Dumb Bomb: గాజాలో మరణాలకు ‘డంబ్ బాంబ్స్’ కారణమా.? మరిన్ని వివరాలు..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంతో గాజా వాసులు విలవిల్లాడిపోతున్నారు. దక్షిణ గాజాలో కూడా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఇప్పుడు అక్కడి ప్రజలకూ సురక్షిత స్థానమంటూ లేకుండా పోయింది. ఫలితంగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కచ్చితత్వం లేని ‘డంబ్ బాంబు’లను అధికంగా వాడటం కూడా ఇందుకు కారణం కావొచ్చని అమెరికా నిఘా సంస్థ నివేదిక అంచనా వేసింది. దీనిని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం...
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంతో గాజా వాసులు విలవిల్లాడిపోతున్నారు. దక్షిణ గాజాలో కూడా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఇప్పుడు అక్కడి ప్రజలకూ సురక్షిత స్థానమంటూ లేకుండా పోయింది. ఫలితంగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కచ్చితత్వం లేని ‘డంబ్ బాంబు’లను అధికంగా వాడటం కూడా ఇందుకు కారణం కావొచ్చని అమెరికా నిఘా సంస్థ నివేదిక అంచనా వేసింది. దీనిని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం రూపొందించిందని సీఎన్‌ఎన్ కథనంలో పేర్కొంది. వైమానిక దాడుల్లో భాగంగా గాజాపై వినియోగిస్తున్న డంబ్‌బాంబుల సంఖ్య ఎక్కువే. అందుకే అవి జనావాసాలపై పడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటోంది. దాంతో భారీగా ప్రాణనష్టం సంభవించడానికి కారణమవుతోందని నివేదిక పేర్కొంది.
గాజా లాంటి అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ ప్రాణనష్టం సాధారణం కంటే మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఉపయోగించిన 29వేల బాంబుల్లో 40-45 శాతం డంబ్ బాంబులే ఉన్నాయని పేర్కొంది. యూఎస్ అంచనాపై ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి స్పందిస్తూ.. తాము ఏ తరహా ఆయుధాలు వాడుతున్నామో చెప్పం అని తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వరం మారిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఇజ్రాయెల్ చేస్తున్న విచక్షణారహిత బాంబింగ్‌ను తప్పుపట్టారు. ఈ వైఖరి వల్లే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతు కోల్పోతోందని హెచ్చరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

