హైదరాబాద్‌ జూలో అరుదైన ఘటన.. ఖడ్గమృగానికి మేజర్‌ సర్జరీ..! ఏమైందంటే..

ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తిచేసినట్టుగా వెల్లడించారు. ప్రవీణ్ కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌తో పాటు డాక్టర్ జె. రాధాకృష్ణారావు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ మరియు డాక్టర్ ఎం. నవీన్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ (రిటైర్డ్) జూ వెటర్నరీ సిబ్బంది మరియు జంతు సంరక్షకుల సహకారంతో మరియు డైరెక్టర్, క్యూరేటర్ సమక్షంలో మరియు డిప్యూటీ క్యూరేటర్, నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ వారి పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగింది.

హైదరాబాద్‌ జూలో అరుదైన ఘటన.. ఖడ్గమృగానికి మేజర్‌ సర్జరీ..! ఏమైందంటే..
Rhino
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 05, 2023 | 10:00 AM

11 ఏళ్ల ఖడ్గమృగానికి మేజర్‌ సర్జరీ నిర్వహించారు ప్రభుత్వ పశువైద్యులు. ఈ అరుదైన సంఘటన హైదరాబాద్‌ జంతుప్రదర్శనశాలలో జరిగింది. 6 ఏళ్ల నుంచి కంటి సమస్యతో బాధపడుతున్న 11 ఏళ్ల ఖడ్గమృగం ఖడ్గమృగం సాయి విజయ్‌కు సోమవారం హైదరాబాద్ జూలో ప్రభుత్వ పశువైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ జంతువు ఎడమ కనుగుడ్డు పెరుగుదలకు చికిత్స పొందుతోంది. గత ఆరు నెలల నుండి తీవ్రమైన నొప్పితో బాధపడుతోందని జూ నిర్వహాకులు చెప్పారు. ఈ క్రమంలోనే జంతువుకు ఆపరేషన్‌ చేయించినట్టుగా తెలిపారు. జూ మరియు వన్యప్రాణుల సంరక్షణ అధికారుల సమక్షంలో దానికి అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేసినట్టుగా నిర్వాహకులు తెలిపారు. చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్, వీఎస్‌ఎన్‌వీ ప్రసాద్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్/డైరెక్టర్, హైదరాబాద్, జూ పార్క్స్, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్. హిరేమత్ చొరవతో ఈ రైనోస్‌ను మైసూర్ జూ నుంచి కొనుగోలు చేసినట్టుగా తెలిసింది.

Rhino 1

Rhino

డాక్టర్ జి. శంభులింగం, అసిస్టెంట్ డైరెక్టర్ (పశువైద్యుడు), డాక్టర్ ఎంఎ హకీం, డిప్యూటీ డైరెక్టర్ (వెట్) డాక్టర్ సిహెచ్‌తో సహా పశువైద్యుల బృందం న్యూక్లియేషన్ కోసం అంటే ఎడమ కనుగుడ్డులో సమస్యను తగ్గించటం కోసం శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తిచేసినట్టుగా వెల్లడించారు. ప్రవీణ్ కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌తో పాటు డాక్టర్ జె. రాధాకృష్ణారావు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ మరియు డాక్టర్ ఎం. నవీన్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ (రిటైర్డ్) జూ వెటర్నరీ సిబ్బంది మరియు జంతు సంరక్షకుల సహకారంతో మరియు డైరెక్టర్, క్యూరేటర్ సమక్షంలో మరియు డిప్యూటీ క్యూరేటర్, నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ వారి పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగింది.

అన్ని నమూనాలను సేకరించి నిర్ధారణ నిర్ధారణ కోసం హిస్టో-పాథలాజికల్, హెమటాలజీ మరియు సెరోలాజికల్ కోసం VBRI, శాంతినగర్, హైదరాబాద్‌కు పంపామన్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి