Dahanam OTT: థియేటర్లలో రిలీజై 8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన అవార్డుల సినిమా.. ‘దహనం’ ఎక్కడ చూడొచ్చంటే?
సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా ఇదే సంగతి. కొన్ని సినిమాలైతే మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ రిలీజ్‌లకే నోచుకోవడం లేదు. మరికొన్ని మూవీస్ థియేట్రికల్ రిలీజైన తర్వాత ఆరేడు నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి
సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా ఇదే సంగతి. కొన్ని సినిమాలైతే మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ రిలీజ్‌లకే నోచుకోవడం లేదు. మరికొన్ని మూవీస్ థియేట్రికల్ రిలీజైన తర్వాత ఆరేడు నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అలా ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే దహనం. గతంలో లాహిరి లాహిరి లాహిరిలో, ధన లక్ష్మి ఐలవ్యూ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆదిత్య ఓం ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఆచారాలు, కట్టు బాట్ల, సంప్రదాయాల నేపథ్యంలో ఒక సందేశాత్మక కథనంతో దహనం సినిమా తెరకెక్కింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా పలు చలన చిత్రోవాల్లో ప్రదర్శితమైంది. అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడీ దహనం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (నవంబర్ 26) నుంచి దహనం మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.
ఆడారి మూర్తి సాయి దహనం సినిమాలో ఆదిత్య ఓం తో పాటు శాంతి చంద్ర, సోనిరెడ్డి, ఎఫ్ఎం బాబాయ్, రాజీవ్ నాయక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓపెన్ ఫీల్డ్ మీడియా బ్యానర్‌పై డాక్టర్ సతీష్ కుమార్ ఈ మూవీని నిర్మించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. దహనం మూవీ అంతా 1984 నేపథ్యంలో సాగుతుంది. విశాఖపట్నంలోని వాడరేవుల పల్లి గ్రామానికి చెందిన పూజారి భరద్వాజ శాస్త్రి(ఆదిత్య ఓమ్) శివాలయంలో పూజలు చేసుకుంటూ భార్య, కూతురితో కలిసి ఉంటాడు. ఆ గుడి కిందే ఒక కాటికాపరి (ఎఫ్‌ఎం బాబాయ్) ఉంటాడు. తక్కువ కులానికి చెందిన అతను ఒక్కసారైనా ఆ గుడిలోని శివలింగాన్నితాకాలనుకుంటాడు. అదే సమయంలో ఊరి భూస్వామి కన్ను ఆ శివాలయంపై పడుతుంది. మరి కాటికాపరి శివలాంగాన్ని తాకాడా? శివాలయం ఎవరికి దక్కింది? అన్నదే దహనం సినిమా కథ.
Telugu film #Dahanam (2023) now available for rent on @PrimeVideoIN Store.#SalaarTrailer #IPLretention #PawanaKalyan #Animal #GunturKaaram pic.twitter.com/xQSUe11MRn
— OTT Updates (@itsott) November 26, 2023
ఉత్తమ నటునిగా ఆదిత్యం ఓం..
.@adityaaom received Best Actor Awards @ 2 Film Festivals For #Dahanam#RajasthanInternationalFilmFestival #PrimeInternationalFilmFestival A Murthy Adari Directorial Produced by Dr P Satish OTT Release Soon pic.twitter.com/WTxNN7Rj2r
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..