- Telugu News Photo Gallery Health tips: winter season healthy diet for diabetic patients know from health expert in telugu
Diabetes Diet: శీతాకాలంలో షుగర్ పేషేంట్స్ తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి.. నిపుణుల సలహా ఏమిటంటే
బిజీ లైఫ్ స్టైల్ లో తినే ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో అనేక మార్పులు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. వీటిలో మధుమేహ వ్యాధిన పడేవారు ఎక్కువ అవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా వృద్ధులే కాదు యువత కూడా మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం వ్యాధి అంటే.. రక్తంలో చక్కెర స్థాయిని పెంచే వ్యాధి. సరైన దినచర్యను అనుసరించడం ద్వారా మాత్రమే దీనిని నియంత్రించవచ్చు.
Updated on: Nov 30, 2023 | 7:14 PM

మధుమేహం కారణంగా తరచుగా మూత్రవిసర్జన, దాహం, ఆకలి పెరగడం వంటి సమస్యలు మొదలవుతాయి. మధుమేహం నియంత్రణలో లేకుంటే దాని వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్ పేషెంట్లు కూడా తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ దీపక్ కుమార్ సుమన్ చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

గుమ్మడికాయ: డయాబెటిక్ రోగులు చలికాలంలో గుమ్మడి కాయను తినే ఆహారంలో చేర్చుకోవాలి. గుమ్మడి కాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చల్లదనం ఇచ్చే ఆహారానికి దూరంగా ఉండాలి.

పాల కూర: గ్రీన్ లీఫీ వెజిటేబుల్ పాల కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో తినే ఆహారంలో తాజా పాలకూరను చేర్చుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిని చక్కగా ఉంచుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉందని.. ఇది రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

అశ్వగంధ: అశ్వగంధ ఒక ఆయుర్వేద మూలిక. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

మెంతికూర: మెంతులు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో మెంతికూరను తినే ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడమే కాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

చిలగడదుంప: శీతాకాలంలో తినే ఆహారంలో చిలగడదుంపలను చేర్చుకోచ్చని ఆహారనిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే సమ్మేళనం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. కనుక బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే చిలగడదుంపలను ఉడికించి తినవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.




