AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కోరి కష్టం కొని తెచ్చుకుంది.. చైనీస్ వంటకంపై ఇష్టంతో రూ. 32 లక్షలు ఖర్చు చేసింది.. చివరకు

సర్వసాధారణంగా మహిళలు మేకప్, డిజైనర్ దుస్తులను ఇష్టపడతారు. అయితే తనకు మాత్రం హాట్‌పాట్ అంటే అమితమైన ఇష్టం అని కాంగ్ చెప్పింది. అది కూడా హైదిలావ్ రెస్టారెంట్ లోని హాట్‌పాట్ అంటేనే ఇష్టమని పేర్కొంది. అందుకే ఆ హోటల్ లోని హాట్‌పాట్ అయితే తాను కళ్లు మూసుకుని తినేస్తానని.. ఆ ఫుడ్ ని తింటూ ఎంతో ఆస్వాదిస్తానని వెల్లడించింది. తొమ్మిదేళ్ల క్రితం తనకు ఈ హాట్‌పాట్  గురించి చెప్పారని.. అది కూడా హైదిలావ్‌లో హాట్‌పాట్‌ను ప్రయత్నించమని చెప్పగా తాను అప్పుడు మొదటిసారి తిన్నానని.. అప్పటి నుంచి దీనిని తినడం అంటే పిచ్చి అంటూ కాంగ్ చెప్పింది. 

Viral News: కోరి కష్టం కొని తెచ్చుకుంది.. చైనీస్ వంటకంపై ఇష్టంతో రూ. 32 లక్షలు ఖర్చు చేసింది.. చివరకు
China Hot Pot
Surya Kala
|

Updated on: Nov 30, 2023 | 6:45 PM

Share

కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి.. కొందరికి తినడం, తాగడం అంటే చాలా ఇష్టం. అయితే ఓ చైనీస్ మహిళ ఆహారం పట్ల తనకున్న మక్కువను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ మహిళ ఒక వంటకాన్ని ఎంతగానో ఇష్టపడింది.. తాను ఇష్టపడిన ఫుడ్ ని తినడం కోసం లక్షలు ఖర్చు చేసింది. ఈ మహిళ తనకు ఇష్టమైన వంటకం ‘హాట్‌పాట్‌’ను ఆస్వాదించడానికి ఇప్పటివరకు రూ.32 లక్షలు ఖర్చు చేసింది. ఇది తెలిసిన తర్వాత అందరూ షాక్ తిన్నారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం మహిళ వృత్తిరీత్యా హోటల్ మేనేజర్ అయిన కాంగ్ అనే ఇంటిపేరుతో ప్రచురించబడింది. ‘హాట్‌పాట్‌’పై ఆ మహిళకు ఉన్న మక్కువ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత 9 సంవత్సరాలుగా కాంగ్‌కి ఇష్టమైన వంటకం ‘హాట్‌పాట్’. ఆమె ఇప్పటివరకు 627 సార్లు ఈ ఫుడ్ ని అస్వాధించింది. ఇందుకోసం ఆమె ఇప్పటి వరకూ మొత్తం రెండు లక్షల 70 వేల యువాన్లు (అంటే సుమారు రూ. 32 లక్షలు) చెల్లించింది.

హాట్‌పాట్ డిష్ అంటే ఏమిటి?

హాట్‌పాట్ చైనాలో బాగా ప్రాచుర్యం పొందిన వంటకం. ఇది ఒక రకమైన రుచికరమైన ఉడకబెట్టిన పులుసు.  ఇది సాంప్రదాయకంగా పెద్ద మెటల్ పాత్రలో వండుతారు. ‘హాట్‌పాట్’ గా ఓ వైపు ఆహారం తినే సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర పులుసు వేడి చేస్తూ దానిని తింటారు. ఈ ‘హాట్‌పాట్’లో కూరగాయలు, ఉడికించిన మాంసాలు వేసి వాటిని పులుసుగా ఉడకబెడుతూ.. అదే సమయంలో పులుసులో మాసం ముక్కలను తీసుకుని ముంచి తినడానికి ఇష్టపడతారు. చైనాలోని స్పైసీ సిచువాన్ ఫుడ్‌కు ప్రసిద్ధి చెందిన ‘హైడిలావ్’ రెస్టారెంట్ నుంచి కాంగ్ ఎల్లప్పుడూ ఈ వంటకాన్ని ఆర్డర్ చేస్తుంది. హైడిలావ్ రెస్టారెంట్ రుచికరమైన హాట్‌పాట్‌కు ప్రసిద్ధి చెందింది.

ఇవి కూడా చదవండి

కాంగ్ కు ‘హాట్‌పాట్’ ఎందుకంటే ఇష్టం అంటే..

సర్వసాధారణంగా మహిళలు మేకప్, డిజైనర్ దుస్తులను ఇష్టపడతారు. అయితే తనకు మాత్రం హాట్‌పాట్ అంటే అమితమైన ఇష్టం అని కాంగ్ చెప్పింది. అది కూడా హైదిలావ్ రెస్టారెంట్ లోని హాట్‌పాట్ అంటేనే ఇష్టమని పేర్కొంది. అందుకే ఆ హోటల్ లోని హాట్‌పాట్ అయితే తాను కళ్లు మూసుకుని తినేస్తానని.. ఆ ఫుడ్ ని తింటూ ఎంతో ఆస్వాదిస్తానని వెల్లడించింది. తొమ్మిదేళ్ల క్రితం తనకు ఈ హాట్‌పాట్  గురించి చెప్పారని.. అది కూడా హైదిలావ్‌లో హాట్‌పాట్‌ను ప్రయత్నించమని చెప్పగా తాను అప్పుడు మొదటిసారి తిన్నానని.. అప్పటి నుంచి దీనిని తినడం అంటే పిచ్చి అంటూ కాంగ్ చెప్పింది.

హాట్‌పాట్ తో పెరిగిన బరువు

అయితే హాట్‌పాట్ డిష్‌పై ఆమెకు ఎక్కువ మక్కువ దీంతో కాంగ్ బరువు 13.5 కిలోలు పెరిగింది. కాంగ్ బరువు పెరగడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువ హాట్‌పాట్ తినడం వల్ల  శరీరంలో యాసిడ్ పరిమాణం పెరుగుతుందని అది తర్వాత ఆర్థరైటిస్‌కు కారణమవుతుందని కూడా కాంగ్‌కు తెలుసు. అయితే తన కోరికను ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలని ఉందని వెల్లడించింది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..