అప్పుడెప్పుడో కనిపించింది.. ఆతర్వాత అడ్రస్ లేదు.. 

Rajeev 

Pic credit - Instagram

09 February 2026

లవ్లీ సినిమాతో టాలీవుడ్ ను పలకరించింది వయ్యారి భామ శాన్వి . శాన్వి శ్రీవాస్తవ మోడల్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది.

ఈ అమ్మడు ఎక్కువగా కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ డిసెంబర్ 8, 1993న వారణాసిలో జన్మించింది.

శాన్వి తన నటనా జీవితాన్ని 2012లో లవ్లీ" చిత్రంతో ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె ఇంకా చదువుతోంది.

తెలుగులో లవ్లీ సినిమా తర్వాత అడ్డా, రౌడీవంటి చిత్రాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు పొందింది.

 కన్నడలో ఈ అమ్మడు క్రేజీ మూవీస్ చేసింది. తక్కువ సమయంలోనే అక్కడ పాపులర్ అయ్యింది. కానీ ఆతర్వాత ఆఫర్స్ అందుకోలేకపోయింది. 

కొన్ని సినిమాల్లో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కానీ చేసిన సినిమాల్లో మొదటి సినిమా తప్ప మిగిలినవి అన్ని ఫ్లాప్ అయ్యాయి.

కాగా  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.