AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: మీరు ఇష్టపడే రంగులు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయని తెలుసా.. ఏ రంగుని ఇష్టపడితే ఎలా ఉంటారంటే

మీ రంగుల ఎంపిక కూడా మీ వ్యక్తిత్వం గురించి చెబుతుందని మీకు తెలుసా. వాస్తవానికి, జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏ రంగుకు ఆ రంగే తన సొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రంగుని ఇష్టపడే వ్యక్తులు అతని స్వభావం, ఆలోచన ఆధారపడి ఉంటుంది. ఇష్టమైన రంగు ద్వారా మీ గురించి లేదా ఇతరుల గురించి మీరు చాలా తెలుసుకోవచ్చు.. ఎలాగంటే 

Astro Tips: మీరు ఇష్టపడే రంగులు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయని తెలుసా.. ఏ రంగుని ఇష్టపడితే ఎలా ఉంటారంటే
Astro Tips
Surya Kala
|

Updated on: Dec 03, 2023 | 4:12 PM

Share

రంగుల విషయంలో ప్రతి ఒక్కరికీ సొంతం ఎంపిక ఉంటుంది. తమకు ఏ రంగు ఎక్కువగా ఇష్టం అయితే ఆ రంగుకు సంబంధించిన మరిన్ని వస్తువులు లేదా దుస్తులు ఇలా ప్రతి ఒక్కటి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే మీ రంగుల ఎంపిక కూడా మీ వ్యక్తిత్వం గురించి చెబుతుందని మీకు తెలుసా. వాస్తవానికి, జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏ రంగుకు ఆ రంగే తన సొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రంగుని ఇష్టపడే వ్యక్తులు అతని స్వభావం, ఆలోచన ఆధారపడి ఉంటుంది. ఇష్టమైన రంగు ద్వారా మీ గురించి లేదా ఇతరుల గురించి మీరు చాలా తెలుసుకోవచ్చు.. ఎలాగంటే

పింక్ కలర్: సాధారణంగా అమ్మాయిలు ఈ రంగును ఇష్టపడతారు. అయితే కొంతమంది అబ్బాయిలకు కూడా పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. పింక్ కలర్‌ను ఇష్టపడే వారి హృదయం చాలా మృదువుగా ఉంటుందని నమ్మకం. ఈ వ్యక్తుల నేచర్ సరళంగా ఉంటుంది. సులభంగా నలుగురిలో కలిసి పోతారు. తమ మనసులో  ఏముందో అది బయటకు వ్యక్తం చేస్తారు. అదే సమయంలో వీరు ఎవరి బాధనైనా చూస్తే చాలా త్వరగా భావోద్వేగానికి లోనవుతారు.

ఆకుపచ్చ రంగు: ఆకుపచ్చ రంగును ఇష్టపడే వ్యక్తులు సమాజంలో తమ ఇమేజ్ గురించి చాలా ఆందోళన చెందుతారు. అయితే వీరి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో దానికి ఇన్నర్ ఫీలింగ్ కు చాలా తేడా ఉంటుంది. ఈ వ్యక్తులు ఎవరి మాటలకైనా చాలా త్వరగా ప్రభావితమవుతారు.

ఇవి కూడా చదవండి

ఎరుపు రంగు: ఎరుపు రంగును ఇష్టపడేవారు చాలా ప్రేమగా.. శృంగారభరితంగా ఉంటారు. అంతేకాదు  ఆశ్చర్యకరమైనవి మొదలైనవాటిని ప్లాన్ చేయడానికి ఇష్టపడతారు. అయితే  వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది.

నలుపు రంగు: చాలా మందికి నలుపు రంగు అంటే ఇష్టం. ఈ రంగుని ఇష్టపడే వ్యక్తులు చాలా మొండిగా ఉంటారు . ఏదైనా సమస్య ఏర్పడితే చాలా త్వరగా చిరాకు పడతారు.  ప్రతి చిన్న విషయానికి చాలా కోపం వస్తుంది.

పసుపు రంగు: పసుపు రంగును ఇష్టపడే వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు. ఇతరులను కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. వీరు దేని గురించి పెద్దగా చింతించరు. జీవితాన్ని పరిస్థితికి అనుగుణంగా జీవిచండానికి ఇష్టపడతారు.

నీలం రంగు: నీలం రంగు చాలా చీకటిగా పరిగణించబడుతుంది. ఈ రంగుని ఇష్టపడే వారు ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచిస్తారు. ఇతరులకు చాలా ప్రేమను అందిస్తారు. ఎటువంటి ఆలోచన అయినా మనసులో దాచుకుంటారు. తరచుగా తమ భావాలను ఇతరులతో పంచుకోలేరు.

తెలుపు రంగు: సాధారణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకు తెలుపు రంగు చాలా ఇష్టమైన రంగు. ఈ వ్యక్తులు శాంతిని ఇష్టపడతారు. సొంత వ్యాపారాన్ని చూసుకుంటారు. వీరు బయటికి ఒకలా కనిపించడం.. మనసులో ఒకలా ఆలోచించడాన్ని అస్సలు ఇష్టపడరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?