చేసింది తక్కువ సినిమాలే.. అయినా రూమర్స్ తోనే ఫేమస్..
Rajitha Chanti
Pic credit - Instagram
08 February 2026
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సీతారామం సినిమాతో పరిచయమైంది. తొలి చిత్రంతోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.
సీతారామం సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ అక్కడే బిజీగా ఉంది.
ఇప్పుడు తెలుగులో డెకాయిట్ సినిమాలో నటిస్తుంది. ఇందులో హీరో అడివి శేష్ నటిస్తున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే తెలుగులోనూ అవకాశాలు వస్తు్న్నట్లు టాక్.
ఇదెలా ఉంటే.. మృణాల్ ఎక్కువగా సినిమా కంటే రూమర్స్ ద్వారానే పాపులర్ అయ్యింది. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది.
కోలీవుడ్ హీరో ధనుష్ తో ఈ అమ్మడు ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని.. ఈ వాలెంటైన్ వీక్ లోనే వీరిద్దరి వివాహం జరుగుందని టాక్.
అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించలేదు. కానీ ధనుష్ తనకు అన్నలాంటి వాడు అని మృణాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది.
తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ చతుర్వేదితో రిలేషన్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవి నిజమా? లేక ప్రమోషన్‌లో భాగమా? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సిందే.