ఓయూ హాస్టల్ వద్ద అనుకోని అతిథి హల్‌చల్.. ! బాబోయ్
మరో కింగ్ కోబ్రా కనిపించటంతో విద్యార్థులు, సిబ్బంది భయపడిపోతున్నారు. చూసేందుకు పాము చాలా పెద్దగానే ఉంది. కానీ, అదృష్టవశాత్తూ అది ఎవరికీ ఎలాంటి హాని కలిగించలేదు. ఈ ఏడాది జూన్‌లో అదే ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్‌లో పాము కనిపించింది. ఒక రోజు వర్షం కురుస్తున్న సమయంలో తన గది కిటికీలు మూసేస్తుండగా రీసెర్చ్ స్కాలర్ విష్ణు పాము కాటుకు గురయ్యాడని చెప్పారు.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో భారీ కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. యూనివర్సిటీ ఆవరణలోని హాస్టల్ వద్ద అనూహ్యంగా కనిపించిన కింగ్ కోబ్రా విద్యార్థులను గజగజలాడించాడు. న్యూ రీసెర్చ్ స్కాలర్స్ (NRS) హాస్టల్ మెయిన్ డోర్ వద్ద పడగ విప్పి కూర్చున్న కింగ్ కోబ్రా విద్యార్థులు, సిబ్బందిని హడలెత్తించింది. మూతపడి ఉన్న పాత వాష్‌రూమ్‌లలో కనీసం మూడు నుండి నాలుగు పాములు ఉన్నాయంటున్నారు. గతంలోనూ మూడు భారీ విష సర్పాలు కనిపించాయని చెప్పారు.
తాజాగా మరో కింగ్ కోబ్రా కనిపించటంతో విద్యార్థులు, సిబ్బంది భయపడిపోతున్నారు. చూసేందుకు పాము చాలా పెద్దగానే ఉంది. కానీ, అదృష్టవశాత్తూ అది ఎవరికీ ఎలాంటి హాని కలిగించలేదు. ఈ ఏడాది జూన్‌లో అదే ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్‌లో పాము కనిపించింది. ఒక రోజు వర్షం కురుస్తున్న సమయంలో తన గది కిటికీలు మూసేస్తుండగా రీసెర్చ్ స్కాలర్ విష్ణు పాము కాటుకు గురయ్యాడని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..