నారింజ తొక్కల పొడితో చర్మం మెరుస్తుంది.. అద్భుతమైన ఫేస్ మాస్క్‌లు ఇవిగో!

నారింజ తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుండి రక్షించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. నారింజలో విటమిన్ ఏ,సి, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అలాగే నారింజ తొక్కల్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త కణాలు పుట్టేలా చేస్తుంది. చర్మంలో విష వ్యర్థాలు తొలిగేలా చేసి, స్కిన్ మెరిసేలా చేస్తుంది. ఆరెంజ్ తొక్కను కొన్ని రకాల ఫేస్‌ ప్యాక్‌లు తయారు చేసుకుని వాడితే.. ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

నారింజ తొక్కల పొడితో చర్మం మెరుస్తుంది.. అద్భుతమైన ఫేస్ మాస్క్‌లు ఇవిగో!
Orange Peel
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 27, 2023 | 4:58 PM

శీతాకాలం వచ్చిందంటే మార్కెట్‌ నిండా రంగురంగుల పండ్లు, కూరగాయలు కనిపిస్తాయి. ముఖ్యంగా నారింజ పండ్లు చలికాలంలో విరివిగా లభిస్తాయి. మనమందరం నారింజ పండ్లను తింటాము. కానీ, తొక్కను మాత్రం చెత్తాలో పడవేస్తుంటాము..అయితే, ఈ రోజు నుండి అలా చేయకండి.. నారింజ తొక్కను విసిరిపారేయకండి.. ఎందుకంటే.. ఆరెంజ్ తొక్కలో చర్మ సంరక్షణలో సహాయపడే అనేక పోషకాలు ఉన్నాయి. ఆరెంజ్ తొక్కలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మొదలైన వివిధ పోషకాలను కలిగి ఉన్నందున చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఆరెంజ్ తొక్కలో పాలీఫెనాల్స్, విటమిన్ సి ఉంటాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆరెంజ్ పీల్ టోనర్ రంధ్రాలను బిగించి ముఖంపై ఏర్పడే అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది.

నారింజ తొక్కలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. నారింజ తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుండి రక్షించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. నారింజలో విటమిన్ ఏ,సి, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అలాగే నారింజ తొక్కల్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త కణాలు పుట్టేలా చేస్తుంది. చర్మంలో విష వ్యర్థాలు తొలిగేలా చేసి, స్కిన్ మెరిసేలా చేస్తుంది. ఆరెంజ్ తొక్కను కొన్ని రకాల ఫేస్‌ ప్యాక్‌లు తయారు చేసుకుని వాడితే.. ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

ఒక టీస్పూన్ నారింజ తొక్క పొడి, ఒక టీస్పూన్ పెరుగు కలిపి ప్యాక్ తయారు చేయండి. తర్వాత ఈ ప్యాక్‌ని మీ ముఖం, మెడకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయండి. ఇంట్లో నారింజ తొక్కను ఎండబెట్టి గ్రైండ్ చేయడం మంచిది. కానీ అలర్జీ సమస్యలు ఉన్నవారు ఆరెంజ్ పౌడర్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

నారింజ తొక్క పొడి, ఒక టీస్పూన్ అలోవెరా జెల్, ఒక టీస్పూన్ పసుపు పొడి, రెండు టీస్పూన్ల పాలు కలిపి ప్యాక్ తయారు చేసుకోండి. తర్వాత ఈ ప్యాక్‌ని మీ ముఖం మెడకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయండి.

రెండు టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని అరగంట పాటు పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడిగేసుకోండి.. ముఖంపై నల్లమచ్చలు పోయి.. కాంతి వస్తుంది. ఈ ఫేస్‌ప్యాక్‌లు మీ స్కిన్‌కి సెట్ అవుతాయో లేదో మీ స్కిన్ స్పెషలిస్టును అడిగి ట్రై చేయటం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా