Prabhas Fan Died: దారుణం.. ఫ్లెక్సీ కడుతూ.. చనిపోయిన ప్రభాస్ ఫ్యాన్.. వీడియో.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. సలార్ సినిమా విడుదల సందర్భంగా కరెంట్ షాక్తో ఓ అభిమాని మృతి చెందాడు. పట్టణంలోని రంగ థియేటర్ ఎదుట ఒక ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాని బాలరాజు కరెంట్ షాక్ కు గురై మృతి చెందాడు. తమ అభిమాన హీరో నటించిన సలార్ సినిమా కోసం అనంతపురం తపోవనానికి చెందిన బాలరాజు.. అతడి స్నేహితులు ఫ్లెక్సీ ఫ్రేమ్ తయారు చేయించి స్వయంగా వారే కడుతుండగా..
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. సలార్ సినిమా విడుదల సందర్భంగా కరెంట్ షాక్తో ఓ అభిమాని మృతి చెందాడు. పట్టణంలోని రంగ థియేటర్ ఎదుట ఒక ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాని బాలరాజు కరెంట్ షాక్ కు గురై మృతి చెందాడు. తమ అభిమాన హీరో నటించిన సలార్ సినిమా కోసం అనంతపురం తపోవనానికి చెందిన బాలరాజు.. అతడి స్నేహితులు ఫ్లెక్సీ ఫ్రేమ్ తయారు చేయించి స్వయంగా వారే కడుతుండగా.. ఫ్రేమ్ కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంట్ తీగలను తాకింది. దీంతో కరెంట్ షాక్కు గురై బాలరాజు అక్కడికక్కడే కన్నుమూశాడు. గజేంద్ర అనే యువకుడు గాయపడ్డాడు.
ప్రమాదం నుంచి మరో నలుగురు యువకులు బయటపడ్డారు. కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని బాలరాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతిచెందిన బాలరాజు దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో నివాసం ఉంటున్నాడు. బాలరాజు హీరో ప్రభాస్ వీరాభిమాని. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత

