Yukta Yoga: నేడు కుజుడు శుక్రుడు కలయిక.. ఏర్పడనున్న యుక్త యోగం.. ఈ రాశి వారికి ప్రేమ, వివాహం
కుజుడు తన సొంత ఇంట్లో వృశ్చికరాశిలో ఉన్నాడు. అదే సమయంలో స్వక్షేత్రం తులారాశిలో శుక్రుడు ఉన్నారు. అయితే ఈ రోజు శుక్రుడు తన రాశి గమనాన్ని మార్చుకుని కుజ గృహమైన వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. దీంతో యుక్త యోగ ఏర్పడింది. దీంతో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న కొన్ని రాశుల వారికి వివాహం యోగాన్ని కల్పిస్తుంది. అంతేకాదు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
మనిషి జాతకంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం. గ్రహాల్లో కుజుడు, శుక్రుడు ప్రత్యేక గ్రహాలుగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణించబడుతుంది. ముఖ్యంగా మనిషి వివాహం, ప్రేమకు సంబంధించిన విషయాలపై ఈ రెండు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రెండు గ్రహాలు నేటి నుంచి తమ రాశుల గమనాన్ని మార్చుకోనున్నాయి. కుజుడు తన సొంత ఇంట్లో వృశ్చికరాశిలో ఉన్నాడు. అదే సమయంలో స్వక్షేత్రం తులారాశిలో శుక్రుడు ఉన్నారు. అయితే ఈ రోజు శుక్రుడు తన రాశి గమనాన్ని మార్చుకుని కుజ గృహమైన వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. దీంతో యుక్త యోగ ఏర్పడింది. దీంతో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న కొన్ని రాశుల వారికి వివాహం యోగాన్ని కల్పిస్తుంది. అంతేకాదు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
వృశ్చిక రాశి: ఈ రాశిలో గ్రహాల యోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ప్రేమలో పడే అవకాశం ఉంది. అయితే ఎవరు నచ్చినా గుడ్డిగా ఇష్టపడకండి. మనసును అదుపులో ఉంచుకుని మంచి చెడుల గురించి అలోచించి ముందుకు సాగడం మంచిది.
మకర రాశి: ఈ రాశికి చెందిన యువతీయువకులు పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వీరి ప్రతిభ, సామర్థ్యం చూసి ఇతరులకు ప్రేమ పుడుతుంది. స్నేహం ప్రేమగా మారుతుంది.
కుంభ రాశి: ఈ రాశి వారు ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చు. అయితే వన్ సైడ్ లవ్ మాత్రమే ఉంటుంది. మీరు అవతలి వైపు నుండి ఎటువంటి రెస్పాన్స్ ను పొందలేరు. అంతేకాదు తమ గురించి అవతలివారు మనస్సులో ఏమనుకుంటున్నారో కూడా స్పష్టంగా తెలియదు. ఆతృతతో ప్రేమ గురించి ఎదురు చూడాల్సి వస్తుంది.
వృషభ రాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు. కనుక వృశ్చిక రాశికి .. వృషభ రాశికి చెందిన వారి పట్ల పరస్పర ప్రేమ కలిగే అవకాశం ఉంది. ప్రేమికుల వివాహాలు జరుగుతాయి.
మిథున రాశి: ఈ రాశి వారు ప్రేమలో పడతారు. అయితే వీరి ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం తక్కువ.. అయితే తమ ప్రేమ సక్సెస్ అవుతుందో లేదో అని మనసులో చాలా ఉత్సుకత ఉంది. బంధువుల మధ్య ప్రేమ పెరుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు