Viral Video: అడవిలో ప్రాణాంతకమైన పాముతో ఆడుకుంటున్న పిల్లలు.. చర్యలు తీసుకోమని డిమాండ్
చాలా మంది ఈ సంఘటనపై తమ నిరాశను వ్యక్తం చేశారు. అయితే పాముని పట్టుకున్న పిల్లలను శిక్షించమని కోరారు. ఈ ఘటనను జంతు హింసగా పేర్కొంటూ పిల్లలపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. చాలా మంది అబ్బాయిలు, పాము చుట్టూ ఉన్న వారి భద్రతపై తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఈ వీడియో షేర్ చేయగా వేలల్లో వ్యూస్ ను సొంతం చేసుకుంది.
కొన్ని రకాల జంతువులకు, మనుషులకు మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడతుంది. మానవుల స్పర్శను, ప్రేమను, చర్యలను ఇష్టపడతాయనడంలో సందేహం లేదు. కుక్కలు , పిల్లులు, ఆవు వంటి కొన్ని జంతువులు మానవులతో మనుషులతో ప్రత్యేక బంధాన్ని ఏర్పచుకుంటాయి. అదే సమయంలో అటవీ ప్రాంతాల్లో నివసించే కొన్ని రకాల జంతువులూ కూడా మనుషులతో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాయి, అయితే ప్రతి జంతువుతో స్నేహం మంచిది కాదు.. కొన్ని రకాల జంతువులు ప్రమాదకరమైనవి కూడా.. ముఖ్యంగా కొన్ని రకాల పాములు విషపూరితమైనవి. అయితే తాజాగా ఓ యువకుడు ప్రమాదకరమైన పాముతో కొందరు అబ్బాయిలు ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ పోస్ట్ ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని అడవిలో కొంతమంది పిల్లలు ఓ పాముని చూశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడం మొదలు పెట్టిన వెంటనే చాలా మంది నెటిజనులు దీనిని జంతు హింసగా భావించారు.
ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ X (గతంలో ట్విట్టర్)లో ‘PATRAKAAR MANISH KUMAR’ అనే యూజర్ షేర్ చేశారు. పాములతో ఆడుకుంటున్న మైనర్ పిల్లలు అడవిలో దొరికిన విషసర్పాన్ని పట్టుకుని మైనర్ పిల్లలు చేస్తున్న చర్యలతో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరగవచ్చని కామెంట్ చేశారు. అసంద్ర పోలీస్ అవుట్‌పోస్ట్ ప్రాంతం సిధౌర్ సమీపంలోని విద్యుత్ పవర్ హౌస్ పక్కన ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
చాలా మంది ఈ సంఘటనపై తమ నిరాశను వ్యక్తం చేశారు. అయితే పాముని పట్టుకున్న పిల్లలను శిక్షించమని కోరారు. ఈ ఘటనను జంతు హింసగా పేర్కొంటూ పిల్లలపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. చాలా మంది అబ్బాయిలు, పాము చుట్టూ ఉన్న వారి భద్రతపై తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఈ వీడియో షేర్ చేయగా వేలల్లో వ్యూస్ ను సొంతం చేసుకుంది.
#बाराबंकी:सांपों से खेल रहे नाबालिक बच्चे, जंगल में मिले जहरीले सांप को हाथ में लेकर प्रदर्शन दिखा रहे नाबालिक बच्चे,कभी भी हो सकता है बड़ा हादसा,मामला थाना असंद्रा के चौकी क्षेत्र सिद्धौर के समीप बिजली पावर हाउस के बगल का। @Barabankipolice @UpforestUp @112UttarPradesh pic.twitter.com/X0gy5C1eN7
— PATRAKAAR MANISH KUMAR (जनता सुरक्षा फाउंडेशन) (@MANISHKPRESS) November 28, 2023
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ఈ రోజుల్లో పిల్లలకి ఏమైంది?” ఒకరు కామెంట్ చేయగా.. “పిల్లలు దేనినీ ఎందుకు సీరియస్‌గా తీసుకోరు అని తనకు అర్ధం కావడం లేదని అంటున్నారు. పిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టడంలో అర్థం ఏమిటి? మరొకరు వ్యాఖ్యానించగా ఆ పాము పిల్లల్ని సులభంగా గాయపరచవచ్చని కొంతమంది నిపుణులు వ్యాఖ్యానించారు. పిల్లలు ఆలోచించడం మానేస్తున్నారు.. జంతు హింస కూడా చేస్తున్నారు. ఆ పామునే రక్షించాల్సిన అవసరం ఉందని మరొకరు వ్యాఖ్యానించారు. ఎదిగిన పిల్లలకు ప్రాథమిక ఇంగితజ్ఞానం పూర్తిగా లేదు.. ఇలా భావించడం విచారకరం” అని మరొకరు కామెంట్ చేయగా.. పాముని హింసిస్తున్న పిల్లలపై ఫిర్యాదు చేయాలి” అని మరొకరు అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..