విజయవాడలో టెకీ అమర్ పోలీసుల తీరుపై నిరసన చేపట్టారు. మూడేళ్ల క్రితం చోరీ అయిన తన బైకును కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారని, అయితే కొత్తగా కొన్న బైకుపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల పేరుతో చలాన్లు వేశారని ఆయన ఆరోపిస్తున్నారు. చోరీ అయిన బైకును తిరిగి ఇప్పించాలని లేదా కొత్త బైకుపై విధించిన చలాన్లను రద్దు చేయాలని అమర్ డిమాండ్ చేస్తున్నారు.