Cyber ​​Crime: 60 రూపాయలకు ఆశపడ్డాడు..రూ.16 లక్షలు పోగొట్టుకుని బోరుమన్నాడు

జగన్నాథపురంలో నివాసముంటున్న అనిరుధ్ మిత్ర అనే వ్యక్తి తనకు జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించాడు. తను ఎలా మోసపోయాడు వివరిస్తూ.. పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. వాట్సాప్ మెసేజ్‌ ద్వారా అతడు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడినట్టుగా వివరించారు. కేటుగాళ్లు పన్నిన వలలో పడ్డ అనిరుధ్‌ ఏకంగా రూ.16 లక్షల 66 వేలు పోగొట్టుకున్నాడు. ముందుగా.. తనకు మోనికా అనే అమ్మాయి మేసేజ్‌ చేసినట్టుగా చెప్పాడు. మోనికా తను వెబ్ డీయూ కంపెనీ ప్రతినిధిగా తనను తాను పరిచయం చేసుకుందని చెప్పాడు.

Cyber ​​Crime: 60 రూపాయలకు ఆశపడ్డాడు..రూ.16 లక్షలు పోగొట్టుకుని బోరుమన్నాడు
Cyber Crime
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 27, 2023 | 3:01 PM

ఆన్‌లైన్ నేరాల కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుక్కుని ఎంతో మంది ప్రజలు బాధితులుగా మారి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ప్రతిరోజూ ఇలాంటి వార్తలు అనేకం వస్తూనే ఉన్నాయి. ఒక్కోసారి ఉద్యోగం ఇప్పిస్తానని, ఒక్కోసారి తక్కువ ధరకే రుణం ఇప్పిస్తానని మోసం చేస్తూ మోసగాళ్లు రోజుకో కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విద్యావంతులు, మేధావులు కూడా ఈ మోసగాళ్ల బారిన పడుతున్నారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. ఇక్కడ ఒక వ్యక్తి కేవలం 60 రూపాయల విషయంలో ఏకం 16 లక్షల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ వ్యక్తి వర్క్‌ఫ్రమ్‌ హోం పేరుతో వేసిన వలలో పడి మోసపోయినట్టుగా తెలిసింది.

వారణాసిలోని భేలుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథపురి కాలనీ వెలుగు చూసింది తాజా సైబర్‌ మోసం కేసు ఉదంతం.. జగన్నాథపురంలో నివాసముంటున్న అనిరుధ్ మిత్ర అనే వ్యక్తి తనకు జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించాడు. తను ఎలా మోసపోయాడు వివరిస్తూ.. పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. వాట్సాప్ మెసేజ్‌ ద్వారా అతడు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడినట్టుగా వివరించారు. కేటుగాళ్లు పన్నిన వలలో పడ్డ అనిరుధ్‌ ఏకంగా రూ.16 లక్షల 66 వేలు పోగొట్టుకున్నాడు. ముందుగా.. తనకు మోనికా అనే అమ్మాయి తనను వర్క్‌ఫ్రమ్‌ హోం పేరిట మేసేజ్‌ చేసినట్టుగా చెప్పాడు.

మోనికా తను వెబ్ డీయూ కంపెనీ ప్రతినిధిగా తనను తాను పరిచయం చేసుకుందని చెప్పాడు. ఇంటి నుంచే డబ్బు సంపాదించేందుకు ఇదొక గొప్ప అవకాశం అని మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించిదన్నారు. ప్రతిరోజూ 21 టార్గెట్‌లు ఉంటాయని, అన్ని పూర్తి చేస్తే..ఒక్కో టాస్క్‌కు రూ.60 ఇస్తానని సదరు లేడీ ఎంతో నమ్మకంగా చెప్పింది. ఆ తరువాత ఆ అమ్మాయి ఏది చెబితే అది చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత క్రమంగా బాధితుడి అకౌంట్‌ నుంచి రూ.16 లక్షలకు పైగా తన ఖాతాలో జమ చేశాడు. ఆ వ్యక్తికి అనుమానం రావడంతో వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

వాట్సాప్‌ వచ్చిన సందేశం ఆధారంగా ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును సైబర్‌ క్రైం బ్రాంచ్‌కు బదిలి చేశారు. ఈ మేరకు సారనాథ్ సైబర్ పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ ప్రారంభించి చర్యలు తీసుకునేలా చూస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా