AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thailand Flights: ఇది కదా గుడ్ న్యూస్ అంటే..! ఇక ఏపీ నుంచే థాయ్‌లాండ్‌కు డైరెక్ట్ విమానాలు

విశాఖపట్నం నుంచి నుంచి బ్యాంకాక్‌ వెళ్లేవారికి 2024 ఏప్రిల్‌ నుంచి ఈ డైరెక్ట్ సర్వీస్‌లు అందుబాటులో ఉండబోతున్నాయి. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసులు నడపనున్నారు. మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆమేరకు షెడ్యూల్ ను అనౌన్స్ చేసింది

Thailand Flights: ఇది కదా గుడ్ న్యూస్ అంటే..! ఇక ఏపీ నుంచే థాయ్‌లాండ్‌కు డైరెక్ట్ విమానాలు
Vizag To Bangkok Direct Flight
Eswar Chennupalli
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 23, 2023 | 1:25 PM

Share

థాయ్‌లాండ్ అనే పేరు వింటేనే ఒక ఉల్లాసం, ఒక ఉత్సాహం. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్లి సేద తీరేవాళ్ళు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ప్రఖ్యాత దర్శకులు పూరి జగన్నాథ్‌తో సహా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఏకంగా అక్కడే మకాం పెట్టీ కథలు వినడం దగ్గర నుంచి సినిమాలు తీయడం వరకు అక్కడే చేస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరీ ఖర్చుతో కూడిన వ్యవహారం కాకపోవడం, ప్రయాణ సమయం కూడా తక్కువ కావడంతో ఎక్కువ మంది తరచూ థాయ్‌లాండ్ వెళ్లడం పరిపాటిగా మారింది.

ఈ రష్‌ను దృష్టిలో ఉంచుకునే విమానయాన సంస్థలు తమ విమానాలను రద్దీ రూట్లలోనే తిప్పుతుంటాయి. ఆ కోవలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లేవారికి థాయ్ ఎయిర్ ఏషియా అనే విమానయాన సంస్థ ఒక శుభవార్తను అందించింది. విశాఖట్నం నుంచి బ్యాంకాక్‌కు నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీస్ నడపాలని నిర్ణయించింది. ఏకంగా వారంలో మూడు రోజుల పాటు ఈ నాన్ స్టాప్ సర్వీసులను ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నం నుంచి నడపాలని షెడ్యూల్ చేసింది.

ప్రస్తుతం విశాఖ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు లేవు. కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ ద్వారానే థాయ్‌లాండ్ వెళ్ళాలి ఉంది. ఇప్పుడు డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ అందుబాటులోకి వస్తుండటంతో ఇక్కడి నుంచి ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్ నుంచి సర్వీసులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నం నుంచి నుంచి బ్యాంకాక్‌ వెళ్లేవారికి థాయ్ ఎయిర్ ఏషియా ఈ శుభవార్తను క్రిస్టమస్, నూతన సంవత్సర కానుకగా అందించింది. మార్చి నెల దాకా పెద్ద సీజన్ కాదు కాబట్టి ఏప్రిల్ నుంచి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది థాయ్ లాండ్ కే చెందిన అంతర్జాతీయ విమాన సర్వీస్‌ సంస్థ థాయ్ ఎయిర్‌ ఏషియా.

వారానికి మూడు రోజులు

2024 ఏప్రిల్‌ నుంచి ఈ డైరెక్ట్ సర్వీస్‌లు అందుబాటులో ఉండబోతున్నాయి. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసులు నడపనున్నారు. మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆమేరకు షెడ్యూల్ ను అనౌన్స్ చేసింది.

టైమింగ్స్ ఇలా…

విశాఖపట్నం – థాయ్‌లాండ్‌కు మధ్య A320, అలాగే A321 ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపాలని నిర్ణయించిన ఎయిర్ ఏషియా మంగళ, గురు, మరియు శనివారాల్లో వారానికి మూడు సార్లు సర్వీసును నిర్వహించాలని షెడ్యూల్ చేసింది

ఈ షెడ్యూల్‌ ప్రకారం విమానం బ్యాంకాక్ నుండి రాత్రి 8 గంటలకు వైజాగ్ చేరుకోవడం, వైజాగ్ నుండి రాత్రి 8.45 గంటలకు బయలుదేరి, తెల్లవారుజామున ఒంటి గంటకు తిరిగి బ్యాంకాక్ చేరుకునేలా టైమింగ్‌ను నిర్దేశించింది. ఆ మేరకు త్వరలోనే టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాబోతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…