Visakhapatnam: గెస్ట్ హౌజ్‌లోని బెడ్ రూమ్‌లో దుకాణం పెట్టేసిన 8 అడుగుల కింగ్ కోబ్రా..

మంగమారిపేట రామాద్రి వద్ద గల ఆ గెస్ట్ హౌస్ లో 8 అడుగుల ఆ కోడి నాగు పడగ విప్పింది.. అదే గెస్ట్ హౌస్ నివాసం ఉంటున్న వాక్ మెన్ కుమార్ శుక్రవారం సాయంత్రం పామును చూసి బెంబేలెత్తి పోయాడు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో స్నేక్ క్యాచర్ నంబర్ సేవ్ చేసుకున్న కుమార్ వెంటనే ఫోన్ కొట్టాడు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ శ్రీని వాస్ చాకచక్యంగా పామును పట్టుకుని జన సంచారం లేని చోట విడిచిపెట్టారు

Visakhapatnam: గెస్ట్ హౌజ్‌లోని బెడ్ రూమ్‌లో దుకాణం పెట్టేసిన 8 అడుగుల కింగ్ కోబ్రా..
King Cobra Hulchul In Visak
Follow us
Eswar Chennupalli

| Edited By: Surya Kala

Updated on: Dec 23, 2023 | 1:50 PM

అందమైన విశాఖలో సముద్రతీరాన సువిశాలమైన గెస్ట్ హౌస్ అది. ఎప్పుడైనా ఎవరైనా అతిథులు వస్తే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఫామ్ హౌస్ లా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ ఇది. సాధారణంగా అతిథులకు మాత్రమే ప్రవేశం ఉండే ఆ గెస్ట్ హౌస్ లోకి ఓ కింగ్ కోబ్రా అతిధిలా ప్రవేశించింది. ఎవరికీ తెలియకుండా అతిధి గృహం లోని ఒక బెడ్ రూం కు వెళ్ళింది. బోర్ కొట్టిందో ఏమో కానీ బుసలు కొట్టడం ప్రారంభించింది. మొదట ఏ శబ్దమో అర్దం కాని ఆ గెస్ట్ హౌజ్ వాచ్ మెన్ తర్వాత అనుమానం వచ్చి గెస్ట్ హౌస్ లోకి తొంగి చూసాడు. ప్రాణాలు పోయేంత పని అయింది. అందులోనూ అతిధి గృహం లో ని బెడ్ రూం లోనే ఏకంగా ఆ 8 అడుగుల కింగ్ కోబ్రా దుకాణం పెట్టడం తో కాసేపు ఆందోళన కు గురైన వాచ్ మెన్ స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు.

ఎంత పెద్ద కింగ్ కోబ్రా నో ఒకసారి మీరే చూడండి.

ఇవి కూడా చదవండి

మంగమారిపేట రామాద్రి వద్ద గల ఆ గెస్ట్ హౌస్ లో 8 అడుగుల ఆ కోడి నాగు పడగ విప్పింది.. అదే గెస్ట్ హౌస్ నివాసం ఉంటున్న వాక్ మెన్ కుమార్ శుక్రవారం సాయంత్రం పామును చూసి బెంబేలెత్తి పోయాడు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో స్నేక్ క్యాచర్ నంబర్ సేవ్ చేసుకున్న కుమార్ వెంటనే ఫోన్ కొట్టాడు

సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ శ్రీని వాస్ చాకచక్యంగా పామును పట్టుకుని జన సంచారం లేని చోట విడిచిపెట్టారు. కొండ ప్రాంతం కావడం తో తరచూ పాములు నివాసాల్లోకి రావడం ఆనవాయితీ గా మారింది కానీ పొరపాటున అవి కాటేస్తే తలెత్తే ప్రమాదాలను ఊహించుకుని స్థానికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ బతుకుతూ ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..