Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌పై సర్వే.. భారీగా పెరుగుతోన్న అమర్‌ దీప్‌ గ్రాఫ్‌.. టాప్‌-5లో ఉండేది ఎవరంటే?

ప్పటిలా టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ కాకుండా టాప్‌ -7 కంటెస్టెంట్స్‌తో ఫినాలే నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మరో 3 వారాల్లో ఈ షో ముగియనుందని తెలుస్తోంది. ఏడో సీజన్‌లో మొత్తం 19 కంటెస్టెంట్లు అడుగుపెట్టగా 12 వారాలు ముగిసే సరికి 8 మంది మిగిలారు. శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ హౌజ్‌లో ఉన్నారు.

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌పై సర్వే.. భారీగా పెరుగుతోన్న అమర్‌ దీప్‌ గ్రాఫ్‌.. టాప్‌-5లో ఉండేది ఎవరంటే?
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2023 | 12:31 PM

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగుపెట్టిందీ సెలబ్రిటీ గేమ్‌ షో. త్వరలోనే ఈ రియాల్టీ షోకు ఎండ్‌ కార్డ్‌ పడనుంది. డిసెంబర్‌ 17న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫైనల్‌ జరగనుందని టాక్‌ వినిపిస్తోంది. ఎప్పటిలా టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ కాకుండా టాప్‌ -7 కంటెస్టెంట్స్‌తో ఫినాలే నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మరో 3 వారాల్లో ఈ షో ముగియనుందని తెలుస్తోంది. ఏడో సీజన్‌లో మొత్తం 19 కంటెస్టెంట్లు అడుగుపెట్టగా 12 వారాలు ముగిసే సరికి 8 మంది మిగిలారు. శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ హౌజ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా తారలు, మూవీ విషయాలపై ఎప్పటికప్పుడు సర్వేలతో వార్తల్లో ఉండే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ బిగ్‌ బాస్‌ టాప్‌- 5 కంటెస్టెంట్స్‌పై సర్వే నిర్వహించింది. ఈ మేరకు రియాలిటీ షో కంటెస్టెంట్స్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఎప్పటిలాగే ఆర్మాక్స్‌ మీడియా సంస్థ సర్వేలో శివాజీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దీనికి తోడు శివాజీ పీఆర్‌ టీమ్స్‌, నాగార్జన కూడా అతనికి సపోర్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షో ఎండింగ్‌కు వచ్చేసరికి శివాజీ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడు. దీంతో అతని గ్రాఫ్‌ తగ్గుతోందని తెలుస్తోంది. ఇక రెండో స్థానంలో ఇదే శివాజీ బ్యాచ్‌కు చెందిన పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. కామన్‌ మ్యాన్‌ ట్యాగ్‌తో రైతు బిడ్డ దూసుకెళుతున్నాడు. ఇక బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ప్రారంభంలో భారీగా నెగెటివిటీని మూట గట్టుకున్న అమర్‌ దీప్‌ ఇప్పుడు టైటిల్‌ రేసులో దూసుకెళుతోండడం గమనార్హం. ఇక నటుడు గౌతమ్‌ కృష్ణ ఈ జాబితాలో కొనసాగుతున్నాడు. షోలో ఉన్న శివాజీ, సీరియల్‌ బ్యాచ్‌లకు దూరంగా ఉంటూ ఆకట్టుకుంటున్నాడు గౌతమ్‌. ఇక క టాప్ 5-లో శోభా శెట్టి నిలిచింది. శివాజీ బ్యాచ్‌కు ధీటుగా ఆడుతోన్న ఈ కన్నడ కుట్టీ కూడా టైటిల్‌ రేసులో ఉంది. మరి ఈ టాప్‌- 5 కంటెస్టెంట్స్‌లో ఎవరు బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేతగా నిలుస్తారో మరో మూడు వారాల్లో తెలియనుంది.

ఇవి కూడా చదవండి

ఆర్మాక్స్ సర్వే రిపోర్టు..

హౌజ్ లో అమర్ దీప్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?