ల్యాప్టాప్ల దొంగతనాల్లో నిందితుడైన ఓ న్యాయవాదిని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అతడు తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా.. 11 రాష్ట్రాల్లో 61 ల్యాప్టాప్ దొంగతనం కేసులు ఎదుర్కొంటున్నాడు. యూనివర్సిటీ హాస్టళ్లు, కాలేజీల్లో విద్యార్థుల ల్యాప్టాప్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసేవాడు. అతడి నుంచి 12 లక్షల విలువైన 16 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు.