- Telugu News Human Interest Milk Contains Alcohol: Elephant’s breast milk contains large amounts of glucosamine
Milk Contains Alcohol: పాలు తాగితే ప్రమాదమేనా.. ! మిల్క్ తాగితే మద్యం తాగినంత నిషా..
పాలు సంపూర్ణ ఆహారం. ఆరోగ్యానికి పాలు అమృతం లాంటివి అన్న విషయం పసిపిల్లల నుండి పండు ముసలి దాక అందరికి తెలిసిన విషయమే. చివరికి టి కాఫీ రూపంలోనూ దాదాపు ప్రతి ఒక్కరు పాలను విరివిగా స్వీకరిస్తారు. అయితే అమ్మపాలతో ఆవు పాలు సరిసమానం అంటారు. గేదె పాలు, ఆవు పాలతో పాటు మేక పాలను కూడా ఉపయోగిస్తారు. ఇంతవరకు చాల మందికి మత్తు ఇచ్చే పాలు ఉంటాయి అనే విషయం తెలియదు..
Sridhar Prasad | Edited By: Surya Kala
Updated on: Dec 25, 2023 | 10:55 AM

గత కొన్ని రోజులుగా కొన్ని వ్యాధుల నివారణకు గాడిద పాలు ఔషధాలుగా పనిచేస్తాయని చెబుతున్నారు. అయితే ఎక్కడ కూడా ఈ పాలలో ఆల్కహాల్ ఎక్కడా ఉండదు. ఇంతవరకు చాల మందికి మత్తు ఇచ్చే పాలు ఉంటాయి అనే విషయం తెలియదు..

మంచి కిక్కు ఇచ్చే ఆల్కహాల్ పాలు ఇచ్చే జంతువులు కూడా ఉన్నాయి అంటే నమ్ముతారా.. నమ్మాలి బాబు నమ్మాలి. బీరు రమ్ము విస్కీ కంటే ఎక్కువ నిషా ఇచ్చే పాలు ఇచ్చే జంతువూ సృష్టిలో ఉంది. అది ఏ జంతువు ఎక్కడ ఉంటుంది ఏ దేశం లో ఉంటుంది. ఈ రోజు తెలుసుకుందాం..

ఏనుగు ఈ జంతువు తెలియని వారు ఎవరు లేరు. భూమి మీద నివసించే అతి పెద్ద జంతువు ఏనుగు పాలు తాగుతారు. అయితే ఇలా ఏనుగు పాలను తాగితే ఏంటి పరిస్థితి అందరికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఏనుగు పాలల్లో 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది.

ఏనుగు తీసుకునే ఆహారంలో చెరుకు ఎక్కువగా ఉంటుంది. చెరుకును ఏనుగులు ఇష్టంగా తింటాయి మనం చాల సందర్బాల్లో చెరుకు పంటపై ఏనుగుల దాడి అనే వార్తలను చూస్తూనే ఉంటాం. చెరకులో అధిక సంఖ్యలో ఆల్కహాల్ ఉంటుంది.

ఏనుగు పాలు చాల ప్రమాదకరం వీటిలో ఉండే కెమికల్స్ మనుషులకు హాని చేస్తాయి. అందుకే మనుషులు తాగడానికి ఏనుగు పాలు పనికి రావు. ఏనుగు పాలల్లో బీటా కైసన్ ఉంటుంది. దీనివల్ల పాలలో భారీ మొత్తం లో లాక్టోస్ ఉంటుంది.

ముఖ్యంగా ఆఫ్రికన్ అడవి ఏనుగుల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. మనుషులు ఈ ఏనుగు పాలను రెండు స్పిప్స్ చేస్తే చాలు మూర్ఛ పోవడం ఖాయం అంటున్నారు వైద్యులు.

కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల కడుపు ఉబ్బరం వాంతులు విరేచనాలు లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఏనుగులు ప్రతి రోజు దాదాపు 18 గంటలు రకరకాల తిండి తింటాయి. దీంతో అనేక రకాల కెమికల్స్ ఏనుగు పాలలో ఉంటాయి. తాగితే మత్తునిచ్చే ఏనుగు పాల చరిత్ర ఇదీ..





























