AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaala Bhairava Puja: నేడు కాలభైరవ జయంతి.. పూజ శుభ సమయం, ప్రాముఖ్యత.. కుక్కకు ఆహారం అందించండి

పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ.. విష్ణువు మధ్య ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది. ఈ విషయానికి సంబంధించి బ్రహ్మా దేవుడు, విష్ణువు దేవతలందరితో పాటు శివుడిని సంప్రదించారు. ఆ సమయంలో  దేవతలందరూ ఒకచోట కూర్చొని మహాదేవుడు ఉత్తముడని తేల్చారు. అయితే బ్రహ్మదేవుడు దీనిని అంగీకరించలేదు. శివుడిని ఉత్తముడు అని పిలవడానికి బదులుగా.. సాధారణ దేవుడుగా భావించి.. దూషించాడు. అప్పుడు శివుడు కోపం తెచ్చుకున్నాడు. శివుడు ఐదవ రుద్ర అవతారంగా కాల భైరవుడు జన్మించాడు.

Kaala Bhairava Puja: నేడు కాలభైరవ జయంతి.. పూజ శుభ సమయం, ప్రాముఖ్యత.. కుక్కకు ఆహారం అందించండి
Kaala Bhairava Puja
Surya Kala
|

Updated on: Dec 05, 2023 | 7:18 AM

Share

హిందూ మతంలో కాల భైరవుడిని ప్రతి నెల కృష్ణ పక్షంలోని అష్టమి తిథిన పూజిస్తారు. అయితే కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజున శివయ్య రుద్రావతారమైన కాల భైరవుడు అవతరించినట్లు విశ్వాసం. పురాణ గ్రంథాలలో కాల భైరవుడు శివుని ఉగ్ర రూపంగా వర్ణించబడ్డాడు. అంతేకాదు కాశీ క్షేత్ర పాలకుడు కూడా. కాల భైరవుడు అతి త్వరగా సంతోషించే దైవంగా పరిగణించబడుతున్నాడు. తనని పూజించిన భక్తులకు ఆశీర్వాదం అందిస్తాడు. కాల భైరవ జయంతి సందర్భంగా నియమ నిష్టలతో కాల భైరవుడిని ఆరాధించడానికి అనుకూలమైన సమయం, ఆరాధన కోసం శుభ సమయం, ప్రాముఖ్యతను తెలుసుకుందాం..

పంచాంగం ప్రకారం కార్తీకమాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి సోమవారం 4 డిసెంబర్ 2023 రాత్రి 9.59 గంటలకు ప్రారంభమైంది. ఇది బుధవారం, డిసెంబర్ 6, 2023 మధ్యాహ్నం 12:37 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథి ఏదైనా ఉపవాసం, పూజ, ఆచారాలకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కనుక ఉదయ తిథి ప్రకారం కాల భైరవుని జన్మదినాన్ని మంగళవారం, 5 డిసెంబర్ 2023 నాడు జరుపుకుంటారు.

కాలభైరవుని ఆరాధనకు అనుకూలమైన సమయం

పగటిపూట పూజా సమయం – ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 1:29 వరకు.

ఇవి కూడా చదవండి

రాత్రి పూజా సమయం – 11:44 నుండి 12:39 వరకు ఉంటుంది.

కాలభైరవుడు ఎలా అవతరించాడంటే

పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ.. విష్ణువు మధ్య ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది. ఈ విషయానికి సంబంధించి బ్రహ్మా దేవుడు, విష్ణువు దేవతలందరితో పాటు శివుడిని సంప్రదించారు. ఆ సమయంలో  దేవతలందరూ ఒకచోట కూర్చొని మహాదేవుడు ఉత్తముడని తేల్చారు. అయితే బ్రహ్మదేవుడు దీనిని అంగీకరించలేదు. శివుడిని ఉత్తముడు అని పిలవడానికి బదులుగా.. సాధారణ దేవుడుగా భావించి.. దూషించాడు. అప్పుడు శివుడు కోపం తెచ్చుకున్నాడు. శివుడు ఐదవ రుద్ర అవతారంగా కాల భైరవుడు జన్మించాడు. కోపంతో కాల భైరవుడు బ్రహ్మ ఐదు ముఖాల్లో ఒకదానిని భస్మం చేసి తనను అవమానించిన బ్రహ్మకు బుద్ధి చెప్పాడు. అప్పటి నుండి బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు మాత్రమే ఉన్నాయి. కాలభైరవుడి జననం ఇలా జరిగింది. అప్పటి నుంచి రుద్ర రూపంగా ప్రజలు ఆరాధిస్తున్నారు.

భైరవుని పూజ విధి

కాలభైరవ జయంతి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఉపవాస దీక్షను చేపట్టాలి.

రాత్రి పూట కాల భైరవుడిని పూజించే సంప్రదాయం ఉంది.

ఈ రోజు సాయంత్రం గుడికి వెళ్లి భైరవుని విగ్రహం ముందు నాలుగు వైపులా దీపాలు వెలిగించండి.

దీని తరువాత, పువ్వులు, కందిపప్పు, తమలపాకులు, తాంబూలం, కొబ్బరి వంటివాటితో పూజ చేసి స్వీట్స్ ను నైవేద్యంగా సమర్పించండి.

తర్వాత ఆసనం మీద కూర్చుని కాలభైరవుని చాలీసా చదవండి.

పూజ పూర్తయిన తర్వాత ఆరతి ఇచ్చి.. తెలిసి లేదా తెలియక చేసిన తప్పులను క్షమించమని అడగండి.

కాలభైరవుడి పూజ ప్రాముఖ్యత

కాల భైరవుడిని పూజించడం ద్వారా ప్రజలు భయం నుండి విముక్తి పొందుతారు. కాల భైరవుడు మంచి పనులు చేసే వ్యక్తుల పట్ల ఎల్లప్పుడూ అనుగ్రహంగా ఉంటాడని.. కోరిక కోర్కెలు తీరుస్తాడని నమ్మకం.  అనైతిక చర్యలకు పాల్పడేవారు భైరవుడి ఆగ్రహం నుంచి తప్పించుకోలేరు. పురాణగ్రంధాలలో కూడా కాలభైరవుని వాహనం కుక్కగా వర్ణించబడింది. అటువంటి పరిస్థితిలో కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే జన్మదినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా నల్ల కుక్కకు ఆహారం తినిపించండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు