Viral Video: కాకి దాహం కథలోని కాకి దొరికేసింది.. ఇంతకాలం ఎక్కడికి పోయింది అంటున్న నెటిజన్లు..

కాకి ఎలాగైనా తన దాహం తీర్చుకోవాలని భావించి అటు ఇటు చూస్తుంది. అప్పుడు సమీపంలో ఉన్న గులక రాళ్ల న చూసిన  కాకి తన తెలివితో అక్కడ ఉన్న రాళ్లన్నింటినీ కుండలో నింపుతుంది, అప్పుడు నీరు పైకి రావడం ప్రారంభమవుతుంది. ఆలా కుండపైకి వచ్చిన ఆ నీటిని తాగి కాకి అక్కడ నుంచి ఎగిరిపోతుంది. కాకుల తెలివి గురించిన ఈ నీతి కథ చిన్నతనం నుంచి పిల్లలకు చెబుతూ ఉంటారు. అయితే ఇది కథ..ఈ కథ సజీవంగా మన ముందు కనిపిస్తే.. ఎలా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కాకి దాహం కథ గుర్తు తెస్తుంది.

Viral Video: కాకి దాహం కథలోని కాకి దొరికేసింది.. ఇంతకాలం ఎక్కడికి పోయింది అంటున్న నెటిజన్లు..
Thirsty Crow
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2023 | 10:53 AM

చిన్నతనంలో కాకి దాహం కథ గురించి అందరికి తెలిసిందే.. ఒక ఊరిలో మండు వేసవిలో ఒక కాకి దాహంతో అల్లాడినప్పుడు.. తన దాహం తీర్చుకోవడానికి ఎంతగానో వెదికింది. అప్పుడు గుక్కెడు నీరు ఎక్కడా దొరకకపోవడంతో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని చూస్తున్న సమయంలో దానికి సమీపంలో ఒక కుండ కనిపించింది. ఆశతో దాహం తీర్చుకోవడానికి కుండ దగ్గరకు వెళ్లిన కాకికి కుండలో నీరు అట్టడుగున ఉన్నట్లు కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా కుండలోని నీరు అందకపోవడంతో.. కాకి ఎలాగైనా తన దాహం తీర్చుకోవాలని భావించి అటు ఇటు చూస్తుంది. అప్పుడు సమీపంలో ఉన్న గులక రాళ్ల న చూసిన  కాకి తన తెలివితో అక్కడ ఉన్న రాళ్లన్నింటినీ కుండలో నింపుతుంది, అప్పుడు నీరు పైకి రావడం ప్రారంభమవుతుంది. ఆలా కుండపైకి వచ్చిన ఆ నీటిని తాగి కాకి అక్కడ నుంచి ఎగిరిపోతుంది. కాకుల తెలివి గురించిన ఈ నీతి కథ చిన్నతనం నుంచి పిల్లలకు చెబుతూ ఉంటారు. అయితే ఇది కథ..ఈ కథ సజీవంగా మన ముందు కనిపిస్తే.. ఎలా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కాకి దాహం కథ గుర్తు తెస్తుంది.

@byari_rockers_ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ‘స్కూల్ లో చెప్పిన పాఠంలో కాకి దొరికింది’ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్  చేశారు. వీడియోలో దాహంతో ఉన్న కాకి బాటిల్‌లో రాళ్లను వేడి నీళ్లు పైకి రాగానే కాకి నీళ్లు తాగింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

వీడియోలో ఒక కాకి దాహంతో ఉంది. సీసాలో నీళ్లు కూడా ఉన్నాయి. కానీ కాకి ఆ నీటిని త్రాగలేకపోయింది, ఎందుకంటే నీరు దిగువన ఉంది. అప్పుడు కాకి ఇలా కూర్చుంటే దాహంతో చచ్చిపోతా అని అనుకుందో ఏమో తన తెలివికి పదును పెట్టింది. దగ్గర్లోని చిన్న చిన్న రాళ్లను ఏరుకుని సీసాలో వేసింది. ఇలా రాళ్లను ఒక్కొక్కటిగా సీసాలో వేయడం మొదలు పెట్టిన తర్వాత దిగువన ఉన్న నీరు పైకి రావడం ప్రారంభమైంది. తాను నీరు తాగే విధంగా అందిన తర్వాత ఆ నీటిని కాకి తృప్తిగా తాగడం కనిపిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకు 1.1 మిలియన్ వ్యూస్, 59.5K లైక్‌లు వచ్చాయి. ఈ  వీడియో గురించి చాలా మంది కామెంట్స్ చేసారు. ఒక వినియోగదారు “ఈ కాకి ఇంత కాలం ఎక్కడికి పోయింది?” అని చమత్కరించారు. మరో వినియోగదారు “నేను నిజ జీవితంలో పాఠశాల పాఠాల్లో చదివిన కాకిని చివరకు నాకు చూపించినందుకు ధన్యవాదాలు” అని అన్నారు. మరో వినియోగదారు “మనం పాఠంలో చదివిన ఆ కాకి ఇంకా బతికే ఉందా?” అంటూ ఫన్నీ కామెంట్ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..