- Telugu News Photo Gallery Spiritual photos Gudical village nadavalayyaswamy hill strange customs in kurnool district
Lord Hanuman: ఇదో వింత.. కొండపై రాళ్లు, కర్రలు ముట్టుకోవాలంటే ఆ గ్రామస్థులకు చచ్చేంత భయం ఎందుకో తెలుసా?
మనకి దగ్గరలో ఏవైనా చెట్లు ఉంటే వాటిని కొట్టుకొని వంట పొయ్యికి ఉపయోగించుకుంటాం.. అలాగే రాళ్లు ఉంటే ఇంటి నిర్మాణానికి వాడుకుంటాం.. అయితే ఆ కొండ పై కట్టెలు కానీ రాళ్లు కానీ ముట్టుకుంటే దేవుడి ఆగ్రహానికి గురవుతారంటా..దీంతో ఇప్పటికీ ఆ కొండ పై చెట్లను , రాళ్లను ముట్టుకోవలంటే ఆ గ్రామస్థులు గజ గజ వనికిపోతుంటారు.
Updated on: Dec 23, 2023 | 2:28 PM

కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో పూర్వం నుంచి వస్తున్న ఈ వింత ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ కొండపైకి వెళ్తే పూచిక పుల్లకూడా ముట్టుకోరు.. కనీసం పువ్వులు, రాళ్లు కూడా తెచ్చుకోరు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం లోని గుడేకల్ గ్రామంలో కొండపైన ఆంజయనేయ స్వామి వెలిశాడు. ఈ దేవాలయంలో వెలిసిన అంజన్నని గ్రామస్తులందరు నడవలయ్య స్వామిగా పిలుచుకుంటారు. నిత్యం దూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు.

ఆ కొండ పై అడుగు పెట్టాలన్నా ఎంతో పవితంగ్రా ఉండాలని నాటి నుంచి వస్తున్న ఆచారం. మామూలుగా చాలా మంది కొండలమీద కట్టెపుల్లలు ఏరుకురావడం, కొమ్మలు నరకడం లాంటివి చేస్తూంటారు.

పూర్వ కాలం నుంచే ఆ కొండపై కట్టెలు కొట్టాలన్నా, రాళ్లను ముట్టుకోవాలన్నా గ్రామ ప్రజలు గుండెలు అదురుతాయి. దానికి కారణం లేకపోలేదు.

ఆ కొండ మీద ఆకులు కానీ, కట్టెలు కానీ, రాళ్లు కానీ ఏది ముట్టుకున్నా దేవుడి ఆగ్రహానికి గురవుతారని , కళ్ళు పోతాయని కులాలకు అతీతంగా అక్కడి గ్రామస్తులు నమ్ముతారు.

ఊరిలో ఎంత కరువు వచ్చినా, ఎవ్వరైనా సొంత ఇల్లు కట్టాలనుకున్నా ఆ కొండపై నుంచి చిన్న రాయి ముక్క కూడా తీసుకురారు. అంతేకాదు ఆ కొండ మీద ఒక కట్టేముక్క కూడా నరకరు.

ఒకవేళ మూఢనమ్మకం అని కొట్టిపారేసి మొండిగా వ్యవహరిస్తే కళ్ళు పోవడం, కాళ్ళు చేతులు పడిపోవడం, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతామని గ్రామస్తులు చెబుతున్నారు.

గ్రామంలో చదువుకున్న యువకులు, విద్యావంతులు ఎంతో మంది ఉన్నా కూడా పూర్వం నుంచి వస్తున్న ఇదే పద్ధతిని పాటిస్తున్నారు.




