Brinjal Dum biryani: టేస్టీ టేస్టీ వంకాయ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్‌లో తయారు చేసుకోండి.. రెసిపీ మీకోసం

చాలామంది ఇంట్లోనే చికెన్, మటన్ లతో పాటు సీ ఫుడ్ తో పాటు రకరకాల బిర్యానీలు, ఆహారాన్ని తయారు చేస్తారు. అయితే కూరగాయలతో కూడా నాన్ వెజ్ రుచులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆహారాన్ని తయారు చేస్తారు. టేస్టీ టేస్టీ వంకాయ బిర్యాని రెడీ. స్మెల్ చూస్తేనే ఆహా ఏమి రుచి.. అంటూ మైమరచి మరీ వంకాయ బిర్యానీ పిల్లలు పెద్దలు తింటారు. ఈ నేపథ్యంలో వంకాయతో రుచికరమైన బిర్యానీ తయారీ గురించి తెలుసుకుందాం.. 

Brinjal Dum biryani: టేస్టీ టేస్టీ వంకాయ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్‌లో తయారు చేసుకోండి.. రెసిపీ మీకోసం
Vankaya Biryani Recipe
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2023 | 6:05 PM

ఆహారాన్ని పిల్లలు , పెద్దలు కూడా రోజూ ఒకే విధంగా ఉండే ఆహారాన్ని తినాలంటే బాబోయ్ అంటారు. ఎక్కువమంది రెస్టారెంట్స్ వైపు దృష్టి సారిస్తారు. భిన్నమైన రుచులతో కూడిన ఆహారాన్ని తినాలని కోరుకుంటారు. అయితే చాలామంది ఇంట్లోనే చికెన్, మటన్ లతో పాటు సీ ఫుడ్ తో పాటు రకరకాల బిర్యానీలు, ఆహారాన్ని తయారు చేస్తారు. అయితే కూరగాయలతో కూడా నాన్ వెజ్ రుచులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆహారాన్ని తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో వంకాయతో రుచికరమైన బిర్యానీ తయారీ గురించి తెలుసుకుందాం..

వంకాయ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్ధాలు

బాస్మతి రైస్

వంకాయలు,

ఇవి కూడా చదవండి

పచ్చిమిర్చి,

ఉల్లిపాయలు

ఎండు కొబ్బరి

కొత్తిమీర

టమాటా

ధనియాలు

జీలకర్ర

గసగసాలు

మెంతులు

లవంగాలు

దాల్చిన చెక్క

యాలకులు

అనాసపువ్వు

జాపత్రి

పచ్చిశెనగ పప్పు

కారం

సాజీర

పుదీనా

కొత్తిమీర

రుచికి సరిపడా ఉప్పు,

కొత్తిమీర

అల్లం వెల్లుల్లి పేస్ట్

నువ్వులు

చింతపండు రసం

వెలుల్లి

నెయ్యి

తయారీ విధానం:

90 శాతం బాస్మతి రైస్ ని ఎలా ఉడికించుకోవాలంటే

ముందుగా స్టవ్ వెలిగించి దళసరి గిన్నె పెట్టి.. రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు,  అనాసపువ్వు, బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్ మతి రైస్ ను వేసుకుని 90 శాతం ఉడికించుకోవాలి.

మసాలా పేస్ట్ తయారీకోసం

మరోవైపు స్టవ్ పై బాణలి పెట్టి దానిలో రెండు స్పూన్లు వేరుశనగలు, జీలకర్ర, సాజీర, లవంగాలు, జాపత్రి వేసి వేయించుకోవాలి. అనంతరం ఇందులో ఒక టీ స్పూన్ నువ్వులు వేసి వేయించి.. అందులో ధనియాలు,  కొబ్బరి ముక్కలు, పచ్చిశనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి ఒకటి వేసి వేయించుకోవాలి. వీటిని ఒక బౌల్ లో తీసుకుని చల్లార్చి అందులో కొంచెం పసుపు, పచ్చిమిర్చి , కొంచెం ఉప్పు, వెలుల్లి, కొంచెం చింతపండు రసం వేసుకుని ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని మసాలా పట్టుకోవాలి. ఇంతలో శుభ్రం చేసుకున్న వంకాయలను నిలువుగా అడ్డంగా కట్ చేసి.. అందులో రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ను స్టఫ్ చేయాలి.

ఇప్పుడు బిర్యానీ కోసం ఒక గిన్నెపెట్టి.. అందులో కొంచెం నెయ్యి, నూనె వేసుకుని వేడి ఎక్కిన తర్వాత అందులో రెండు బిర్యాని ఆకులు కొంచెం కస్తూరి మేతి, పుదీనా వేసి వేయించుకోవాలి. అనంతరం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత టమాట ముక్కల్ని వేసి వేయించి.. ఇప్పుడు అందులో మసాలా పెట్టిన వంకాయలు వేసి.. కొంచెం చింతపండు రసం వేసి బాగా ఫ్రై చేయాలి. అనంతరం ఇందులో  90% ఉడికిన బాస్మతి రైస్ ను వేసి ఒక్కసారి కలిపి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టాలి. ఆ గిన్నెను స్టవ్ మీద పెనం దానిమీద గిన్నెను పెట్టుకోవాలి. తర్వాత దాదాపు 30 నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఒక్కసారి ఆ రైస్ ని తిప్పి.. కొంచెం కొత్తిమీర తరుగు.. వేయించిన జీడిపప్పు వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. అంతే టేస్టీ టేస్టీ వంకాయ బిర్యాని రెడీ. స్మెల్ చూస్తేనే ఆహా ఏమి రుచి.. అంటూ మైమరచి మరీ వంకాయ బిర్యానీ పిల్లలు పెద్దలు తింటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..