరి 7న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో విడుదలైన ఈ మూవీ దూసుకుపోతుంది. తక్కువ సమయంలోనే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది. కేవలం మూడు రోజుల్లోనే అన్ని భాషలలో కలిపి 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు నమోదు కావడం విశేషంగా మారింది. థియేటర్లలో ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఓటీటీలో మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఈ సినిమాను చారిత్రక నేపథ్యం ఉన్న రాజకీయ కథగా తెరకెక్కింది. 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం చుట్టూ ఈ కథ సాగుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యం ఎలా తీవ్ర రూపం దాల్చింది.. ఆ అల్లర్ల నేపథ్యంలో ఇద్దరు సోదరుల జీవితాలు ఎలా మారిపోయాయి అనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

Follow Us