Viral Video: పాముని పట్టుకుని అందరిని భయపెడుతున్న చిన్నారి.. డాడీ లిటిల్ ప్రిన్సెస్ క్యూట్ వీడియో వైరల్..

కొంతమంది ధైర్యవంతులైన వారు పాములను పట్టుకునే సాహసం చేస్తారు. అయితే పాముని పట్టుకుని ఎదో పెంపుడు జంతువుని ఆడించినట్లు ఆడిస్తుంది ఓ చిన్నారి బాలిక. ఆ బాలిక దైర్యం చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. చిన్నారి బతికి ఉన్న ఓ పాముని చేతితో పట్టుకుని  అక్కడున్న వారిని భయపెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ చిన్నారిని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

Viral Video: పాముని పట్టుకుని అందరిని భయపెడుతున్న చిన్నారి.. డాడీ లిటిల్ ప్రిన్సెస్ క్యూట్ వీడియో వైరల్..
Snake Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2023 | 11:49 AM

పాములంటే ఎవరికైనా భయమే.. అవి విషపూరితం అయినా.. కాకుండా పాముకి దూరంగా పారిపోతారు. అయితే అత్యంత ధైర్య సాహసాలు కల్గిన వారు మాత్రమే పామును చూసి భయపడరు.. పైగా చాకచక్యంగా విషపు పాముని సైతం బంధించి వాటిని క్షేమంగా అడవుల్లో విడిచి పెడతారు. సర్వసాధారణంగా ప్రకృతిలో విషపూరిత జీవుల్లో పాములు కూడా ఒకటి. వీటి దగ్గరకు వెళ్లే సాహసం చెయ్యరు. కొంతమంది చిన్న పామును చూసినా భయపడి పారిపోతారు. కొంతమంది ధైర్యవంతులైన వారు పాములను పట్టుకునే సాహసం చేస్తారు. అయితే పాముని పట్టుకుని ఎదో పెంపుడు జంతువుని ఆడించినట్లు ఆడిస్తుంది ఓ చిన్నారి బాలిక. ఆ బాలిక దైర్యం చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. చిన్నారి బతికి ఉన్న ఓ పాముని చేతితో పట్టుకుని  అక్కడున్న వారిని భయపెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ చిన్నారిని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

వైరల్ వీడియో  “పిల్లలు సహజంగా చాలా ధైర్యంగా ఉంటారు” అనే ఫన్నీ క్యాప్షన్‌తో @TheFigen X ఖాతాలో భాగస్వామ్యం చేయబడింది. వీడియోలో, 3 నుండి 4 సంవత్సరాల వయస్సు గల బాలిక తన చేతుల్లో జీవించి ఉన్న పామును పట్టుకున్న హాస్య సన్నివేశం ఒక మాల్‌లో చూడవచ్చు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ భయపెడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇదిగో వైరల్ వీడియో

ఈ 9-సెకన్ల వీడియోలో 3 , 4 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒక చిన్న అమ్మాయి తన చేతిలో పాముని పట్టుకుని  ఇతరుల వైపు పరుగెత్తుతూ.. వారిని భయపెట్టడానికి చిన్న చిన్న అడుగులు వేస్తూ కనిపించింది. ఆ అమ్మాయి చేతిలో పామును చూసి అక్కడున్న వారంతా భయపడి పరుగులు తీశారు. ఈ చిన్నారి అక్కడ షాపింగ్ మాల్ లో ఉన్నవారిని భయపెట్టడానికి చకచకా నడుస్తూ వెళ్తుంటే.. వెనుక మరో మహిళ వెళ్లి.. బాలిక చేతిలోని పాముని తీసుకుంది.

డిసెంబర్ 3న షేర్ చేసిన ఈ వీడియో 2.6 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. రకరకాల కామెంట్స్ చేసుకుంది. ఒకరు చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి అన్నారు. మరొకరు నేను ఈ వయసులో అసలు ఏ పురుగు కనిపించినా భయపడేదానిని అని అంటే.. ఈ అమ్మాయి చాలా ధైర్యంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ చిన్నారి టీజింగ్ సీన్ చాలా క్యూట్ గా ఉందని చాలా మంది కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..