Cyclone Michaung: నేడు తీరం దాటనున్న మిచౌంగ్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

మిచౌంగ్‌ తుపాన్ తరుముకొస్తుంది. తుపాన్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బీ అర్ అంబేడ్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణ, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా.. తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Cyclone Michaung: నేడు తీరం దాటనున్న మిచౌంగ్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
Rains In Andhra Pradesh
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2023 | 6:39 AM

చెన్నైపై విరుచుకుపడ్డ మిచౌంగ్‌… బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడింది. నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫాన్ గానే మధ్యాహ్నం లోపు తీరం దాటనున్నది మిచౌంగ్. ఈ తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను  తమిళనాడుతో పాటు  తెలుగు రాష్ట్రాలపై  తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపధ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.

రెడ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాలు

మిచౌంగ్‌ తుపాన్ తరుముకొస్తుంది. తుపాన్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బీ అర్ అంబేడ్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణ, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా.. తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరో వైపు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు ఆయా జిల్లాల కలెక్టర్లు.

మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ పలు రైళ్లు రద్దు

విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దను చేస్తూ రైల్వే శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈరోజు తిరుపతి- బిలాసపూర్ (17480) ఎక్స్ప్రెస్

తిరుపతి- విశాఖపట్నం (08584) స్పెషల్ తిరుచునాపల్లి ఎక్స్ప్రెస్

కేఎస్ఆర్ బెంగళూరు- న్యూటిన్సుకియా జంక్షన్ (22501) ఎక్స్ప్రెస్,

ఎస్ఎంవీ బెంగళూరు- అగర్తలా (12503) ఎక్స్ప్రెస్ రద్దు

రేపు పూరీ-తిరుపతి (17479) ఎక్స్ప్రెస్ రద్దు

వైజాగ్ ఎయిర్ పోర్ట్

మిచౌంగ్ తుఫాన్ తో ప్రతికూల వాతావరణ పరిస్థితుల ను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు 19 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఇండిగో విమాన సంస్థ.

తిరుమలలో

మిచౌంగ్‌ తుఫాన్‌  ప్రభావంతో తిరుమలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈదురు గాలుల ఉధృతికి  భారీ వృక్షాలు నేలకొరిగాయి. పాంచజన్యం అతిధి గృహం వద్ద  పెద్ద చెట్టు కుప్పకూలి నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కురిసిన జోరువానకు రేణిగుంటలో విమానాశ్రయం రన్ వే పైకి వరదనీరు దూసుకొచ్చింది. దీంతో విమానా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేణిగుంటకు విమాన రాకపోకలు రద్దు చేశారు అధికారులు. అటు విశాఖలోను సేమ్ సిచ్వేవేషన్ కనిపించింది. తుపాన్‌ ఎఫెక్ట్‌తో పలు విమానాలను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. మరోవైపు తుపాన్ కారణంగా 4 రైళ్లను పూర్తిగా రద్దు  చేశారు. మరో 3 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.

సహాయక చర్యలు ముమ్మరం.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది అధికారయంత్రాంగం. కృష్ణాజిల్లా అవనిగడ్డ మండల పరిధిలోని తుఫాను పురావాస కేంద్రాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ. రాష్ట్రంలో వర్షాలపై 8 మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు సీఎం జగన్‌. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వేగంగా తరలించాలని, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. క్యాంప్‌లకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి, కుటుంబానికికైతే రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు బియ్యం సహా కూరగాయలు, సరకులు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం. కుండపోతగా కరుస్తున్న వర్షాలకు.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి.అనేక చోట్ల  అపార్ట్ మెంట్లు , షాపింగ్ మాల్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే