AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: చంద్రబాబు నివాసంలో ముగిసిన మహా చండీ యాగం.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించిన టీడీపీ అధినేత

టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసంలో మహా చండీ యాగం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌ సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు చంద్రబాబు. చంద్రబాబు దంపతులతో గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40మంది రుత్వికులు, మహా చండీ యాగం, సుదర్శన నారసింహ హోమం చేయించారు. ఇక.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయి, జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. వరుసగా దేవాలయాలను సందర్శించారు. 

Chandrababu Naidu: చంద్రబాబు నివాసంలో ముగిసిన మహా చండీ యాగం.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించిన టీడీపీ అధినేత
Chandra Babu Yagam
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 25, 2023 | 11:12 AM

Share

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలైంది. రాజకీయ నేతల ఎన్నికల బరిలో దిగేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన తర్వాత ప్రధాన పార్టీలన్నీ అలెర్ట్‌ అయ్యాయి. ఆయా పార్టీల అధినేతలు ఎవరికివారుగా వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. ఇక.. టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసంలో మూడు రోజులుగా జరుగుతున్న యాగక్రతువు ముగిసింది. ఈ నెల 22న ఉండవల్లి నివాసంలో చంద్రబాబు దంపతులు మహా చండీ యాగం, సుదర్శన నారసింహ హోమం చేపట్టారు. అయితే.. ఆదివారం పూర్ణాహుతితో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహా చండీ యాగం ముగిసింది. పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. యాగం చివరి రోజున చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

చంద్రబాబు దంపతులతో గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40మంది రుత్వికులు, మహా చండీ యాగం, సుదర్శన నారసింహ హోమం చేయించారు. ఇక.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయి, జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. వరుసగా దేవాలయాలను సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామి, బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. అయితే.. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ముందుగానే ఆలయాల బాట పట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ వస్తే ప్రచారం, వ్యూహాల్లో మునిగిపోవాల్సి ఉండటంతో ముందుగానే ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. యాగం ముగిసిన నేపథ్యంలో ఇకపై రాజకీయ వ్యూహాలకు చంద్రబాబు పదును పెట్టనున్నారు. ఇప్పటికే.. దూకుడు పెంచిన టీడీపీ.. చేరికలతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ నింపే అవకాశాలు ఉన్నాయి. అటు.. సీఎం జగన్‌ సైతం.. టీడీపీ కంటే ముందుగానే.. పొలిటికల్‌ స్ట్రాటజీలు తెరపైకి తెచ్చారు. సిట్టింగ్‌లను మార్చుతూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌.. యాగాలకు పెట్టింది పేరు. ఆయన చాలాసార్లు యజ్ఞయాగాలు నిర్వహించారు. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన యాగం చేశారు. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించారు. నర్తనకాళి అవతారంలో ఉన్న రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో ఈ యాగ క్రతువులు జరిగాయి. సరిగ్గా ఇలాగే అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు కూడా చేయడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..