Dwarka: ద్వారకలో 5000 వేల నాటి దృశ్యం.. శ్రీ కృష్ణుడు జ్ఞాపకార్ధం వేలాది మహిళలు మహారాసుల ప్రదర్శన.. ప్రపంచ రికార్డ్

బ్రహ్మ ముహూర్తంలో 37 వేల మంది మహిళలు కలిసి మహా రాస్' ప్రదర్శించారు. ఈ అందమైన దృశ్యాన్ని  డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. సంప్రదాయానికి చెందిన అద్భుతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మహారాస్ ఆడుతున్న మహిళలకు సంబంధించిన అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. 37 వేల మంది అహిర్ మహిళలు కలిసి రాస్ వాయించి ప్రపంచ రికార్డుని సృష్టించారు.

Dwarka: ద్వారకలో 5000 వేల నాటి దృశ్యం.. శ్రీ కృష్ణుడు జ్ఞాపకార్ధం వేలాది మహిళలు మహారాసుల ప్రదర్శన.. ప్రపంచ రికార్డ్
Maharaas In Dwaraka
Follow us
Surya Kala

|

Updated on: Dec 25, 2023 | 8:25 AM

శ్రీ కృష్ణుడు ఏలిన ద్వారక ఓ మధుర ఘట్టానికి వేదిక అయింది. సుమారు 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని కాలంలో చేసిన అతీంద్రియ కర్మలు మరోసారి పునరావృతం చేశారు వేలాది మహిళలు. గుజరాత్ లోని దేవ భూమి ‘ద్వారకా’ ప్రాంగణంలో శ్రీకృష్ణుడిపై భక్తిపారవశ్యంలో మునిగితేలుతూ వేలాది మంది  మహిళలు మహా రాసులను ఆచరించి అహిర్ సంఘం చరిత్ర సృష్టించింది. దేశ విదేశాల్లో నివసిస్తున్న  అహిర్ వర్గానికి చెందిన మహిళలు ద్వారకకు వచ్చి ‘మహా రాస్’ ప్రదర్శించారు.

బ్రహ్మ ముహూర్తంలో 37 వేల మంది మహిళలు కలిసి మహా రాస్’ ప్రదర్శించారు. ఈ అందమైన దృశ్యాన్ని  డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. సంప్రదాయానికి చెందిన అద్భుతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మహారాస్ ఆడుతున్న మహిళలకు సంబంధించిన అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. 37 వేల మంది అహిర్ మహిళలు కలిసి రాస్ వాయించి ప్రపంచ రికార్డుని సృష్టించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ పూనమ్ బెన్ మేడమ్ కూడా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి ద్వారకలో ఆల్ ఇండియా మహారస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అహిర్ కమ్యూనిటీకి చెందిన 37 వేల మందికి పైగా మహిళలు మహారాస్ నిర్వహించారు. శ్రీ కృష్ణ భగవానుడి జన్మస్థలమైన ద్వారకలో అహిర్ మహిళలు తమ పురాతన సంప్రదాయ దుస్తులను ధరించి మహారాశులను ప్రదర్శించి చరిత్ర సృష్టించారు.

మహిళల మహారాస్

ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళలు

యాత్రాధామ్ ద్వారక పవిత్ర భూమిపై అహిర్ సంఘంలో మహారాస్ నిర్వహించబడింది. ఈ సంఘంలో గత 9 నెలలుగా మహిళలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 37 వేల మందికి పైగా మహిళలు మహారాస్‌ కోసం  తమ సంప్రదాయ ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. 800 బిగాల భూమిలో ఈ మహా రాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా అహిర్ సంఘంలోని వివిధ వర్గాలు ఒకే గొడుగు కిందకు చేరాయి. దేశవ్యాప్తంగా అహిర్ కమ్యూనిటీకి చెందిన సుమారు 1.5 లక్షల మంది ఈ నృత్యాన్ని వీక్షించారు.

గుజరాత్ నలుమూలల నుంచి మహిళలు

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుజరాత్ నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా మహిళలు తరలివచ్చారు. కచ్‌లోని వ్రజ్వానీ గ్రామంలో డ్రమ్మర్ డ్రమ్స్ వాయించడం ప్రారంభించినప్పుడు, అహిర్ కమ్యూనిటీకి చెందిన 140 మంది మహిళలు తమ పనిని అసంపూర్తిగా వదిలి రాస్ వాయించడానికి వెళ్ళారని నమ్ముతారు. జానపద కథల ప్రకారం.. శ్రీకృష్ణుడు ఈ డ్రమ్ వాయిస్తుండగా.. స్త్రీలందరూ కృష్ణుడితో రాస్ వేయించడానికి వెళ్లారు. ఆ స్థలంలో ఇప్పటికీ స్త్రీలందరి సమాధులు ఉన్నాయి. బాణాసురుడి కుమార్తె, శ్రీ కృష్ణుడి కోడలు ఉష గౌరవార్థం ఈ మహా రాసులను నిర్వహించినట్లు నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. భగవత్ పురాణంలో ఉష ప్రస్తావన ఉంది. బాణాసురుడు శివుని భక్తుడు.

ఇప్పుడు కూడా అదే తరహాలో మహారాస్ నిర్వహించగా.. దీని ప్రధాన లక్ష్యం ప్రపంచ వేదికపై శాంతిని కొనసాగించడం.. ప్రజలకు పరిశుభ్రతకు సంబంధించిన సందేశం ఇవ్వడం. ఈ మహారాసుల్లో రెండు లక్షల మందికి పైగా ‘ప్రసాదం’ కూడా తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్