Mahanandi Temple: మహానంది స్వామివారికి భక్తుడి భూరి విరాళం.. 32 కేజీల వెండి రుద్రాక్ష మండపం
మహానంది కోనేరులో చేరుతోంది.ఈ కోనేరులో స్నానం మాచరిస్తే శరీర రుగ్మతలు పోతాయి అనేది నమ్మకం. అటువంటి దినదినాభివృద్ధి చెందుతున్న మహానంది ఆలయానికి భక్తుల నుంచి కానుకలు ఆభరణాలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రమైన నంద్యాలకు చెందిన రిటైర్డ్ ఎస్బిఐ మేనేజర్ మారం వెంకటసుబ్బయ్య దంపతులు 35 కేజీల వెండితో తయారు చేయించిన రుద్రాక్ష మండపాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చారు. రుద్రాక్ష మండపం గర్భ ఆలయంలో స్వామి వారి పై భాగాన అలంకరిస్తారు. ఈ అలంకరణలో స్వామివారు దేదీప్యమానంగా కాంతులినుతున్నారు
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహానంది ప్రముఖమైనది. ఇటీవల కాలంలో మరింతగా దినదినాభివృద్ధి చెందుతోంది ఈ క్షేత్రం. ఈరోజు రోజుకీ శివయ్యను దర్సించించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఆలయంలో ఉన్న కోనేరులు ఈ ఆలయానికి స్పెషల్ గుర్తింపుని తెచ్చింది. నల్లమల లో వివిధ రకాల ఆయుర్వేద చెట్ల వేర్లను తాకుతూ ఈ నీరు వచ్చి మహానంది కోనేరులో చేరుతోంది . ఈ కోనేరులో స్నానం మాచరిస్తే శరీర రుగ్మతలు పోతాయి అనేది నమ్మకం. అటువంటి దినదినాభివృద్ధి చెందుతున్న మహానంది ఆలయానికి భక్తుల నుంచి కానుకలు ఆభరణాలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా కేంద్రమైన నంద్యాలకు చెందిన రిటైర్డ్ ఎస్బిఐ మేనేజర్ మారం వెంకటసుబ్బయ్య దంపతులు 35 కేజీల వెండితో తయారు చేయించిన రుద్రాక్ష మండపాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చారు. రుద్రాక్ష మండపం గర్భ ఆలయంలో స్వామి వారి పై భాగాన అలంకరిస్తారు. ఈ అలంకరణలో స్వామివారు దేదీప్యమానంగా కాంతులినుతున్నారు
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానంది ఆలయంకు వెండితో తయారు చేసిన రుద్రాక్ష మండపంను ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్ రెడ్డికి దాతలు అందజేశారు. నంద్యాలకు చెందిన రిటైర్డ్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ మారం వెంకట సుబ్బయ్య దంపతులు 35 కేజీలతో తయారీ చేసి వెండి మండపాన్ని ఈ ఓ చంద్రశేఖర్ రెడ్డికి అందజేశారు. కార్తీక మూడవ సోమవారం సందర్భంగా ఆలయంలో సంప్రోక్షణ అనంతరం దాతల కుటుంబీకులు శ్రీ మహానంధీశ్వర స్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించి రుద్రాక్ష మండపాన్ని అందజేశారు. దాతలు వెంకటసుబ్బయ్యకు కుటుంబీకులకు ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దినదినాభివృద్ధి చెందుతున్న మహానందిలో మరింత మంది భక్తులు విరాళాలు అందజేశి ఆలయ అభివృద్ధి లో భాగస్వాములైన స్వామి,అమ్మవార్ల కృపకు పాత్రులు కావలెనని ఈఓ కోరారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..