Water Chestnut Benefits: శీతాకాలంలో విరివిగా లభించే సంఘాడాలను ఎందుకు తినాలో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

చలికాలంలో వచ్చే వాటర్ చెస్ట్‌నట్ దీనిని చాలా మంది సింఘాడ అని కూడా పిలుస్తారు.. ఈ సింఘాడ రుచిలో ఎంత టెస్టీగా ఉంటుందో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. కాబట్టి వాటర్ చెస్ట్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Nov 28, 2023 | 3:26 PM

కాల్షియం, పొటాషియం, మాంగనీస్, డైటరీ ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి, కాపర్ వంటి పోషకాలు వాటర్ చెస్ట్‌నట్‌లో సమృద్ధిగా ఉంటాయి. వాటర్ చెస్ట్‌నట్‌లో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. చలికాలంలో దీన్ని తినడం వల్ల ప్రేగు కదలిక ప్రక్రియ సులభతరం అవుతుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

1 / 6
కాల్షియం, పొటాషియం వాటర్ చెస్ట్‌నట్‌లో ఉంటాయి. కాబట్టి ఈ పండు ఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పొటాషియం పుష్కలంగా ఉన్న వాటర్ చెస్ట్‌నట్ హై బీపీ రోగులకు కూడా మేలు చేస్తుది. ఇది కాకుండా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

2 / 6
వాటర్ చెస్ట్‌నట్ తీసుకోవడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే లారిక్ యాసిడ్ మూలాలను బలంగా చేస్తుంది. దీంతో జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, జింక్, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు జుట్టు, చర్మ సమస్యలను నివారిస్తుంది. ఇది శరీరం నుండి విష వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది మంచి ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలను బలపరుస్తుంది.

3 / 6
చలికాలంలో ప్రజలు తక్కువ నీటిని తాగుతారు. అయితే వాటర్ చెస్ట్‌నట్‌లో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇది మిమ్మల్ని డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది. ఇది తిన్న తర్వాత మీకు చాలా సేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. మీకు ఆకలి కూడా తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితిలో బరువు తగ్గడానికి ఇది గొప్ప ఎంపిక అవుతుంది.

4 / 6
బరువు తగ్గాలనుకునే వ్యక్తులు నిస్సంకోచంగా తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటుంది. ఫిట్‌నెస్‌కు ఉపయోగపడుతుంది. దీన్ని తిన్న తర్వాత చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో మీకు ఆకలి తగ్గుతుంది. ఈ కారణంగా మీరు బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప ఎంపిక అవుతుంది.

5 / 6
డయాబెటిస్‌ బాధితులు వాటర్ చెస్ట్‌నట్ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండదు. దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

6 / 6
Follow us