Lord Sun: సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలంటే రోజు అర్ఘ్యం ఇలా సమర్పించండి.. ప్రతి కోరిక నెరవేరుతుంది
హిందూ మతంలో సూర్యుడి దైవంగా భావించి పూజిస్తారు. చాలా మంది ఉదయం పూజ చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తారు. సూర్యునికి అర్ఘ్యం నైవేద్యాన్ని సమర్పించడం వలన శుభం కలుగుతుంది. గౌరవం పెరుగుతుంది. అంతేకాదు ఏదైనా కారణాల వల్ల వివాహం ఆలస్యం అయినట్లయితే.. సూర్యుడికి క్రమం తప్పకుండా అర్ఘ్యం సమర్పించడం ద్వారా మంచి సంబంధం కుదురుతుందని విశ్వాసం.
హిందూ మతంలో సూర్య భగవానుడి ప్రత్యక్ష దైవంగా భావించి పూజిస్తారు. నిత్యం భక్తులకు ప్రత్యక్షంగా కనిపించే ఏకైక దేవుడు సూర్యుడని నమ్ముతారు. ప్రతి వ్యక్తి జీవితంలో సూర్యుడు పెద్ద పాత్ర పోషిస్తాడు. ఎవరి జాతకంలో సూర్యుని స్థానం బలంగా ఉంటే అతను జీవితంలో చాలా విజయాలు, కీర్తిని పొందుతాడు. జాతకంలో సూర్యుని స్థానం చెడుగా ఉంటే జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి పూజించండి.
హిందూ మతంలో సూర్యుడి దైవంగా భావించి పూజిస్తారు. చాలా మంది ఉదయం పూజ చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తారు. సూర్యునికి అర్ఘ్యం నైవేద్యాన్ని సమర్పించడం వలన శుభం కలుగుతుంది. గౌరవం పెరుగుతుంది. అంతేకాదు ఏదైనా కారణాల వల్ల వివాహం ఆలస్యం అయినట్లయితే.. సూర్యుడికి క్రమం తప్పకుండా అర్ఘ్యం సమర్పించడం ద్వారా మంచి సంబంధం కుదురుతుందని విశ్వాసం.
నేటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో తమ ఇంటికి వచ్చిన అతిథికి ముందుగా మంచి నీరు అందించి తరువాత పలకరించే సంప్రదాయం ఉందన్నారు. ఈ సంప్రదాయాన్ని మన పెద్దలు, ఋషులు ప్రారంభించారు. అలాగే సూర్య భగవానుని పూజించాలి. సూర్యుడు లేకుంటే ప్రపంచమంతా శూన్యం. ప్రపంచం చీకటిగా మారుతుంది. ఆది దేవుడు సూర్యభగవానుడికి సూర్యోదయ సమయంలో రాగి పాత్రతో నీటిని సమర్పిస్తూ అర్ఘ్యన్ని సమర్పిస్తారు.
అర్ఘ్యం సమర్పించేటప్పుడు పాటించాల్సిన నియమాలు
సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తున్న సమయంలో రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటితో నింపి, కుంకుమ, చందనం, ఎర్రటి పువ్వులు, అక్షతలు వేసి బాగా కలపాలి. తర్వాత రెండు చేతులను వీలైనంత పైకి లేపి తల ముందు చేతులను పెట్టి అర్ఘ్యం సమర్పించండి.. నీటిని వదులుతూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో తూర్పు వైపు నిలబడాలి. సూర్యుడిపై దృష్టిని సారించాలి.
సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఎవరైనా సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తే.. ఆసమయంలో సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు శరీరానికి కొత్త శక్తిని అందిస్తాయి. శరీరంలోని అనేక వ్యాధులు, క్రిములు నశిస్తాయి. కనుక సూర్య భగవానుడికి రోజూ అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన సూర్యభగవానుని ఆశీస్సులు పొందడంతో పాటు తమ కోరికలు నెరవేరతాయని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు