Brahmamudi, November 27th episode: స్వప్న తప్పు చేసిందన్న రాజ్.. ఛాలెంజ్ విసిరిన కావ్య.. ఆవేదనలో అప్పూ!
ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో కావ్య గదిలోకి వచ్చేసరికి.. చీఛీ.. ఎవర్ని నమ్మాలో.. ఎవర్నీ నమ్మ కూడదో అర్థం లేకుండా పోతుంది. అందరికీ ఇష్టా రాజ్యం అయిపోతుంది. ఎవరికి నచ్చినట్టు.. వచ్చినట్టు బ్రతికేస్తున్నారని రాజ్ అంటాడు. ఇవన్నీ విన్న కావ్య.. ఎవరి గురించి మీరు మాట్లాడేది.. అని అడుగుతుంది. ఇంకెవరు మీ అక్క గురించి.. తన దగ్గర నోరు తప్ప.. ఒక్క సాక్ష్యం అయినా ఉందా అని అని రాజ్ అంటే.. శీలానికి సాక్ష్యం కావాల.. ఆడదాని పవిత్రతకు సాక్ష్యం కావాలా అని కావ్య అంటుంది. అంటే ఆ మాటలు చెప్పి ఇష్ట్యారాజ్యంగా బ్రతికేయవచ్చా..
ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో కావ్య గదిలోకి వచ్చేసరికి.. చీఛీ.. ఎవర్ని నమ్మాలో.. ఎవర్నీ నమ్మ కూడదో అర్థం లేకుండా పోతుంది. అందరికీ ఇష్టా రాజ్యం అయిపోతుంది. ఎవరికి నచ్చినట్టు.. వచ్చినట్టు బ్రతికేస్తున్నారని రాజ్ అంటాడు. ఇవన్నీ విన్న కావ్య.. ఎవరి గురించి మీరు మాట్లాడేది.. అని అడుగుతుంది. ఇంకెవరు మీ అక్క గురించి.. తన దగ్గర నోరు తప్ప.. ఒక్క సాక్ష్యం అయినా ఉందా అని అని రాజ్ అంటే.. శీలానికి సాక్ష్యం కావాల.. ఆడదాని పవిత్రతకు సాక్ష్యం కావాలా అని కావ్య అంటుంది. అంటే ఆ మాటలు చెప్పి ఇష్ట్యారాజ్యంగా బ్రతికేయవచ్చా అని రాజ్ అంటాడు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. అది అందరికీ విడిగా బ్రతికింది.. విచ్చలవిడిగా బ్రతకలేదని కావ్య అంటుంది. నువ్వే సపోర్ట్ ఇవ్వాలి.. అక్క తప్పుకి చెల్లెలి సపోర్ట్ ఛీ.. సమర్థించడానికి కూడా ఒక హద్దు ఉండాలి.. హద్దుల గురించి తెలిసిన మనిషే అయితే.. పెళ్లి అయిన తర్వాత ఆ అరుణ్ తో పరిచయం గురించి చెప్పాలి. నేను చూశాను వాడిని కలవడం.. కలిసి మాట్లాడటం అని రాజ్ అంటాడు. అంటే ఒక ఆడపిల్ల.. పూర్వపు పరిచయాలతో ఒక మగాడితో మాట్లాడటం నేరమా అని కావ్య అడుగుతుంది.
