Sankranti: కోనసీమలో మొదలైన సంక్రాంతి సందడి .. హైటెక్ హరిదాసు వీడియో వైరల్..

నెలరోజులు పాటు వీధి వీధినా హరినామన్ని గానం చేసి.. సంక్రాంతి రోజున స్వయంపాకం తీసుకుని ప్రజలను దీవిస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు హరిదాసుల గమనంలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నడుచుకుంటూ ఇంటి ఇంటికి చేరుకునే హరిదాసులు ఇప్పుడు హై టెక్ పద్దతులను పాటిస్తున్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

Sankranti: కోనసీమలో మొదలైన సంక్రాంతి సందడి .. హైటెక్ హరిదాసు వీడియో వైరల్..
Haridasu Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2023 | 1:29 PM

హిందువుల పండగల్లో సంక్రాంతి పెద్ద పండగ. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ గుర్తుకొస్తుంది. దాదాపు నెల రోజుల ముందే సంక్రాంతి పండగ సందడి మొదలవుతుంది. ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలతో రోజూ పండగ సందడిని ప్రతి ఒక్క ఇంటికి తీసుకొస్తుంది. గోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమలో హరినామ సంకీర్తన చేస్తూ గ్రామగ్రామాన  బిక్షాటన చేస్తారు. ధనుర్మాసం రావడంతోనే హరిదాసు సందడి మొదలయింది. హరిదాసు చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిరునామంతో హరిలో రంగ హరి అంటూ కీరిస్తూ ఇంటింటికి చేరుకుంటారు.

హరిదాసుని పరమాత్మతో సమానం హిందువుల నమ్మకం. ఈ మాసంలో చేసే దానధర్మాలను అందుకుని  ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని హరిదాసులు దీవిస్తారు. నెలరోజులు పాటు వీధి వీధినా హరినామన్ని గానం చేసి.. సంక్రాంతి రోజున స్వయంపాకం తీసుకుని ప్రజలను దీవిస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు హరిదాసుల గమనంలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నడుచుకుంటూ ఇంటి ఇంటికి చేరుకునే హరిదాసులు ఇప్పుడు హై టెక్ పద్దతులను పాటిస్తున్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

సంక్రాంతి నెల ప్రారంభం కావడంతో అమలాపురంలో హైటెక్ హరిదాసులు సందడి చేస్తున్నారు. సాధారణంగా హరిదాసు నెత్తిపై కంబలి పెట్టుకుని నడుచుకుంటూ ఇంటింటా తిరుగుతూ హరి రామ సంకీర్తనలు ఆలపిస్తారు. కాలానికి అనుకూలంగా వచ్చిన మార్పుల్లో భాగంగా హైటెక్ హరిదాసులు వస్తున్నారు. మోటర్ బైక్లపై హైటెక్ హరిదాసులు, డీజే సౌండ్ చేస్తూ ఇంటింటా తిరుగుతూ స్వయంపాకం అందుకుంటున్నారు. హైటెక్ హరిదాసులు జనాన్ని ఆకట్టుకుంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..
శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
సంజు శాంసన్ త్యాగం..ఆ యువ ఆటగాడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు!
సంజు శాంసన్ త్యాగం..ఆ యువ ఆటగాడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు!
బాక్సింగ్ డే టెస్ట్: భారత్-ఆస్ట్రేలియా ప్రాక్టీస్ పిచ్ వివాదం
బాక్సింగ్ డే టెస్ట్: భారత్-ఆస్ట్రేలియా ప్రాక్టీస్ పిచ్ వివాదం