USAలో అతిపెద్ద దేవాలయం అక్షర ధామం.. ఆధ్యాత్మికత, వాస్తుశిల్పం, కళలకు చిహ్నం.. ఆలయ విశిష్టత ఏమిటంటే

అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయమైన BAPS స్వామినారాయణ అక్షరధామ్ అక్టోబర్ 8న  భక్తుల కోసం తెరవబడింది. ఈ ఆలయం న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే నగరంలో ఉంది. భారతదేశం వెలుపల ఆధునిక యుగంలో అతిపెద్ద హిందూ దేవాలయం. BAPS స్వామినారాయణ సంస్థ , హిందూమతంలోని స్వామినారాయణ శాఖకు చెందినది. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన నాలుగు రకాల పాలరాయి ఇటలీ నుండి తీసుకుని రాగా.. బల్గేరియా నుండి సున్నపురాయిని వినియోగించారు. ఈ రాళ్లు 8,000 మైళ్ళ కంటే ఎక్కువ దూరం ప్రయాణించి న్యూజెర్సీకి చేరుకున్నాయి.

USAలో అతిపెద్ద దేవాలయం అక్షర ధామం.. ఆధ్యాత్మికత, వాస్తుశిల్పం, కళలకు చిహ్నం.. ఆలయ విశిష్టత ఏమిటంటే
Swami Narayan Temple
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 05, 2023 | 12:04 PM

భారతదేశానికి వేల మైళ్ల దూరంలో కూడా అతి పెద్ద హిందూ దేవాలయం ఉంది. అమెరికాలోని న్యూజెర్సీలో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి BAPS స్వామినారాయణ్ అక్షరధామ్. 19వ శతాబ్దంలో అత్యధికంగా పూజింపబడిన స్వామినారాయణకు ఈ ఆలయం అంకితం చేయబడింది. ఆలయ నిర్మాణం 2015లో ప్రారంభమైంది. న్యూజెర్సీ నడిబొడ్డున ఉన్న BAPS స్వామినారాయణ అక్షరధామ ఆలయం శాంతి, ఆధ్యాత్మిక చింతనకు స్వర్గధామం. దేవుడు కొలువైన పవిత్ర హిందూ ప్రార్థనా స్థలం.  హిందూ కళలకు,  వాస్తుశిల్పం, ఆధ్యాత్మికతకు చిహ్నంగా అగ్రరాజ్యంలో నిలిచింది. అక్షరధామ్‌లో ప్రతి అణువు ప్రజలను  పరివర్తనాత్మకంగా ప్రయాణాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తుంది.. భగవంతుని వైపు నడిపిస్తుంది.

అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయమైన BAPS స్వామినారాయణ అక్షరధామ్ అక్టోబర్ 8న  భక్తుల కోసం తెరవబడింది. ఈ ఆలయం న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే నగరంలో ఉంది. భారతదేశం వెలుపల ఆధునిక యుగంలో అతిపెద్ద హిందూ దేవాలయం. BAPS స్వామినారాయణ సంస్థ , హిందూమతంలోని స్వామినారాయణ శాఖకు చెందినది. BAPS ఉత్తర అమెరికాలో  రానున్న సంవత్సరంలో తన 50వ వసంతాలు పూర్తి చేసుకోనుంది. స్వామినారాయణ శాఖకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 1,200 కంటే ఎక్కువ దేవాలయాలున్నాయి. 3,850 కేంద్రాలను నిర్వహిస్తుంది.