మీ అక్క తప్పు చేసింది.. నేను రాహుల్ కే సపోర్ట్ చేస్తానని తెగేసి చెప్తున్న రాజ్:
నగలు తాకట్టు పెట్టి మరీ అతనికి డబ్బు ఇవ్వడం అవసరమా అని రాజ్ అడుగుతాడు. ఏ సందర్భంలో డబ్బు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పింది కదా అని కావ్య సమాధానం ఇస్తుంది. ఏ నువ్వు చెప్పలేదా కథలు.. కడుపు విషయంలో మీ అక్కకు సపోర్ట్ చేస్తూ కథలు చెప్పావు కదా అని రాజ్ అంటే.. అది వేరు.. ఇది వేరు.. మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా ఆలోచించుకున్నాను. కానీ మీరు కూడా అక్క భర్తలాగే.. అత్త లాగే మాట్లాడితే నా దృష్టిలో చాలా తక్కువ అయిపోతారని కావ్య అంటుంది. నీ దృష్టిలో ఏమైనా అనుకో నాకు అనవసరం అని రాజ్ అంటే.. మర్యాద నేర్చుకోండి.. ఏం తెలుసని మీరు ఒక ఆడపిల్ల శీలం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? ఏం తెలుసని మా అక్క ప్రవర్తన గురించి కించ పరుస్తున్నారు? అని కావ్య నిలదీస్తుంది. ఏం తెలుసా.. నాతో పెళ్లికి సిద్ధపడ్డ మీ అక్క.. రాహుల్ రమ్మనగానే పీటల మీద నుంచి వెళ్లి పోయింది. అటువంటి వ్యక్తిత్వం మీ అక్కదని రాజ్ అంటాడు. అది మా అక్క అమాయకత్వం.. రాహుల్ నేర్పరితనం.. అదంతా రాహుల్ మీకు చెప్పాడు కదా.. కానీ ఈ విషయంలో మాత్రం ఏదైనా అంటే నేను ఊరుకోనని అంటుంది కావ్య. ఏయ్ సాక్ష్యాలే కాదు.. మీ అక్క చేసిన పనులు కూడా చేసింది నేరమని, పాపమని చెబుతుంటే.. నువ్వు నా వ్యక్తిత్వాన్ని తప్పు పడుతున్నావేంటి? నేను కూడా మూర్ఖంగా మాట్లాడితే.. మీ అక్కవే కాదు.. నీ పాత తప్పులన్నీ బయట పెట్టి నిన్ను బయటకు గెంటేసేవాడినని రాజ్ అంటాడు.
స్వప్న కోసం రాజ్ – కావ్యల ఛాలెంజ్:
రాజ్ మాటలకు షాక్ అవుతుంది కావ్య.. పెళ్లాన్ని అంత తేలిగ్గా పురుగును గెంటేసినట్టు గెంటి పారేస్తానంటే.. తల దించుకుని, చేయని తప్పుకు వెళ్లి పోయే కాలం కాదండి ఇది.. పురుష అహంకారానికి బలి అయ్యి పోయే కాలం కాదు. నిజానికి.. అబద్ధానికి మధ్య నిలబడి ఉంది.. ఆ రేఖను నేను చెరిపేస్తాను.. ఆ నిజాన్ని నేను నిరూపిస్తానని కావ్య అంటుంది. ఏం నిరూపిస్తావ్.. గడప దాటి మరో మగాడితో మాట్లాడిన మీ అక్కని నువ్వు సమర్దిస్తావని అస్సలు ఊహించ లేదు. నువ్వు నా గురించి ఎంత తక్కువ ఊహించుకున్నా పర్వాలేదు. కానీ రాహుల్ నింద వేయడంలో అర్థం ఉందనే వాదిస్తాను. సాటి మగాడిగా స్పందిస్తానని రాజ్ అంటే.. సాటి స్త్రీ శీలం గురించి మాట్లాడే హక్కు మీకు లేదని తేలి పోయింది. మీరు కూడా అందరిలాంటి మగవారే.. కానీ నేను ఆడ పిల్లని.. పుట్టుకతోనే పవిత్రత గురించి అన్నింటి గురించి అన్నీ రంగరించి చెప్తారు. ఆ ధైర్యంతో చెప్తున్నా కానీ.. నింద నిందే.. ఆ నిజాన్ని నేను వెలికి తీస్తాను. ఇది మా అక్క కోసం చేసే పోరాటమే కాదు.. ఒక స్త్రీ చాలా సులభంగా పరాయి మగవాడికి లొంగి పోతుందన్న మీ లాంటి మగవారికి గుణ పాఠం నేర్పడానికి కూడా.. సాటి స్త్రీని తక్కువ చేయకూడదన్న ఆరాటం. ఇది మన మధ్య జరిగే అంతర్యుద్దం అని చెప్తుంది కావ్య.
స్వప్నని రెచ్చగొట్టిన రాహుల్.. బయటకు గెంటేసిన స్వప్న:
ఇక మరోవైపు స్వప్న.. రాహుల్ అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుని బాధ పడుతుంది. అప్పుడే రాహుల్ వస్తాడు.. ఏంటే మహా రాణిలా బెడ్ మీద కూర్చున్నావ్.. తప్పు చేసిన తర్వాత కూడా ఇంకా ఏంటే గట్టిగా మాట్లాడుతున్నావ్? అని రాహుల్ అంటే.. నేనేం తప్పు చేశాను.. అలాంటి పనులు నీకు అలవాటు.. నాకు లేదని స్వప్న అంటే.. అలా అనే ఇంట్లో అందర్నీ నమ్మించావ్.. కానీ అసలైన తిరుగు బోతువు నువ్వు.. అని రాహుల్ అంటే.. ఆవేశంగా లేచిన స్వప్న.. అలా అన్నందుకే ఇంట్లో అందరి ముందు చాచి గట్టిగా చెంప మీద సమాధానం చెప్పాను. మళ్లీ చెప్పాలని ఆశ పడుతున్నావా అని స్వప్న అంటే.. మొగుడిని కొట్టడం గొప్పదనం అనుకుంటున్నావా అని రాహుల్ అంటే.. మొగుడివి అని అహంకారం చూపిస్తున్నావా.. నిజం త్వరలోనే బయటకు వెళ్తుంది. నిజం బయటకి రావడం కాదు.. నువ్వే ఇంట్లో నుంచి బయటకు వెళ్తావ్ అని రాహుల్ అంటాడు. అంటూ కలగనకు.. ఆ కల నిజంగానే మిగిలిపోతుంది. అంటే నేను తప్పు చేయాలని నువ్వు కోరుకుంటున్నావా. దొంగ సాక్ష్యాలు పుట్టించడం గురించి నాకంటే నీకే బాగా తెలుసని స్వప్న అంటుంది. అంటే ఆ ఫొటోలు నిజం కాదంటున్నావా.. నువ్వు అరుణ్ కి డబ్బులు ఇవ్వలేదా అని రాహుల్ అంటాడు. రాహుల్ మాటలకు ఒళ్లు మండిన స్వప్న.. తలగడ, బెడ్ షీట్ బయటకు పడేసి.. స్వప్నని కూడా బయటకు గెంటేస్తుంది. మా మామ్ నీతో గొడవ పెట్టుకోకూడదని వెళ్లి పోతున్నా.. లేదంటే నిన్ను గెంటేసేవాడిని అని రాహుల్ అనుకుని వెళ్లి పోతాడు.
ప్రతిక్షణం మర్చిపోవడానికే ట్రై చేస్తున్నా.. కానీ మనసు నా మాట వినడం లేదమ్మా: అప్పూ
ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ బాధతో బయటకు వచ్చి కూర్చుంటుంది. కనకం దగ్గరకు వచ్చి.. నాన్న అన్న మాటలకు బాధ పడుతున్నావా అని అడుగుంది. ఇంట్లో అందరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదా అని కనకం అడిగితే.. కాదని చెప్తుంది అప్పూ. నిజానికి, అబద్ధానికి తేడా తెలుస్తున్నా.. కన్నీళ్లు ఆగడం లేదు అమ్మా అందుకే ఈ కన్నీళ్లు ఆగడం లేదని అంటుంది. ఒక విధంగా మీ నాన్న చెప్పిందే నిజమని అనిపిస్తుంది. ఒక్కసారి అలా ఎందుకు ఆలోచించడం లేదని కనకం అడిగితే.. ప్రతి క్షణం మర్చిపోవడానికే ట్రై చేస్తున్నా.. కానీ నా మనసు ఆగడం లేదు. కళ్యాణ్ నాతో ఉన్నప్పుడు.. బాగుంది అనుకున్నా.. కానీ ఇప్పుడు దూరం అవుతాడని తెలిసి కూడా అది నమ్మలేకపోతున్నా.. వాడు కూడా నాలాగే తిరిగాడు కదమ్మా.. నాకు అనిపించినట్టు వాడికి ఎందుకు అనిపించడం లేదు. ఒక వేళ నన్ను ఫ్రెండ్ లానే చూస్తే.. నాకు దెబ్బ తగిలితే వాడు ఎందుకు బాధ పడ్డాడు. నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నానని తెలిస్తే ఎందుకు విడిపించాడు. ఇంత ప్రేమ చూపిస్తే.. ఏ మనిషికైనా ఆశ కలుగుతుంది కదా అమ్మా.. పోనీలే నా కర్మ అనుకుని వదిలేద్దాం అనుకుంటే ఫ్రెండ్ అనుకునే వెనకాలే తిరుగుతున్నాడు. నా ముందే అనామికతో క్లోజ్ గా ఉంటున్నాడు. ఏదో తెలియని బాధ. కానీ మనసు నా మాట వినడం లేదని అప్పూ బాధ పడుతుంది. ఇది ఇంతలా ప్రేమించిందని తెలుస్తే.. కానీ నేను తల్లిగా ఏం చేయగలను. దీని ప్రేమను ఎలా ప్రేమించగలను అని మనసులో ఆలోచిస్తుంది కనకం.
రాజ్ ని భయ పెట్టిన కావ్య..
ఆ తర్వాత ఇక తెల్లారుతుంది. రాజ్ లేవగానే.. కళ్ల ఎదురుగా నిల్చుంటుంది కావ్య. దీంతో రాజ్ భయ పడతాడు. ఇక కావ్య డ్రామా షురూ చేస్తుంది. నాకు జ్ణానోదయం అయింది. మా అక్క ఏ తప్పూ చేయలేదని.. రుజువు చేయడానికి ఈ రోజు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్ట బోతున్నా. సెంటి మెంటిల్ గా మీ పాదాలకు నమస్కారం చేసుకుని.. శ్రీకారం చుట్ట బోతున్నా.. ఎలా ఉంది. మీ ఆశీర్వాదం కావాలని కావ్య అంటే.. రాజ్ ఇవ్వను.. అని బెట్టు చేస్తాడు. గట్టిగా అరవకండి.. నేను మిమ్మల్ని ఏదో చేస్తున్నా అనుకుంటారని కావ్య అంటే.. ఏమని ఆశీర్వాదం ఇవ్వాలి? అని రాజ్ అడుగుతాడు. ఆ ఆశీర్వాదం ఏంటో నేను అడగకూడదు. మీరే చెప్పండి అని కావ్య పట్టు బట్టి మరీ ఆశీర్వాదం తీసుకుంటుంది. దీంతో రాజ్ తప్పక.. ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు.
అప్పూ కోసం కనకం బాధ.. కళ్యాణ్ తో పెళ్లి చేసేందుకు ప్లాన్:
ఇక అప్పూ కోసం.. ఆలోచిస్తూ బాధ పడుతుంది కనకం. అప్పుడే కనకం అక్క అప్పూని టిఫిన్ తినడానికి రమ్మంటే.. ఏంటి పెద్దమ్మా.. ఇంత విషం పెట్టు.. నాకూ ఏద బాధ ఉండదు.. మా అమ్మకి ఏ బాధా ఉండదని అని వెళ్లి పోతుంది. చూశావా అక్కా అది ఎంత మాట అందో.. పిల్లల్ని చంపేయడానికా కని పెంచింది అని కనకం అంటుంది. అది ఆ పిల్లాడినే చేసుకుంటాను అని చెప్పి మొండి పట్టు పట్టి ఉంటే అప్పుడు ఇబ్బంది అయ్యేది. అని కనకం అక్క అంటే.. అవునా.. ఏ రకంగానూ ఆ అబ్బాయితో పెళ్లి చేయడానికి కుదరదా.. అని అంటుంది కనకం. ఏమ్ మాట్లాడుతున్నావే.. దీని వల్ల అక్కడున్న నీ ఇద్దరి కూతుళ్లకు కూడా ఇబ్బంది అని కనకం అక్క అంటుంది. ఇవాళ్టితో ఇక్కడి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.