Watch Video: వామ్మో.. ఇవన్నీ కట్నకానుకలా..! లేదంటే ఏదైనా షోరూమ్ ఓపెనింగ్ కోసమా..?
పెళ్లి పందిట్లో ప్రత్యేకించి ఓ క్రమంలో ఏర్పాటు చేసి ఉంచిన వస్తువులు అమ్మాయికి కట్నంగా ఇస్తున్నట్టుగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇందులో SUV కారు సహా వంటిళ్లు, డైనింగ్ హాల్‌ల్లో వాడే వంటపాత్రలు, డిన్నర్ సెట్లు, ఫ్రై పాన్, రిఫ్రిజిరేటర్, వోల్టాస్ ఎయిర్ కండీషనర్, వాషింగ్ మెషీన్, కప్ బోర్డ్, బెడ్, సోఫా అన్ని ఉన్నాయి. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
పెళ్లిళ్లలో కట్నం ఇవ్వడం, తీసుకోవడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. నేటికీ మన సమాజంలో ఈ సంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నారు. పెళ్లి ఇచ్చే కట్న కానుకులకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఈ వీడియో వివాహ వేడుకకు సంబంధించినది. వీడియోలో అమ్మాయి పెళ్లికి కట్నంగా వరుడి కోసం కారు నుండి వంటగది వరకు దాదాపు అన్ని రకాల వస్తుసామాగ్రిని పెళ్లిలో కట్నంగా ఇచ్చారు. ఈ వీడియో బయటకు రావడంతో జనం ఓ రేంజ్‌లో రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంది నెటిజన్లు వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధువు కుటుంబం వరుడికి చాలా వస్తువులను కట్నకానుకలుగా ఇచ్చింది. పెళ్లి పందిట్లో ప్రత్యేకించి ఓ క్రమంలో ఏర్పాటు చేసి ఉంచిన వస్తువులు అమ్మాయికి కట్నంగా ఇస్తున్నట్టుగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇందులో SUV కారు సహా వంటిళ్లు, డైనింగ్ హాల్‌ల్లో వాడే వంటపాత్రలు, డిన్నర్ సెట్లు, ఫ్రై పాన్, రిఫ్రిజిరేటర్, వోల్టాస్ ఎయిర్ కండీషనర్, వాషింగ్ మెషీన్, కప్ బోర్డ్, బెడ్, సోఫా అన్ని ఉన్నాయి. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. @virahkrsah అనే వినియోగదారు ద్వారా ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేయబడింది. వీడియోతో పాటు ఇది లాటరీ ప్రైజ్ సెటప్ లాగే ఉందని అతడు క్యాప్షన్ రాశాడు. ఎవరైనా కట్నంలో ఇన్ని వస్తువులను ఎందుకు ఇస్తారంటూ చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.? ఈ వీడియోపై చాలా మంది ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు.
Look at the dowry display pic.twitter.com/DxWSSw9aGc
— Rosy (@rose_k01) November 26, 2023
వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందించారు. కట్నం తీసుకునే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇరువైపులా రెండు కుటుంబాలపై చర్యలు తీసుకోవాలంటూ మరొక వినియోగదారు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..