భారీ సంఖ్యలో పర్యాటకులు

అక్షరధామ్ ఆలయ నిర్మాణం సహస్రాబ్దాలుగా విస్తరించి ఉన్న హిందూ సంప్రదాయానికి చిహ్నం. 1781-1830కి చెందిన ఆధ్యాత్మిక గురువు స్వామినారాయణకు అంకితం చేయబడింది. ఈ ఆలయం ఆధ్యాత్మిక పరిమలను వెదజల్లుతూ ప్రపంచం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పర్యాటకులను, యాత్రికులను ఆకర్షిస్తోంది. వాస్తవానికి ‘అక్షరధామ్’ అనే పదానికి అర్ధం ఏమిటంటే..  ‘అక్షర్’ అంటే శాశ్వతం..  ‘ధామ్’ అంటే నివాసం.. ‘దేవుని నివాసం లేదా శాశ్వ నివాసం’ అనే రెండు పదాలకు అర్ధం చెబుతూ ఈ ఆలయం  రూపొందించబడింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ ఆలయంలోకి ప్రవేశించిన తరువాత 11 అడుగుల ఎత్తైన స్వామినారాయణుని అందమైన చిత్రం చూడవచ్చు. ఆధ్యాత్మికతతో ప్రతిధ్వనించేలా ఉండే ఈ ఆలయంలో అడుగు పెట్టిన పర్యాటకులు అడుగడుగునా ఆధ్యాత్మిక అనుభూతి చెందుతారని సంస్థ పేర్కొంది. ఢిల్లీ, గుజరాత్ తర్వాత అమెరికా అక్షరధామ్ మూడో స్థానంలో ఉంది.

2011లో నిర్మాణం ప్రారంభం

ఒక నివేదిక ప్రకారం BAPS స్వామినారాయణ అక్షరధామ్ ఆలయాన్ని స్థాపించిన హిందూ ఆధ్యాత్మిక సంస్థ పేరు పెట్టారు. ఈ ఆలయాన నిర్మాణం 2011 లో ప్రారంభమైంది. ప్రపంచం నలుమూలల నుండి 12,500 మంది కార్మికులు నిర్మించారు. ఈ ఆలయం రాబిన్స్‌విల్లేలో 126 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.

Swami Narayan Temple1

Swami Narayan Temple1

అక్షరధామ్ ఆలయ నిర్మాణం

ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన నాలుగు రకాల పాలరాయి ఇటలీ నుండి తీసుకుని రాగా.. బల్గేరియా నుండి సున్నపురాయిని వినియోగించారు. ఈ రాళ్లు 8,000 మైళ్ళ కంటే ఎక్కువ దూరం ప్రయాణించి న్యూజెర్సీకి చేరుకున్నాయి. మార్గ మధ్యలో పాలరాయి ఎక్కడా పాడవకుండా ఉండడం కోసం అనేక రకాల జాగ్రత్తలు తీసుకుని సేకరించి న్యూ జెర్సీకి తరలించారు. ఈ ఆలయం ఒక పురాణ పజిల్ లా కనిపిస్తుంది.  ప్రస్తుతం ఆధునిక యుగంలో భారతదేశం వెలుపల నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది.

అక్షరధామ్ ఆలయంలో హస్తకళలు

ఆలయ నిర్మాణానికి 1.9 మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఉపయోగించారు. భారతదేశం నుండి గ్రానైట్, రాజస్థాన్ నుండి ఇసుకరాయి, మయన్మార్ నుండి టేకు కలప, గ్రీస్, టర్కీ, ఇటలీ నుండి కలపతో సహా ప్రపంచవ్యాప్తంగా 29 కంటే ఎక్కువ ప్రదేశాల నుంచి ఆలయ నిర్మాణానికి సంబదించిన మార్బుల్,  సున్నపురాయిని వినియోగించారు. ఈ ఆలయంలో 10,000 శిల్పాలు ఉన్నాయి.ఈ శిల్పాలు భారతీయ వాస్తుశిల్పం, సంస్కృతి చిహ్నాలుగా నిలిచి కనువిందు చేస్తాయి.

స్వామి నారాయణ ఆలయం మానవుని అంకితభావానికి, ఆధ్యాత్మిక భక్తికి నిదర్శనం. ఇది అమెరికాలోనే అతి పెద్ద హిందూ దేవాలయం. 19వ శతాబ్దపు హిందూ ఆధ్యాత్మిక గురువు స్వామినారాయణ్‌కు అంకితం చేయబడింది.. ఇతని ఐదవ ఆధ్యాత్మిక వారసుడు, ప్రఖ్యాత సాధువు ప్రముఖ స్వామి మహారాజ నుండి ప్రేరణ పొందింది.

స్వామి మహారాజ్ చేసిన కృషి

లక్షలాది ప్రజల జీవితాల పరివర్తన కోసం ప్రముఖ్ స్వామి మహారాజ్ చేసిన కృషి గుర్తుండిపోతుంది. అతని బోధనలు సామాజిక ప్రమాణాలను పెంపొందించాయి. అంతేకాదు వ్యక్తుల సహజమైన స్వభావాన్ని పెంపొందించడం, కామం, కోపం, దురాశ, అసూయ వంటి ప్రతికూల లక్షణాలను అధిగమించడంలో మానవులకు సహాయపడటంపై దృష్టి సారించాయి.

Swami Narayan Temple

Swami Narayan Temple

సాంస్కృతిక దీపం

కమ్యూనిటీ సభ్యుడు యజ్నేష్ పటేల్ ఈ ఆలయం గురించి స్పందిస్తూ సంస్కృతులను అనుసంధానించడంలో ఈ ఆలయ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ఆలయం అనేక మంది అమెరికన్లకు గర్వకారణంగా నిలిచిందని.. ఇక్కడ భారతీయ కళలు, వాస్తుశిల్పం, సంస్కృతికి విద్యా కేంద్రంగా నిలిచిందో చెప్పారు. అన్ని నేపథ్యాల ప్రజలు హిందూ మత గొప్పతనాన్ని నేర్చుకోగల, అభినందించే ప్రదేశమని అన్నారు.

BAPS స్వామినారాయణ అక్షరధామ్ క్యాంపస్

Swami Narayan Temple

Swami Narayan Temple

నీలకంఠ ప్లాజా

కాంప్లెక్స్ ప్రవేశద్వారం వద్ద యువ యోగి రూపంలో స్వామినారాయణుని 49 అడుగుల పవిత్ర విగ్రహం ఉంది. అతని యవ్వనంలో నీలకంఠుడు అని పిలువబడ్డాడు. భారతదేశం అంతటా 7 సంవత్సరాల పాటు 8,000 మైళ్ళ దూరం ప్రయాణం చేసాడు. తన ప్రయాణంలో అతను విశ్వాసం, క్షమాపణ, పట్టుదల గురించి విలువైన పాఠాలను ప్రజలతో పంచుకున్నాడు. ప్రతి వ్యక్తి ఈ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు.

బ్రహ్మ కుండం

బ్రహ్మ కుండం స్వామినారాయణ అక్షరధామ ముఖ భాగంలో ఉంది. ఇది భారతదేశంలోని 108 పవిత్ర నదుల నీటితో నిండిన సాంప్రదాయ భారతీయ చెరువు. ఇది అమెరికాలోని 50 రాష్ట్రాల గుండా ప్రవహించే నదీ జలాలను కూడా కలిగి ఉంది. ఈ బ్రహ్మకుండం భారతీయుల ప్రకృతి ఆరాధనను, గౌరవాన్ని తెలియజేస్తుంది. నదులను.. దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది.

Swami Narayan Temple

Swami Narayan Temple

స్వాగత కేంద్రం

అతిథులను స్వాగతించే కళ హిందూ సంప్రదాయాల్లో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అతిథి దేవో భవ: అన్న మాటను భావాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచనాత్మకంగా రూపొందించబడింది. ఈ కేంద్రం సాంప్రదాయ భారతీయ హవేలీ నిర్మాణ శైలిని కలిగి ఉంది. కారిడార్లు వెచ్చదనం, ఆతిథ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఈ ఆలయంతో హిందూమతం ప్రతి ఒక్కరికీ పరిచయం అయ్యేలా చేసింది.

పాకశాల రుచి, విశ్వాసాల సంగమం

షాయోనా కేఫ్ శాకాహార భారతీయ, పాశ్చాత్య వంటకాల సమ్మేళనాన్ని అందిస్తుంది. ఇక్కడ పాకశాలలోని ఆహారం కళాత్మకత ఆధ్యాత్మిక సూత్రాలతో మిళితం అయింది.

భక్తి మార్గం

భక్తి మార్గాన్ని చూపే పరిక్రమ అని పిలువబడే అక్షరధామ్ ఆలయంలోని స్తంభాలు మహామందిరం చుట్టూ ఉన్న అర మైలు కంటే ఎక్కువ విస్తీర్ణంలో అందంగా విస్తరించి ఉన్నాయి.

జ్ఞాన పీఠం

హిందూమతంలోని పురాణ గ్రంధాలు, సాధువులు వెల్లడించిన సార్వత్రిక సత్యాలపై ఆధారపడి నిర్మించారు. దేవుడికి మానవుడు చేసే సేవ..  జ్ఞానం, స్పూర్తి దాయకమైన శాంతి, సంతోషం, సమానత్వం వంటి పునాదులపై BAPS స్వామినారాయణ్ అక్షరధామ ఆలయం నిలిచింది. అక్షరధామ మహామందిరానికి సంబంధించిన బేస్ ప్లాట్‌ఫారమ్‌ను జ్ఞాన పీఠం (విజ్డమ్ ప్లింత్) అంటారు.

Swami Narayan Temple

Swami Narayan Temple

మండోవర్: సంగీతం, కళకు ప్రాతినిధ్యం

మండోవర్ దేవాలయం బయటి గోడ. దీనిని వివిధ రకాలుగా అలంకరించారు. హిందూమతానికి సంబంధించిన సంస్కృతి, కళను, వారసత్వాన్ని గౌరవిస్తూ మహామందిరం వెలుపలి భాగంలో భారతీయ నాట్య సాంప్రదాయ రూపాలైన భరతనాట్య భంగిమలు చెక్కబడ్డాయి. ఏ శిల్పాలు నృత్య రూపం సంగీతం, లయ, నాటకం , కథలను మిళితం చేస్తుంది. శిల్పాలలో సంగీత వాయిద్యాలు చిత్రించబడ్డాయి.

మండోవర్ గోడపై 22 పొరలు, 33 అడుగుల ఎత్తు, 108 భరతనాట్యం భంగిమలు, 112 ఋషుల విగ్రహాలు , 151 సాంప్రదాయ భారతీయ సంగీత వాయిద్యాలు చిత్రీకరించబడ్డాయి.

శిఖర నిర్మాణము

ఆలయ శిఖరం ఆధ్యాత్మిక ఆరోహణకు దృశ్య రూపకంగా నిలుస్తుంది. అలంకరించబడిన టవర్లు మన ఆధ్యాత్మిక ప్రయాణాలలో కొత్త శిఖరాలను చేరుకోవడానికి కృషి చేయాలని గుర్తు చేస్తాయి. మనల్ని మనం అర్థం చేసుకునే దిశగా నిరంతరం ముందుకు సాగాలి. ఈ బురుజుల మధ్య 80 అడుగుల ఎత్తైన మహాశిఖరం ఉంది.

4 ఎపిలోగ్‌లు, 13 లేయర్‌లు.. 28 అడుగుల ఎత్తు 8 ఉప శిఖరాలు, 17 పొరలు.. 35 అడుగుల ఎత్తు 4 మహాసమరన్ 16 పొరలు.. 1 మహా శిఖరం 50 అడుగుల ఎత్తు 35 పొరలతో 80 అడుగుల ఎత్తుతో శిఖర నిర్మాణం చేశారు.

అక్షరధామ్‌లోని పవిత్ర విగ్రహాలు

పరబ్రహ్మ భగవానుడు శ్రీ స్వామినారాయణ, అక్షరబ్రహ్మ శ్రీ గుణతీతానంద స్వామి, శ్రీ కృష్ణుడు, శ్రీ రాధాజీ, శివుడు, పార్వతీ దేవి, కార్తికేయుడు, గణపతి, శ్రీరాముడు, సీతాపతి, లక్ష్మణుడు, హనుమంతుడు, శ్రీ  వెంకటేశ్వర స్వామి, పద్మావతి వంటి దేవతల విగ్రహాలున్నాయి.

భగవాన్ శ్రీ స్వామినారాయణ (ఏప్రిల్ 3, 1781 – జూన్ 1, 1830)

ఆధ్యాత్మిక గురువు స్వామినారాయణ ఏప్రిల్ 3, 1781 న ఉత్తర భారతదేశంలోని అయోధ్య సమీపంలోని ఛాపయ్య గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో ఘనశ్యామ్’ అనేవారు. ఎనిమిదేళ్ల వయసులో ఘనశ్యామ్‌ ఆధ్యాత్మిక వైపు ఆకర్షించబడ్డారు. ఆ తర్వాత మూడేళ్ళలో సంస్కృత వ్యాకరణం, వేదాలు, ఉపనిషత్తులు, భగవత్గీత, ధర్మశాస్త్రం, పురాణాలు వంటివి అధ్యయనం చేశారు. 10 సంవత్సరాల వయస్సులో కాశీలో జరిగిన చర్చలో గెలిచి పండితుల మధ్య తన మహిమ ప్రదర్శించారు.

అనంతరం ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి, ఉద్ధరించడానికి 11 సంవత్సరాల వయస్సులో ఇంటిని విడిచిపెట్టి దేశాల బాట పట్టాడు. ఆధ్యాత్మిక యాత్ర లో ఏడేళ్లలో 8000 మైళ్లు ప్రయాణించి భారతదేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించాడు. ఈ తీర్థయాత్ర చేసే సమయంలో పండితులతో, ఋషులతో చర్చలలో పాల్గొంటూనే ఉన్నాడు. ఈ సమయంలో “నీలకంఠ” అనే బిరుదుని స్వీకరించాడు. ఎక్కడికి వెళ్లినా ప్రకృతికి సంబంధించిన ఐదు ప్రశ్నలు (జీవ, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ) అడిగేవాడు అయినప్పటికీ వాటికీ సంబంధించిన సంతృప్తికరమైన సమాధానం రాలేదు.

గుజరాత్‌లోని సౌరాష్ట్రలోని లోజ్‌లో రామానంద్ స్వామి ఆశ్రమం ఉండేది. రామానంద స్వామి నీలకంఠుని దీక్షను ప్రారంభించి ఘనశ్యామ్ కి సహజానంద స్వామి అని పేరు పెట్టారు. తరువాత  రామానంద్ స్వామి 21 సంవత్సరాల వయస్సులో సహజానంద స్వామికి శాఖకు అధిపతిగా నియమించారు. రామానంద స్వామి మరణానంతరం సహజానంద స్వామి ఆయనకు స్వామినారాయణ మహామంత్రాన్ని అందించారు. అనంతరం ఆయన స్వామినారాయణగా ప్రసిద్ధి చెందారు.

21 నుండి 49 సంవత్సరాల వయస్సు వరకు స్వామినారాయణ  3,000 పరమహంస నైతిక, సామాజిక,  ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి నాయకత్వం వహించారు. భగవంతునిపై విశ్వాసం ఉంచి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని ప్రజలను ప్రేరేపించారు. జంతువులను చంపవద్దనిసూచించారు. అతను కఠినమైన కుల వ్యవస్థను కూడా వ్యతిరేకించారు. మహిళా సంక్షేమం కోసం పాటుపడ్డారు. సతి సహగమనం, ఆడ పిల్లల  భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలు.. జగిత్యాలలో చిన్నారిపై..
ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలు.. జగిత్యాలలో చిన్నారిపై..
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌.. రేపు విచారణ
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌.. రేపు విచారణ
' ఆ టైమ్‌లో గదికి రమ్మన్నాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై యానిమల్ నటుడు
' ఆ టైమ్‌లో గదికి రమ్మన్నాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై యానిమల్ నటుడు
ఉద్యోగ నియామకాలపై కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం..!
ఉద్యోగ నియామకాలపై కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం..!
నేడు రైతుల పండగ తొలి ఏకాదశి.. ద్వారకా తిరుమలకు పోటెత్తిన భక్తులు
నేడు రైతుల పండగ తొలి ఏకాదశి.. ద్వారకా తిరుమలకు పోటెత్తిన భక్తులు
ఈ ఆలయంలో నల్ల రంగులో హనుమాన్ విగ్రహం.. పురాణ కథ ఏమిటంటే?
ఈ ఆలయంలో నల్ల రంగులో హనుమాన్ విగ్రహం.. పురాణ కథ ఏమిటంటే?
తల్లి చావును చూసి‌ కూడా మారని కసాయి కొడుకు
తల్లి చావును చూసి‌ కూడా మారని కసాయి కొడుకు
ఓటీటీలో యోగిబాబు బూమర్ అంకుల్.. తెలుగులో స్ట్రీమింగ్..ఎప్పుడంటే?
ఓటీటీలో యోగిబాబు బూమర్ అంకుల్.. తెలుగులో స్ట్రీమింగ్..ఎప్పుడంటే?
జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి 2025ప్రవేశాలకు నోటిఫికేషన్‌
జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి 2025ప్రవేశాలకు నోటిఫికేషన్‌
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి కల్కి 2898 ఏడీ..
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి కల్కి 2898 ఏడీ..
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై