AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్నేహం అంటే ఇదేరా.. బండరాయికి వేలాడుతున్న ఫ్రెండ్.. చివరకు ఏమైదంటే

ముఖ్యంగా స్నేహితులకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో కనిపించినప్పుడు.. అలాంటివి త్వరగా వైరల్ అవుతాయి. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన ఎవరికైనా తమ స్నేహితులు గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈ వీడియోలో స్నేహితులు ప్రవర్తించిన తీరు చూసిన తర్వాత ఎవరికైనా సరే తప్పనిసరిగా తమ  స్నేహితులు గుర్తుకు వస్తారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో కెమెరామెన్ కళాత్మకమే. ఈ  వీడియోలో చేసిన విన్యాసం చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తున్నారు కూడా..

Viral Video: స్నేహం అంటే ఇదేరా.. బండరాయికి వేలాడుతున్న ఫ్రెండ్.. చివరకు ఏమైదంటే
Viral Video
Surya Kala
|

Updated on: Nov 30, 2023 | 7:49 PM

Share

ఎవరైనా సరే రోజూ చేసే పని నుంచి కొంచెం రిలీఫ్ కావాలని కోరుకుంటారు. అదే సమయంలో చేస్తున్న పని నుంచి కొంచెం మార్పు కోరుకుంటూ తీర్ధ యాత్రలకు, విహార యాత్రలకు వెళ్లాలని భావిస్తారు. కొత్త ప్రదేశాలను చూడడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇలా యాత్రలకు వెళ్లే సమయంలో కొందరు ఫ్యామిలీతో వెళ్తే.. మరికొందరు స్నేహ బృందంతో వెళ్తారు. ఇలా స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తే.. అప్పుడు వినోదం రెట్టింపు అవుతుంది. వినోద యాత్ర సమయంలో స్నేహితులు ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే స్నేహితులు ఆనందించడమే కాదు జ్ఞాపకాలను కూడా సృష్టించుకుంటారు. ఈ సమయంలో స్నేహ బృందం పొందే అనుభూతులు మరెక్కడా పొందలేనివి. ముఖ్యంగా స్నేహితులకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో కనిపించినప్పుడు.. అలాంటివి త్వరగా వైరల్ అవుతాయి. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన ఎవరికైనా తమ స్నేహితులు గుర్తుకొస్తారు.

ఎందుకంటే ఈ వీడియోలో స్నేహితులు ప్రవర్తించిన తీరు చూసిన తర్వాత ఎవరికైనా సరే తప్పనిసరిగా తమ  స్నేహితులు గుర్తుకు వస్తారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో కెమెరామెన్ కళాత్మకమే. ఈ  వీడియోలో చేసిన విన్యాసం చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తున్నారు కూడా..

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఓ వ్యక్తి బండరాయిని ఆసరా చేసుకుని వేలాడుతూ ఉన్నాడు.. అతను కింద పడకుండా అతని స్నేహితులు అతడిని పట్టుకోవడం వీడియోలో చూడవచ్చు. ఇక్కడ పట్టు తప్పిపోయి ఉంటే ఆ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యేవాడు. లేదా ప్రాణాలు కోల్పోయేవాడు అని వీడియో చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే  కెమెరా యాంగిల్ మారిన తర్వాత ఇదంతా కెమెరా స్టంట్ అని అర్థం అవుతుంది. చాలా మంది ప్రజలు ఈ లొకేషన్ గురించి అడగడానికి ఇదే కారణం.. తద్వారా తాము కూడా ఈ ప్రదేశానికి వెళ్లి ఇలాంటి క్షణాలను కెమెరాలో బంధించవచ్చు అని భావించి ఉండొవచ్చు.

@malik_tahleel_17 అనే ఖాతా ద్వారా ఈ వీడియో Instagramలో షేర్ చేశారు. ఇది 22 లక్షల మందికి పైగా లైక్ చేశారు. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..