వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన బంధువు సాహిల్ వివాహానికి చెన్నై వెళ్లారు. జగన్ రాక గురించి తెలుసుకున్న అభిమానులు, తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన బస చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. వారికి జగన్ చిరునవ్వుతో అభివాదం చేశారు. వివాహ వేడుకలో తమిళ నటులు కార్తీ, సూర్య జగన్ ను కలిశారు, ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.