AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొట్టుకుందాం.. రా! దిమిలిలో వినూత్న జాతర.. ఒంటి నిండా బూరద పూసుకుంటూ..

కోరికలు తీర్చే తల్లిగా.. బురదమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు గ్రామస్తులు. పూర్వకాలంలో గజదొంగల దండు ఊరిపై దండెత్తి మహిళలను అపహరించే వారట. వారి నుంచి స్థానికులను కాపాడేందుకు దల్లమ్మ అనే వీర వనిత దొంగలను నిలువరించే క్రమంలో.. బురద గుంటలో పడి ప్రాణాలు కోల్పోయినట్టు కథనాలు. ఆ వీర మహిళా దల్లమ్మకు..

కొట్టుకుందాం.. రా! దిమిలిలో వినూత్న జాతర.. ఒంటి నిండా బూరద పూసుకుంటూ..
Burada Mamba Jatara
Maqdood Husain Khaja
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 06, 2023 | 9:01 PM

Share

విశాఖపట్నం,డిసెంబర్‌05; సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు మన దేశం. విభిన్న ఆచారాలు, సాంప్రదాయాలతో పండుగలు,, ఉత్సవాలు, జాతరలు నిర్వహించడం ఆనవాయితీ..! అందులో భాగంగానే ప్రాంతాలకు తగ్గట్టుగా వారి ఆచారాలు సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ మీకు చెప్పబోయే పండగ కాస్త భిన్నం.. అక్కడకు వెళ్లిన వారు ప్రతి ఒక్కరూ బురద పూసుకోవాల్సిందేనట..!

– ఎక్కడైనా ఉత్సవం జరిగినా.. జాతర మహోత్సవం నిర్వహించినా.. గ్రామ దేవతకు పూజలు చేయడం, నైవేద్యం పెట్టడం, ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ..! కానీ ఆ గ్రామంలో ఉత్సవం రోజు ఒంటినిండా బురద పూసుకుంటారు జనం. కనిపించిన వారందరినీ బురదలో దింపుతారు. మహిళలకు ఈ బురద ఉత్సవంలో మినహాయింపు. తెల్లవారుజాము నుంచే వీధుల్లోకి వచ్చి బురద పూసుకొని కేరింతల కొట్టే బురద ఉత్సవ విశేషాలు తెలుసుకుందామా మరి..?

– ఉమ్మడి విశాఖ జిల్లా లోని రాంబిల్లి మండలం దిమిలి గ్రామం అది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ గ్రామం వింత పండగలు ఉత్సవాలకు పెట్టింది పేరు. ఇక్కడ గ్రామస్తులంతా ఏ ఉత్సవమైన.. నిష్టతో నిబద్ధతతో ఐకమత్యంగా కలిసిమెలిసి చేసుకుంటారు. అయితే ఇక్కడ రెండేళ్లకోసారి.. వారం రోజుల వ్యవధిలోనే రెండు పండుగలు నిర్వహించుకోవడం విశేషం. అందులో ఒకటి వెదురు కర్రలతో కొట్టుకునే దల్లమ్మ జాతర.. మరొకటి ఒంటినిండా బురద పోసుకొనే బురదమాంబ పండగ.

ఇవి కూడా చదవండి

స్పెయిన్ లో టమాటాలతో.. దిమిలిలో బురదతో…!

– స్పెయిన్ లో.. టమాటాలతో కొట్టుకొని.. టమోటాల కుప్పలో దొర్లుతూ .. ఆ టమాటా రసాన్ని ఒంటినిండా పూసుకొని.. కేరింతల కొడుతూ సంబరాలు చేసుకోవడం ఆనవాయితీని చూసే ఉంటాం. అక్కడ టమాటోలు ఒంటినిండా పూసుకుంటే అనకాపల్లి జిల్లాలోని ఈ గ్రామంలో మాత్రం బురదను పూసుకొని సంబరాలు చేసుకుంటారు. ఆ స్థాయిలో కాకపోయినా.. గ్రామస్తులంతా ఒక్క చోటుచేరి బురద పండగలో ఉత్సాహంగా గడపడం ఆనవాయితీ.

వారంలోనే మరో వింత పండగ..

– వెదుళ్ళ తో కొట్టుకొనే దల్లమాంబ జాతర జరిగిన వారం రోజుల వ్యవధిలోనే .. బురద మాంబ పండగ నిర్వహిస్తూ ఉంటారు. తెల్లవారుజామునే ఈ పండుగ సంబరాలు మొదలవుతాయి. ఇందుకోసం ముందు రోజే ఏర్పాట్లు చేసేస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి గ్రామస్తులంతా ఒకచోట చేరిపోతారు. చేతిలో వేపకొమ్మలు పట్టుకొని.. బురదలో దిగుతారు. వేపకొమ్మలను బురదలో ముంచి వాటిని ఇతరులపై పూస్తారు. పిల్లలు పెద్దలు అనే వయసుతో తేడా లేకుండా ఒంటినిండా బురదను పూసుకుని కేరింతల కొడతారు. ఎవరైనా ఈ పండుగకు దూరంగా ఉండిపోయినా.. వారిని కూడా తీసుకువచ్చి బురదలో వేస్తారు. చర్మ వ్యాధులనుంచి ఈ ఉత్సవం తమను కాపాడుతుందని నమ్ముతారని అంటున్నారు దిమిలి గ్రామస్తులు అశ్విని, మురళి.

అందుకే బురద పూసుకుంటారట..

– కోరికలు తీర్చే తల్లిగా.. బురదమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు గ్రామస్తులు. పూర్వకాలంలో గజదొంగల దండు ఊరిపై దండెత్తి మహిళలను అపహరించే వారట. వారి నుంచి స్థానికులను కాపాడేందుకు దల్లమ్మ అనే వీర వనిత దొంగలను నిలువరించే క్రమంలో.. బురద గుంటలో పడి ప్రాణాలు కోల్పోయినట్టు కథనాలు. ఆ వీర మహిళా దల్లమ్మకు నివాళులర్పించేందుకు ఈ వింత పండగను గ్రామస్తులు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అంటున్నారు గ్రామస్థులు సేనాపతి అప్పారావు, నాగేశ్వరరావు.

– ఈ బురద ఉత్సవంలో మహిళలకు మినహాయింపు. బురద ఉత్సవం ముగిసిన తర్వాత గ్రామస్తులంతా అమ్మవారి ఆలయానికి చేరుకొని మహిళలు పసుపు కుంకుమలు నైవేద్యాలు సమర్పిస్తారు. మగవారు బురదతో కూడిన వేపకొమ్మలను అమ్మవారి వద్ద ఉంచుతారు. గ్రామస్తుల్లో ఎవరైనా మగవారు ఈ ఉత్సవంలో పాల్గొనకపోతే అరిష్టం జరుగుతుందని నమ్ముతారు. అందుకే ఎంతటి వారైనా ఈ బురద ఉత్సవంలో పాల్గొన్న తీరాల్సిందేనట..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..