Australia Indian: ఆస్ట్రేలియా కారు ప్రమాదంలో భారతీయుడు.. పలుమార్లు బోల్తా కొట్టిన కారు.
ఆస్ట్రేలియాలో జరిగిన కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మరణించాడు. భర్త మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సహాయం చేయాలని అతడి భార్య కోరింది. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన 26 ఏళ్ల ఖుష్‌దీప్ సింగ్, మెల్‌బోర్న్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా రాత్రి 11.15 గంటల సమయంలో పామర్స్ రోడ్‌లో కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కారు పలుమార్లు బోల్తా కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడికి వైద్య సేవలు అందించేందుకు..
ఆస్ట్రేలియాలో జరిగిన కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మరణించాడు. భర్త మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సహాయం చేయాలని అతడి భార్య కోరింది. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన 26 ఏళ్ల ఖుష్‌దీప్ సింగ్, మెల్‌బోర్న్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా రాత్రి 11.15 గంటల సమయంలో పామర్స్ రోడ్‌లో కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కారు పలుమార్లు బోల్తా కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడికి వైద్య సేవలు అందించేందుకు అత్యవసర మెడికల్ సిబ్బంది ప్రయత్నించారు. అయితే అతడు సంఘటనా స్థలంలో చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణం తెలియదని, అలసట వల్ల జరిగి ఉండవచ్చని ఆస్ట్రేలియా పోలీస్ అధికారులు తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన భర్త మృతదేహాన్ని భారత్‌లో ఉన్న అతడి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు సహకరించాలని మృతుడి భార్య జప్నీత్ కౌర్, కేంద్ర ప్రభుత్వానికి విజ్తప్తి చేసింది. అలాగే ఖర్చుల కోసం నిధుల సేకరణ ప్రారంభించింది. ఆమె చదువు నిమిత్తం గత ఏడాది ఆస్ట్రేలియా వచ్చి భర్తతో కలిసి ఉంటుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

