Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sagittarius Horoscope 2024: ఈ రాశికి చెందిన వారు తొందరపాటు తనం తగ్గించుకోవాల్సిందే.. కొత్త ఏడాదిలో ఎలా ఉండనున్నదంటే..

ఈ సంవత్సరం ధనుస్సు రాశిలో జన్మించిన వారికి మిశ్రమ  ఫలితాలనిస్తుంది. ఎటువంటి పరిస్థితి ఎదురైనా తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో, ఎలా సాధించాలో వీరికి  తెలుసు. వీరు తమ జీవితంలో వేగానికి ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు. అయితే కొంత అసహనానికి గురవుతారు..  అతిగా ఉత్సాహంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. తొందరపాటు తనం వలన కొన్నిసార్లు ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. 2024 సంవత్సరం ప్రారంభంలో వీరు  మితిమీరిన ఉత్సాహభరితమైన ధోరణికి దూరంగా ఉండాలి. ఈ రోజు కొత్త ఏడాది కెరీర్, ప్రేమ, ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. 

Sagittarius Horoscope 2024: ఈ రాశికి చెందిన వారు తొందరపాటు తనం తగ్గించుకోవాల్సిందే.. కొత్త ఏడాదిలో ఎలా ఉండనున్నదంటే..
Sagittarius Horoscope 2024
Follow us
Surya Kala

|

Updated on: Dec 26, 2023 | 7:26 AM

జీవితంలో కష్టాలు, నష్టాలు, అపజయాలు రావడం సర్వసాధారణం.. అయితే తమ వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకుని విజయం వైపు పయనించేవాళ్లే ధీరుడు అని జ్యోతిష్యులు చెప్పారు. ఈ సూత్రాన్ని జీవితంలోకి అన్వయించుకుంటూ 2024 సంవత్సరంలో అడుగుపెడితే.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా పోరాటం చేసి సక్సెస్ ను సొంతం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ధనుస్సు రాశికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. ఈ సంవత్సరం ధనుస్సు రాశిలో జన్మించిన వారికి మిశ్రమ  ఫలితాలనిస్తుంది. ఎటువంటి పరిస్థితి ఎదురైనా తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో, ఎలా సాధించాలో వీరికి  తెలుసు. వీరు తమ జీవితంలో వేగానికి ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు. అయితే కొంత అసహనానికి గురవుతారు..  అతిగా ఉత్సాహంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. తొందరపాటు తనం వలన కొన్నిసార్లు ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. 2024 సంవత్సరం ప్రారంభంలో వీరు  మితిమీరిన ఉత్సాహభరితమైన ధోరణికి దూరంగా ఉండాలి. ఈ రోజు కొత్త ఏడాది కెరీర్, ప్రేమ, ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

ప్రేమ-వివాహం

ఈ సంవత్సరం ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రేమ, వివాహంపై మిశ్రమ ప్రభావాలను చూపుతుంది. కొత్త ఏడాదిలో ప్రథమార్ధం మంచిది కాదు.. అయితే సంవత్సరం రెండవ భాగంలో చాలా సంతోషంగా సాగుతారు.  సంవత్సరం మొదటి అర్ధభాగంలో వీరు తాము ప్రేమిస్తున్నవారిని  లేదా జీవిత భాగస్వామిని విశ్వసించాలి.  గౌరవాన్ని ఇవ్వాలి. మొండితనాన్ని వదులుకోవలసి ఉంటుంది.. లేకుంటే ఆ ప్రభావం సంబంధాలపై పడి కలతలు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం ద్వితీయార్ధం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. భాగస్వామ్యుల మధ్య ప్రేమ వికసిస్తుంది. ఏడాదిలో రెండో సగంలో  వివాహం ప్రయత్నాలు ఫలించి నిశ్చితార్థం జరిగే సూచనలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులు

ఈ సంవత్సరం కుటుంబ విషయాలపై మిశ్రమ ప్రభావాలు ఉంటాయి. జాతకం ప్రకారం శనీశ్వరుడు రెండవ ఇంట్లో ఉన్నాడు. అంతేకాదు కేతువు నాల్గవ ఇంట్లో ఉండనున్నాడు. దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు  కుటుంబ విషయాలను చాలా జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది. లేకపోతే  విభేదాలు తలెత్తవచ్చు. సంవత్సరం మొదటి అర్ధభాగంలో కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందే అవకాశం ఉంది. అలాంటి సమయంలో చిన్న విషయాలను పట్టించుకోకుండా.. ప్రేమ మరియు ఆప్యాయతతో సమస్యను పరిష్కరించుకోవాలి. సంవత్సరం ద్వితీయార్ధంలో కుటుంబంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.  కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోతారు. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు కూడా జరగవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యం ఎలా ఉండనున్నదంటే

ఈ సంవత్సరంధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం మొదటి సగం అంత బాగా లేదు.. రెండవ సగం కొంచెం మెరుగ్గా ఉంటుంది.  సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. ఈ సమయంలో శారీరక, మానసిక బలహీనతను కలిగి ఉండవచ్చు. కొన్ని కడుపు సంబంధిత వ్యాధులు కూడా మిమ్మల్ని బాధించవచ్చు. అయితే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా దానిని నివారించవచ్చు. అలాగే బయటి ఆహారం, పానీయాలకు దూరంగా ఉండాలి. సంవత్సరం ద్వితీయార్ధం ఇంకా మెరుగ్గా ఉంటుంది. అయితే అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

కెరీర్ పరంగా ఎలా ఉండనున్నదంటే

కెరీర్ పరంగా ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేదు. సంవత్సరం ప్రారంభంలో చిన్న పనులకు కూడా కష్టపడవలసి ఉంటుంది. అదే సమయంలో వ్యాపారస్తులు చిన్న, పెద్ద ఇతర ప్రతిపాదనలను పొందుతారు. అయితే వీటిల్లో ఉత్తమ ప్రతిపాదనను ఎంచుకుని ముందుకు అడుగెయ్యాలి. లేదంటే నష్టపోవచ్చు. ఉద్యోగస్తుల విషయంలోనూ ఇదే పరిస్థితి. మంచి ఉద్యోగాలను ఎంచుకోవలసి ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్థంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ సమయంలో వ్యాపారంలో లాభాన్ని పొందవచ్చు. మొత్తానికి ఈ ఏడాది ధనుస్సు రాశికి చెందిన వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆదాయం స్థిరంగా ఉండదు. లాభ నష్టాల సంగమంగా సాగుతుంది. ఎప్పటికప్పుడు డబ్బు అందుకుంటారు. దీంతో ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనిపించదు. ద్వితీయార్ధంలో మీ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు వెయ్యి సార్లు ఆలోచించండి. సాధారణంగా ఎవరినీ నమ్మవద్దు.

విద్యార్థులకు ఎలా ఉండనున్నదంటే

ధనస్సు రాశులకు చెందిన స్టూడెంట్స్ కు విద్య పరంగా ఈ సంవత్సరం బాగుంటుంది. ఏడాది మొదటి అర్ధభాగంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది లేదా విజయాన్ని సాధించడానికి మీరు అవసరమైన దానికంటే ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది. సక్సెస్ అందుకుంటారు. పరిశోధనా పనిలో నిమగ్నమైన విద్యార్థులకు ఈ సమయం మంచిది. సంవత్సరం ద్వితీయార్ధంలో చదువులకు మంచి రిజల్ట్స్ అందుకునే అవకాశం ఉంది. ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా లేదా విదేశాల్లో చదువుకోవాలనుకున్నా ఈ సమయం శుభ సమయం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు