- Telugu News Photo Gallery Cinema photos Tamil Star Hero Ajith Kumar movie with gopichand malineni in Mytri movie makers in Tollywood news viral Telugu Heroes Photos
Ajith Kumar: తల తెలుగు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అజిత్ మాస్ మూవీ తెలుగులో.
ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు షురూ అవుతున్న ఈ సమయంలో తెలుగు హీరోలతో అదర్ లాంగ్వేజ్ ప్రొడక్షన్ హౌస్‌లు, అదర్ లాంగ్వేజుల హీరోలతో తెలుగు ప్రొడక్షన్ హౌసులు సినిమాలు చేయడం అలవాటుగా మారింది. ఈ లిస్టులో తాజాగా వినిపిస్తున్న పేరు అజిత్. 2023 సంక్రాంతికి తెగింపు సినిమాతో ప్రేక్షకులను పలకరించారు అజిత్. తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా తమిళంలో మాత్రం మంచి కలెక్షన్లే రాబట్టింది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Nov 30, 2023 | 9:14 PM

ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు షురూ అవుతున్న ఈ సమయంలో తెలుగు హీరోలతో అదర్ లాంగ్వేజ్ ప్రొడక్షన్ హౌస్‌లు, అదర్ లాంగ్వేజుల హీరోలతో తెలుగు ప్రొడక్షన్ హౌసులు సినిమాలు చేయడం అలవాటుగా మారింది.

ఈ లిస్టులో తాజాగా వినిపిస్తున్న పేరు అజిత్. 2023 సంక్రాంతికి తెగింపు సినిమాతో ప్రేక్షకులను పలకరించారు అజిత్. తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా తమిళంలో మాత్రం మంచి కలెక్షన్లే రాబట్టింది.

లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా వలిమైతో ప్రేక్షకులను మెప్పించారు తల. అన్నీ అనుకున్న ప్రకారమే జరిగి ఉంటే, మొన్న దసరాకు లియో విడుదలైన సమయానికి అజిత్ సినిమా కూడా రిలీజ్ కావాల్సింది.

కానీ మధ్యలో విఘ్నేష్ శివన్ ప్రాజెక్ట్ డ్రాప్ కావడంతో, నెక్స్ట్ మూవీ స్టార్ట్ కావడానికి టైమ్ పట్టింది. ఈ మధ్యనే తన ప్రెజెంట్ ప్రాజెక్ట్ విడా ముయర్చి షూట్‌ని ఫారిన్‌లో కంప్లీట్ చేసుకుని వచ్చారు తల.

మైత్రీ మూవీస్‌తో ఓ సినిమా చేయడానికి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది లేటెస్ట్ గా టాలీవుడ్‌లో వైరల్ అవుతున్న న్యూస్. అయితే ఈ సినిమాకు డైరక్టర్ గోపీచంద్ మలినేని ఉంటారా? ఇంకెవరైనా చేస్తారా?

అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మాస్ మహరాజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీస్ ఓ సినిమా చేయాల్సింది. కానీ, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు లేదు.

అందువల్ల సేమ్ కథతో అజిత్‌ని అప్రోచ్ అయితే ఓకే చెప్పారన్న మాట వినిపిస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది మేకర్స్ అఫిషియల్ స్టేట్‌మెంట్ ఇస్తేగానీ తెలియదు.





























