Red Ant Chutney: ఒడిశా ఎర్ర చీమల చట్నీకి GI ట్యాగ్‌.. ఆదివాసీల ఇష్టమైన ఫుడ్.. ఆరోగ్య ప్రయోజనాలు.. రెసిపీ మీ కోసం

చీమల చట్నీ ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా .. చీమలు , వాటి గుడ్ల నుండి చట్నీ తయారు చేస్తారు. అది కూడా చాలా కారం కారంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇప్పుడు ఒడిశాకు చెందిన ఈ ఎర్ర చీమల పచ్చడికి జిఐ ట్యాగ్ వచ్చింది. ప్రజలు తమ ఆహార పదార్థాలను, ముఖ్యంగా తీపి పదార్థాలను చీమల నుంచి రక్షించుకోవడానికి ప్రత్యేక కృషి చేస్తారో.. అదే ఎర్ర చీమల నుండి తయారు చేయబడిన చట్నీ భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ను పొందింది.

Red Ant Chutney: ఒడిశా ఎర్ర చీమల చట్నీకి GI ట్యాగ్‌.. ఆదివాసీల ఇష్టమైన ఫుడ్.. ఆరోగ్య ప్రయోజనాలు.. రెసిపీ మీ కోసం
Red Ant Chutney
Follow us

|

Updated on: Jan 11, 2024 | 4:05 PM

భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. భిన్నమైన ఆచార సంప్రదాయాలు.. భిన్నమైన ఆహారపు అలవాట్లు మనవారి సొంతం.. మనదేశంలో దాదాపు 10 రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల్లో, అడవుల్లో నివసించే ఆదివాసీలు కీటకాలను ఆహారంగా తీసుకుంటున్నారు. చీమలు, పురుగులు, ఉసుళ్ళు వంటి దాదాపు 300లకు పైగా కీటకాలను రకరకాలుగా వండుకుని తింటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులను తట్టుకోవడానికి బలమైన ఆహారం అంటూ ఎర్ర చీమలు, ఉసుళ్లతో చేసిన ఆహారాన్ని లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇవి  ఆరోగ్యానికి మంచిది కూడా మంచిది అని నమ్మకం.

చీమల చట్నీ ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా .. చీమలు , వాటి గుడ్ల నుండి చట్నీ తయారు చేస్తారు. అది కూడా చాలా కారం కారంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇప్పుడు ఒడిశాకు చెందిన ఈ ఎర్ర చీమల పచ్చడికి జిఐ ట్యాగ్ వచ్చింది. ప్రజలు తమ ఆహార పదార్థాలను, ముఖ్యంగా తీపి పదార్థాలను చీమల నుంచి రక్షించుకోవడానికి ప్రత్యేక కృషి చేస్తారో.. అదే ఎర్ర చీమల నుండి తయారు చేయబడిన చట్నీ భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ను పొందింది.

ఇవి కూడా చదవండి

జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎర్ర చీమల పచ్చడి

జనవరి 2, 2024న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన రెడ్ యాంట్స్ చట్నీ ఈ ఘనతను సాధించింది. అంటే ఈ చట్నీని ఇప్పుడు అధికారికంగా మయూర్‌భంజ్ చట్నీ అని పిలవవచ్చు. అయితే ఈ చట్నీ ఒడిశా లేదా మయూర్‌భంజ్‌లో మాత్రమే దొరుకుతుందని కాదు. ఇటువంటి చట్నీని జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కూడా తయారు చేసి తింటారు. ఈ రాష్ట్రాల్లో నివశిస్తున్న గిరిజనులకు ఎర్ర చీమల చట్నీ చాలా ఇష్టమైన వంటకం.

ఎర్ర చీమలు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తాయి

ఈ ఎర్ర చీమలు ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ అడవులలో పుష్కలంగా కనిపిస్తాయి. ఇవి భూమిలో రంధ్రాలు చేసి జీవించడమే కాకుండా చెట్ల బెరడు, ఆకుల్లో నివాసం ఏర్పరాచుకుంటాయి. గిరిజనులు చీమలు నివసించే చెట్ల నుండి ఆకులను జాగ్రత్తగా తీస్తారు. ఈ అడవుల్లోని బొరియలలో పెద్ద మొత్తంలో ఎర్ర చీమలు కూడా కనిపిస్తాయి. అనేక మంది గిరిజనులు ఈ చీమలను శుభ్రం చేసి చట్నీ చేయకుండా పచ్చిగా కూడా తింటారు. ఈ ఎండబెట్టిన చీమలను కై చట్నీ అంటారు.

అయితే చట్నీకి GI ట్యాగ్ వచ్చిన తర్వాత.. ఇప్పుడు దీనికి భిన్నమైన గుర్తింపు వస్తుందని.. దీని ప్రయోజనాల గురించి ప్రజలకు తెలుస్తుందని భావిస్తున్నారు. ఇతర పచ్చళ్లు, చట్నీల మాదిరిగా చీమల చట్నీ అమ్మకాలు కూడా పెరగవచ్చు. జార్ఖండ్-ఛత్తీస్‌గఢ్ కాకుండా ఒడిశాకు మాత్రమే కై చట్నీకి GI ట్యాగ్ ఎందుకు వచ్చిందంటే.. ఒడిశాలో చేసిన ఈ చట్నీ రుచి, ఆకృతి చాలా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎర్ర చీమల చట్నీ

చట్నీని ఎలా చేస్తారంటే..

మయూర్‌భంజ్ జిల్లాతో పాటు ఒడిశా, జార్ఖండ్ ,ఛత్తీస్‌గఢ్‌లోని అనేక ఇతర ప్రాంతాల్లోని కుటుంబాలు సాంప్రదాయకంగా ఎర్ర చీమల చట్నీని తయారుచేస్తారు. ఈ పచ్చడిని  కై చట్నీ అని కూడా పిలుస్తారు. ఈ చట్నీ తయారీ కోసం ఆకుల నుంచి,  రంధ్రాల నుంచి ఎర్ర చీమలు, వాటి గుడ్లు సేకరిస్తారు.  అనంతరం  వాటిని శుభ్రం చేసి, ఎండబెడతారు. ఒక నెల తర్వాత ఎండిన చీమల్లో అల్లం, వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి మళ్లీ మెత్తగా చేస్తారు. ఈ విధంగా రుచికరమైన, కారంగా ఉండే రెడ్ చట్నీని తయారుచేస్తారు.

ఈ చట్నీలో విటమిన్ బి-12, ప్రొటీన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆదివాసుల విశ్వాసం.

ఎముకలు బలపడతాయి

ఈ చట్నీ తయారు చేసిన ఎర్ర చీమలు ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ చీమలలో అధికంగా విటమిన్ సి లభిస్తుంది. దీంతో ఈ ఎర్ర చీమల చట్నీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. ఇది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది శరీరంలో శక్తి స్థాయిని నిర్వహిస్తుంది. ఇంకా విశేషమేమిటంటే ఈ చీమల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా  ఉంటాయి.

అందుకే గిరిజనులు ఉపయోగిస్తున్నారు

ఈ ఎర్ర చీమలకు జీర్ణవ్యవస్థను అంటే జీర్ణక్రియను పటిష్టం చేసే గుణం కూడా ఉంది. అలాంటి ఎంజైమ్‌లు వాటిలో కనిపిస్తాయి. ఇవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ చట్నీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చీమలలో కేలరీలు, కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కడుపులో మంటను నిరోధించే సామర్థ్యం ఈ చట్నీకి ఉందని కూడా నమ్ముతారు.

ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల అనేక రకాల వ్యాధులను దానంతటదే నయం చేసే శక్తి ఉంది. సాంప్రదాయకంగా తయారు చేయబడిన ఆయుర్వేద మందులలో ఎర్ర చీమలను ఉపయోగిస్తారు. ఇది ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఈ చీమలు కీళ్ల నొప్పుల నుండి కూడా ఉపశమనాన్ని ఇస్తాయని నమ్ముతారు. గిరిజన ప్రాంతాల ప్రజలు ఈ ఎర్ర చీమల పచ్చడిని ఎక్కువగా చేస్తుంటారు. GI ట్యాగ్ తర్వాత  ఇప్పుడు ప్రపంచం కూడా ఈ చీమల పచ్చడి వైపు దృష్టి సారించే అవకాశం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..