Viral News: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ? డెలివరీ బాయ్స్, పనిమనిషి లిఫ్ట్ యూజ్ చేస్తే ఫైన్.. ఎక్కడంటే

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. చాలా మంది వినియోగదారులు హౌసింగ్ సొసైటీ చేపట్టిన చర్యను తీవ్రంగా విమర్శించారు, దీనిని వివక్షపూరిత ప్రవర్తనగా పేర్కొన్నారు. అయితే సొసైటీ నిర్ణయాన్ని సమర్థించిన వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సహాయకులు లేదా కార్మికుల వల్ల ప్రధాన లిఫ్ట్ రద్దీగా మారుతుందని కొందరు వాదిస్తున్నారు.

Viral News: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ? డెలివరీ బాయ్స్, పనిమనిషి లిఫ్ట్ యూజ్ చేస్తే ఫైన్.. ఎక్కడంటే
Viral News
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2023 | 5:13 PM

హౌసింగ్ సొసైటీలో పెట్టిన నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.  ఆ నోటీసులో  ‘సొసైటీలోని లిఫ్ట్‌లో ఎవరైనా డెలివరీ బాయ్, హౌస్ మెయిడ్ లేదా వర్కర్ వెళ్తూ పట్టుబడితే వారికి రూ. 1000 జరిమానా విధించబడుతుంది అని రాసి ఉంది. ఇలాంటి పరిస్థితిలో డెలివరీ బాయ్స్ లేదా వర్కర్లు మనుషులు కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మానవత్వం చనిపోయిందా? ఈ షాకింగ్ కేసు హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

సోషల్ సైట్‌లో @RuthlessUx హ్యాండిల్‌తో షాహినా అత్తర్వాలా అనే వినియోగదారు పోస్ట్ షేర్ చేస్తూ చాలా కష్టపడి పనిచేస్తున్న వారు మన మధ్య ఉంటూనే ఉన్నారు. నోటీసులో వ్రాసిన సంగతి చూడండి. పట్టుబడితే పెద్ద నేరం చేసినట్లు అవుతుంది. అంతేకాదు రూ.1000 జరిమానా. సహజంగానే .. ఇది బహుశా ఆ సొసైటీలో ఉన్న వ్యక్తుల జీతాలలో 25 శాతం ఉంటుందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ సొసైటీ నోటీసును ఇక్కడ చూడండి

ఇప్పుడు ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. చాలా మంది వినియోగదారులు హౌసింగ్ సొసైటీ చేపట్టిన చర్యను తీవ్రంగా విమర్శించారు, దీనిని వివక్షపూరిత ప్రవర్తనగా పేర్కొన్నారు. అయితే సొసైటీ నిర్ణయాన్ని సమర్థించిన వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సహాయకులు లేదా కార్మికుల వల్ల ప్రధాన లిఫ్ట్ రద్దీగా మారుతుందని కొందరు వాదిస్తున్నారు.

ప్రజల స్పందన

రెంజిత్ థామస్ అనే వినియోగదారు ఆశ్చర్యపోవడమే కాదు ‘రూ. 15 వేలు మాత్రమే జీతం ఉన్నవారు. లిఫ్ట్‌ను ఉపయోగించినందుకు మీ కోసం మాత్రమే వస్తున్న వారికి జరిమానా విధించడం గురించి ఆలోచించండి. ఇది ఎంత వరకు ఓకే? వీరు కూడా మనుషులే.. అదే సమయంలో హేమంత్ అనే వినియోగదారు ఇది ఖచ్చితంగా సరైనదని చెప్పారు. ఇతర వ్యక్తుల కారణంగా ప్రధాన లిఫ్ట్ బిజీగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మిగిలిన వారి కోసం ఉద్దేశించిన లిఫ్టులు వాడితే బాగుంటుందని హేమంత్ కూడా రాసుకున్నాడు. వివేక్ ఇది చూస్తే మానవత్వం చచ్చిపోయినట్లు అనిపిస్తుందని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..