Bigg Boss 7 Telugu Promo: సీరియల్ బ్యాచ్ టార్గెట్ శివాజీనే.. ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..

ఇక అమర్ దీప్, శోభా సైతం శివాజీకి నామినేట్ చేయగా.. ఎప్పటిలాగే గౌతమ్ మరోసారి శివాజీని పట్టుకున్నాడు. ఇక తాజాగా విడుదలైన బిగ్‏బాస్ ప్రోమోలో నామినేషన్స్ హీట్ పెంచాయి. నువ్వా, నేనా అన్న రేంజ్ లో వాదనలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వారం నామినేషన్స్ లో మాత్రం శివాజీ గట్టిగానే సీరియస్ అయ్యాడు. ఒక్కొక్కరికి సూటిగా ఇచ్చిపడేశాడు. ఇక ప్రశాంత్, శోభా, ప్రియాంకను ఇద్దరినీ నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఏం జరిగిందో చూద్ధాం.

Bigg Boss 7 Telugu Promo: సీరియల్ బ్యాచ్ టార్గెట్ శివాజీనే.. ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..
Bigg Boss 7 Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 27, 2023 | 12:11 PM

బిగ్‏బాస్ సీజన్ 7లో ఇప్పుడు పదమూడో వారం ఎంటర్ అయ్యింది. అయితే పన్నెండో వారం వీకెండ్‏లో శివాజీ వర్సెస్ సీరియల్ బ్యాచ్ మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. గత వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో అమర్ దీప్ కు హెల్ప్ చేయకపోవడం.. ఆ తర్వాత వీకెండ్ లో నాగార్జున ముందే ప్రియాంకతో గొడవపడడంతో ఈ వారం సీరియల్ బ్యాచ్ టార్గెట్ శివాజీ అయ్యాడు. సోమవారం శివాజీతో క్లారిటీ తీసుకుంటా నామినేషన్స్ ఉంటూ ముందే హింట్ ఇచ్చింది ప్రియాంక. ఇక అమర్ దీప్, శోభా సైతం శివాజీకి నామినేట్ చేయగా.. ఎప్పటిలాగే గౌతమ్ మరోసారి శివాజీని పట్టుకున్నాడు. ఇక తాజాగా విడుదలైన బిగ్‏బాస్ ప్రోమోలో నామినేషన్స్ హీట్ పెంచాయి. నువ్వా, నేనా అన్న రేంజ్ లో వాదనలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వారం నామినేషన్స్ లో మాత్రం శివాజీ గట్టిగానే సీరియస్ అయ్యాడు. ఒక్కొక్కరికి సూటిగా ఇచ్చిపడేశాడు. ఇక ప్రశాంత్, శోభా, ప్రియాంకను ఇద్దరినీ నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఏం జరిగిందో చూద్ధాం.

ఈ వారం నామినేషన్స్ అనే నరకాన్ని ఎదుర్కొవాల్సిన ఇద్దరు ఎవరో ఎంచుకుని అందుకు తగిన కారణాన్ని చెబుతూ వారి ముఖంపై పెయింట్ వేయాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్‏బాస్ . ఇక ముందుగా ప్రియాంక.. శివాజీని నామినేట్ చేస్తూ.. మీరు నా గేమ్ చూసి చాలా సార్లు ప్రోత్సాహించారు. అంతకంటే ఎక్కువగా నాపై ఎక్కువగా నెగిటివిటి పెట్టుకున్నారు.. అని అనడంతో.. నీకు ఎవరైన నచ్చకపోతే వాళ్లను నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తావ్ అంటూ కౌంటరిచ్చాడు శివాజీ. దీంతో ప్రియాంక రియాక్ట్ అవుతూ నన్ను నెగిటివ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయట్లేదు అంటూ రివర్స్ అయ్యింది. ఇక ఆ తర్వాత గౌతమ్ వచ్చి.. శివాజీని నామినేట్ చేస్తూ.. మీతో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని క్లియర్ చేద్దామనుకుంటున్నాను అంటూ డాక్టర్ బాబు అన్నాడు. దీంతో ఇక్కడ ఉండడం కోసమే నాతో ప్రతివారం గొడవ పెట్టుకుంటున్నావ్ అన్నాడు శివాజీ.

అయితే నామినేషన్లలో శివాజీకి అసలు షాకిచ్చాడు అర్జున్. కెప్టెన్సీ టాస్కులో అర్జున్ కోసం నిలబడిన శివాజీనే నేరుగా నామినేట్ చేశాడు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది నాగార్జున సర్ నోటివెంట వచ్చింది అంటూ తన కారణాన్ని చెప్పాడు. ఇక ఆ తర్వాత శివాజీని అర్జున్ ను నామినేట్ చేస్తూ.. ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటే.. నేను నిజంగానే వేసుకున్నాను. నువ్వు గేమ్ ఆడుతున్న విషయం తెలుసుకోలేకపోయాను అంటూ శివాజీ అర్జు్న్ వేసిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసేశాడు. ఆ తర్వాత అర్జున్ మాట్లాడుతూ.. తెలియని మిత్రుడి కంటే తెలిసి శత్రువు బెటర్ అని అర్జున్ మాటలను గుర్తుచేశాడు. కెప్టెన్సీ టాస్కు నుంచి డ్రాప్ అవుతున్నా అని విషయం చెప్పకపోవడమే నా మిస్టేక్ అంటూ అర్జున్ అన్నాడు. ఇక ఆతర్వాత గౌతమ్, శివాజీ మధ్య పెద్ద రచ్చే జరిగింది. చివరగా ప్రశాంత్.. శోభా, ప్రియాంకను నామినేట్ చేయడంతో ప్రోమో ముగిసింది. ఈ వారం అమర్ తప్ప మిగతా ఏడుగురు నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.