Horoscope Today: ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి సోమవారం దిన ఫలాలు ఇలా..
దిన ఫలాలు (డిసెంబర్ 25, 2023): మేషరాశి వారి భాగస్వామ్య వ్యాపారాల్లో ఒకటి రెండు ప్రధాన సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. వృషభరాశి వారు గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిథునరాశి వారికి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని లాభాలు చేతికి అందివస్తాయి. మేష రాశి మొదలుకుని మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
దిన ఫలాలు (డిసెంబర్ 25, 2023): మేషరాశి వారి భాగస్వామ్య వ్యాపారాల్లో ఒకటి రెండు ప్రధాన సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. వృషభరాశి వారు గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిథునరాశి వారికి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని లాభాలు చేతికి అందివస్తాయి. మేష రాశి మొదలుకుని మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): భాగస్వామ్య వ్యాపారాల్లో ఒకటి రెండు ప్రధాన సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఉద్యోగ వాతా వరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో సమస్యలుంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలి స్తుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తగ్గుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని లాభాలు చేతికి అందివస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొన్ని వివాదాలు, సమస్యలు సర్దుబాటు అవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. బాకీలు వసూలవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారాల్లో కలిసి వస్తుంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. శుభకార్యాల మీద బాగా ఖర్చవుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆశించిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆదాయంలో మెరుగుదల కనిపిస్తోంది. తోబుట్టువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత పడాల్సి ఉంటుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యత లను అప్పగించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. మాట చెల్లుబాటు అవు తుంది.
- వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ): వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం అంచనాలను మించుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలపై కొద్దిగా శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): కొత్త ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూల మవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితులకు అండగా నిలబడతారు. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. బంధువర్గం నుంచి విమర్శలు వస్తాయి. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఒకరిద్దరు బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం కూడా ఉంది. ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. మీ సలహాలు, సూచనలకు సర్వత్రా విలువ ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.